రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నిర్మాణ సామాగ్రి వాహనాల భద్రతకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసిన రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ
Posted On:
28 OCT 2020 2:35PM by PIB Hyderabad
నిర్మాణ సామాగ్రి వాహనాలు (సిఇవి)కు సంబంధించిన భద్రతా ప్రమాణాలపై రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 27 అక్టోబర్ 2020న జిఎస్ఆర్ 673 (ఇ) ఉత్తర్వులను విడుదల చేసింది. ఆ వాహనాల వినియోగంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర వాహనాలతో కలిసి రోడ్డుపై ప్రయాణించినప్పుడు చేపట్టాల్సిన చర్యలను నోటిఫికేషన్‌లో వివరించారు. నోటిఫికేషన్‌లో వివరించినట్టు దశలవారీగా (మొదటి దశ (ఏప్రిల్ 2021); (రెండో దశ (ఏప్రిల్ 2024) ఇవి అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం సీఎంవిఆర్ 1989 లోని భద్రతా నియమాలను పాటించడం నిర్మాణ సామగ్రి వాహనాలకు తప్పనిసరి
ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్-160 ప్రకారం సిఇవిలకు పలు భద్రతా నియమాలు తప్పని సరి. విజువల్ డిస్‌ప్లే, పని ప్రదేశంలో భద్రతా ప్రమాణాలు, లోహ రహిత ఇంధన ట్యాంకులు, మినిమమ్ యాక్సస్ డైమన్షన్స్, దశల వారీ యాక్సెస్ సిస్టమ్స్, వెలుపలకు వచ్చేందుకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం, మెట్ల మార్గం, నిర్వహణ డోర్లు, హ్యాండ్‌రైల్ మరియు హ్యాండ్‌హోల్డ్స్, గార్డ్‌లు, యంత్రాలకు అనుసంధానించిన అలారంలు, ఆర్టికల్ ఫ్రేమ్ లాక్, లిఫ్ట్ ఆర్మ్ సపోర్ట్ డివైస్, ఆపరేటర్స్ సీట్, ఎలక్ట్రో మాగ్నెటిక్ కంపాటబిలిటీ , సీట్ బెల్ట్ మరియు సీట్ బెల్ట్ ఎంకరేజెస్, రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ (ఆర్‌వోపీఎస్), టిప్ ఓవర్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్ (టివోపిఎస్), ఫాలింగ్ ఆబ్జెక్ట్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ (ఎఫ్‌వోపిఎస్S), ఆపరేటర్ ఫీల్డ్ ఆన్ వ్యూ, సస్పెండ్ సీట్లు మొదలయినవి.
ఆపరేటర్ స్థాయిలో శబ్దాన్ని కొలిచేందుకు సిఎంవిఆర్ 96-ఏ మరియు 98-ఏలో అదనంగా సూచించబడ్డాయి. అలాగే బ్రేక్‌లు మరియు స్టీరింగ్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై గతంలో 28 జూలై 2000న జీఎస్‌ఆర్ 642 (ఈ) ద్వారా తెలియజేయడం జరిగింది.
వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడానికి నిర్మాణ సామగ్రి వాహనాలను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ క్రమంలో ఆపరేటర్ యొక్క భద్రత కోసం మరియు అటువంటి వాహనాలు ప్రజా రహదారులపై ప్రయణించినప్పుడు ఇతర వాహనాల రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల కోసం ఈ నియమాలు ప్రతిపాదించబడ్డాయి.
ప్రజల నుండి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ ఈ ముసాయిదా నోటిఫికేషన్ 2020 ఆగస్టు 13 న జారీ చేయబడింది.
GSR 673 (E) లో PDF చూడటానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు.
***
(Release ID: 1668223)