ఆర్థిక మంత్రిత్వ శాఖ
రెండు నిబంధనలను ఆమోదించిన ఐఎఫ్‌ఎస్‌సిఎ అథారిటీ బోర్డు
Posted On:
27 OCT 2020 10:41PM by PIB Hyderabad
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సిఎ) సమావేశం నేడు జరిగింది
వివరణాత్మక చర్చల అనంతరం ఈ క్రింది నిబంధనలను బోర్డు ఆమోదించింది:
a. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (బులియన్ ఎక్స్ఛేంజ్) రెగ్యులేషన్స్, 2020
ఐఎఫ్‌ఎస్‌సిఎ చట్టం, 2019 ప్రకారం ఐఎఫ్‌ఎస్‌సిఎ సిఫారసు మేరకు భారత ప్రభుత్వం.. బులియన్ స్పాట్ డెలివరీ కాంట్రాక్ట్ మరియు బులియన్ డిపాజిటరీ రశీదును (అంతర్గతంగా బులియన్) ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మరియు సంబంధిత సేవలను ఫైనాన్షియల్ సర్వీసెస్‌గా 2020 ఆగస్టు 31 న తెలియజేసింది.
బులియన్ ఎక్స్ఛేంజ్ కు సంబంధించిన కార్యాచరణ బాధ్యత ఐఎఫ్‌ఎస్‌సిఎకు అప్పగించబడింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒకే రెగ్యులేటర్.. ఎక్స్ఛేంజ్ లో వర్తకం చేయబడే బులియన్ స్పాట్ ను మరియు డెరివేటివ్ కాంట్రాక్టులను నియంత్రిస్తుంది.
ఈ రోజు సమావేశంలో తన ముసాయిదా బులియన్ నిబంధనలను అథారిటీ ఆమోదించింది. బులియన్ వ్యాపారం కోసం బులియన్ ఎక్స్ఛేంజ్, డిపాజిటరీ, క్లియరింగ్ హౌస్ ల ఏర్పాటు అనుకూలమైన వ్యవస్థకు రూపకల్పన చేయడనికి ఇది ఉపయోగపడుతుంది.
బులియన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్స్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు:
* బులియన్ ఎక్స్ఛేంజ్ మరియు క్లియరింగ్ కార్పొరేషన్ యొక్క విధులు మరియు సాధారణ బాధ్యతలు
* బులియన్ ఎక్స్ఛేంజ్ మరియు క్లియరింగ్ కార్పొరేషన్ యొక్క యాజమాన్యం మరియు పాలన నిర్మాణం
* బులియన్ డిపాజిటరీలు, పాల్గొనేవారు మరియు ప్రయోజనకరమైన యజమానుల హక్కులు మరియు బాధ్యతలు
* అథారిటీ వాల్ట్ మేనేజర్‌కు రిజిస్ట్రేషన్ మంజూరు
* బులియన్ డిపాజిటరీల పాత్ర
* బులియన్ మార్పిడికి సంబంధించిన ఇతర కార్యనిర్వాహక అంశాలు:
బులియన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్స్ ట్రేడింగ్ సభ్యులు / క్లియరింగ్ సభ్యులు, బులియన్ డిపాజిటరీలు, వాల్ట్ మేనేజర్లు మొదలైన అన్ని మార్కెట్ మధ్యవర్తుల కోసం ఒక సమగ్ర వేదికను అందించాలి. తద్వారా బులియన్ మార్కెట్లో పారదర్శకత మరియు గుర్తించదగిన మరియు బులియన్ ఒప్పందాల ప్రామాణీకరణను సులభతరం అవుతుంది.
b. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్స్) రెగ్యులేషన్స్, 2020
ఐఎఫ్‌ఎస్‌సిఎ సిఫారసు మేరకు అక్టోబర్ 16, 2020 న భారత ప్రభుత్వం.. ఆర్థిక ఉత్పత్తులు మరియు ఆర్థిక సేవలకు సంబంధించిన సేవలను అందించడానికి గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్స్ (జిఐసి) ను ఆర్థిక సేవగా తెలిపింది.
అథారిటీ ఆమోదించిన నిబంధనలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* బ్రాంచ్ మోడ్‌తో సహా అథారిటీ అనుమతించిన ఏ మోడ్‌లోనైనా జిఐసి తన వ్యాపారాన్ని నిర్వహించవచ్చు.
* ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) కంప్లైంట్ అధికార పరిధిలో దరఖాస్తుదారు తన ఆర్థిక సేవల పరిధిని సూచించాలి. ఆ పరిధిలోనే సేవలు అందించే సంస్థలు ఉండాలి.
* ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ అనేది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటర్ లేదా ఆ గ్రూప్ పరిధిలో ఆర్థిక సేవల కార్యకలాపాలను నియంత్రించాలి. అది ఏ సంస్థ ద్వారా నియంత్రించబడుతుంది మరియు దాని హోల్డింగ్, అనుబంధ లేదా అసోసియేట్ కంపెనీలు, బ్రాంచ్ లేదా హోల్డింగ్ కంపెనీ యొక్క అనుబంధ సంస్థల వివరాలు తెలియజేయాలి.
* దరఖాస్తుదారు సంస్థ, దాని సహాయక సంస్థలు ఆర్థిక సేవలకు సంబంధించిన సేవలు, ఆర్థిక ఉత్పత్తికి సంబంధించిన సేవల నిర్వహణకు సంబంధినవి అయి ఉండాలి.
* ఐఎఫ్ఎస్సీలో పరిధిలో ఉన్న జీఐసీ యూనిట్లకు ఐఎఫ్ఎస్సీకు వర్తించే పన్నుప్రోత్సాహాకాలు, రాయితీలు పొందేందుకు అర్హత ఉంటుంది.
ఇటీవలి కాలంలో జిఐసిలు భారతదేశంలో నైపుణ్యం కలిగిన వనరుల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అత్యంత ప్రతిభగల వనరులతో ప్రపంచంలోనే ప్రముఖ డిజిటలైజేషన్ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోంది.ఐఎఫ్‌ఎస్‌సిఎ జారీ చేసిన ఈ జిఐసి నిబంధనలు జిఐఎఫ్-ఐఎఫ్ఎస్ సీని ప్రముఖ ఫిన్‌టెక్ నగరాల జాబితాలో ఉంచే అవకాశం ఉంది. తద్వారా అది గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
పైన పేర్కొన్న నిబంధనలను భారత ప్రభుత్వం నిర్ణీత సమయంలో తెలియజేస్తుంది.
***
(Release ID: 1668075)
Visitor Counter : 184