మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

షిబ్‌పూర్ ఐఐఈఎస్‌టీ వ‌ద్ద డీఎస్‌టీ-ఐఐఈఎస్‌టీ సోలార్ పీవీ హ‌బ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్

Posted On: 27 OCT 2020 7:18PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ షిబ్‌పూర్ ఐఐఈఎస్‌టీ వ‌ద్ద డీఎస్‌టీ - ఐఐఈఎస్‌టీ సోలార్ ఫొటో వోల్టాలిక్ హ‌బ్‌ను వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. కేంద్ర‌ శాస్త్ర మ‌రియు సాంకేతిక శాఖ సైన్స్ అండ్ టెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ కార్య‌ద‌ర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, షిబ్‌పూర్ ఐఐఈఎస్‌టీ డైరెక్ట‌ర్ ప్రొఫెసర్ డాక్టర్ పార్థసారథి చక్రవర్తి, ఐఐఈఎస్‌టీ షిబ్‌ప‌ర్ బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ చైర్‌ప‌‌ర్స‌న్ డాక్ట‌ర్ వాసుదేవ్ కే ఆత్రే, విక్ర‌మ్ గ్రూపు సంస్థ అయిన విక్ర‌మ్ సోలార్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ జ్ఞానేశ్ చౌద‌రి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షిబ్‌పూర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన డీఎస్‌టీ-ఐఐఈఎస్‌టీ సోలార్ పీవీ హ‌బ్ దేశంలోనే ఒక ప్ర‌త్యేక‌మైన‌ పీవీ హ‌బ్ అన్నారు. భార‌త ప్ర‌భుత్వ శాస్త్ర, సాంకేతిక డిపార్ట్‌మెంట్ పరిశోధన, అభివృద్ధి గ్రాంట్‌తో షిబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ వ‌ద్ద దీనిని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. షిబ్‌పూర్ ఐఐఈఎస్‌టీ వ‌ద్ద గ‌ల సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ఫ‌ర్ గ్రీన్ ఎన‌ర్జీ అండ్ సెన్సార్ సిస్ట‌మ్ ఆధ్వ‌ర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. సౌర శక్తి మరియు సౌర ఘటాల రంగంలో షిబ్‌పూర్‌లోని ఐఐఈఎస్‌టీ చేసిన అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించడానికి మరియు మద్దతివ్వడానికి 2018లో డీఎస్‌టీ సంస్థకు కొత్తగా నిధుల‌ను ఇచ్చి “డీఎస్‌టీ- ఐఐఈఎస్‌టీ సోలార్ పీవీ హ‌బ్‌” సెంట్రల్ హబ్‌ను రూపొందించడానికి తోడ్పాటును అందించ‌డం జరిగింది అని మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ అన్నారు. ఇది ప్రపంచ స్థాయి పరిశోధన సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఇది పరిశోధన మరియు అభివృద్ధికి కేంద్ర నోడ్‌గా పని చేస్తుంది. దీనికి తోడు సౌరశక్తి, ఫొటో వోల్టాయిక్స్, సౌర ఘటాల కల్పన, క్యారెక్ట‌రైజేష‌న్ మరియు టెస్టింగ్‌, సౌర పీవీ మాడ్యూల్స్ మరియు సౌర పీవీ వ్యవస్థలతో సహా ప‌లు అంశాల‌పై భారతదేశంలోని మొత్తం తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలలో త‌గిన ప‌రిజ్ఞానాన్ని వ్యాప్తి చేసేందుకు కూడా ఇది ప‌ని చేయ‌నుంద‌ని ఆయన తెలిపారు. శిలాజ ఇంధన శక్తి నుండి సౌరశక్తి దృష్టాంతానికి సజావుగా మారడానికి "మేక్ ఇన్ ఇండియా మిషన్" తో జాతీయ మరియు స్థానిక పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు మరియు స్టార్టప్‌లను సమ లేఖనం చేయడానికి ఈ హబ్ సహాయపడుతుందని మంత్రి తెలిపారు. సౌర ఇంధన కార్యకలాపాల్లో నిమగ్నమైన భారతదేశంలోని తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలలో అనేక పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు ఈ పరిశోధన యూనిట్ నుండి ఎంతో ప్రయోజనం పొందే అవకాశం ఉందని మంత్రి ప్ర‌ధానంగా తెలియ జేశారు. డీఎస్‌టీ-ఐఐఈఎస్‌టీ సోలార్ హబ్ ద్వారా ప్రత్యక్ష పరస్పర చర్య ఈ ప్రాంతంలో మరెక్కడా అందుబాటులో లేనందున సౌర ఘటాలు మరియు సౌర పీవీ మాడ్యూల్స్ మరియు వ్యవస్థల కల్పన, క్యారెక్ట‌రైజేష‌న్‌ మరియు పరీక్షల కోసం స్వదేశీ జ్ఞానాన్ని బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.
పశ్చిమ బెంగాల్‌తో స‌హా మొత్తం తూర్పు మరియు ఈశాన్య ప్రాంతంలోని ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు మరియు పరిశోధనా సంస్థ‌ల సభ్యులు ఈ సోలార్ హబ్‌లో సౌర విద్యుత్ విధానానికి సంబంధించి వివిధ అంశాల‌పై త‌గిన ప‌త్య‌క్ష అనుభవాన్ని పొందేందుకు వీలు క‌లుగుతుంద‌ని మంత్రి తెలిపారు. ఈ హబ్ అందించే చక్కగా రూపొందించిన శిక్షణా కార్యక్రమాలు భారత ప్రభుత్వ స్కిల్ ఇండియా మిషన్‌కు ప్రేరణగా నిలుస్తాయని ఆయన అన్నారు. దేశంలో సౌరశక్తి మరియు సౌర ఫొటో వోల్టాయిక్స్ రంగంలో ప‌రిజ్ఞానాన్ని క‌లిగించేందుకు మ‌రియు మరియు బలోపేతం చేయడానికి ఈ శిక్షణా మాడ్యూల్స్ దోహ‌దం చేస్తాయి అని ఆయ‌న అన్నారు. తద్వారా భవిష్యత్తులో వీటిని భారత్‌లో స్వదేశీ అభివృద్ధికి మరియు సౌరశక్తి వినియోగానికి దోహదపడతాయని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.


                             

******



(Release ID: 1668050) Visitor Counter : 108