జల శక్తి మంత్రిత్వ శాఖ
అండమాన్ నికొబార్ దీవులలో జల్ జీవన్ మిషన్ అమలుపై మధ్యంతర సమీక్ష
వంద రోజులలో అండమాన్ నికోబార్ దీవులలోని అన్నిపాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో పైపుద్వారా మంచినీటిసరఫరాకు చర్యలు
Posted On:
26 OCT 2020 2:53PM by PIB Hyderabad
అండమాన్ నికోబార్ దీవులలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించిన పురోగతిని వీడియోకాన్ఫరెన్సుద్వారా అక్కడిపాలనాయంత్రాంగం జల్‌జీవన్ మిషన్ కు సమర్పించింది.
జల్ జీవన్‌మిషన్‌ద్వారా భారత ప్రభుత్వం గ్రామాలలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా సరిపడినంత నీటిని , తగిన నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికపై సరఫరాచేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నది. గ్రామీణ ప్రజలకు తమ గుమ్మం వద్ద మంచినీటిని అందజేయడం ద్వారా సులభతర జీవనానికి వీలు కల్పించడం ఈ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
అండమాన్ నికోబార్ దీవులలోని 400 గ్రామాలలోని 65,096 నివాసాలకు గాను 33,889 ఇళ్లకు కుళాయికనెక్షన్ ఉంది. మిగిలిన ఇళ్ళకు 2021 నాటికి కుళాయి కనెక్షన్ అందజేసేందుకు అండమాన్ నికోబార్ దీవులు చర్యలు తీసుకుంటున్నది. 290 గ్రామాలలో పైపుద్వారా నీటి సరఫరాకు సంబంధించిన వ్యవస్థ ఉంది. నీటిసరఫరా వ్యవస్థ లేని గ్రామాలలో నీటిసరఫరా వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి, కుళాయికనెక్షన్ లేని ఇళ్లకు కుళాయికనెక్షన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.జల్ జీవన్ మిషన్ కింద ప్రాధాన్యతాప్రాతిపదికన ఎస్.సి,ఎస్‌టిలు అధికంగా గల ఆవాసాలపై దృష్టిపెట్టాల్సిందిగా అండమాన్ నికోబార్ దీవుల పాలనాయంత్రాంగానికి సూచించం జరిగింది.
గ్రామ పంచాయతీలు లేదా దాని సబ్ కమిటీలు , అంటే గ్రామ పారిశుధ్యకమిటీ (విడబ్ల్యుఎస్‌సి)వంటివి గ్రామాలలో మంచినీటి సరఫరా కోసం,నీటిపారుదల వ్యవస్థలకు ప్రణాళికా రూపకల్పన, అమలు, నిర్వహణ, యాజమాన్యం,మరమ్మతుల వంటి కార్యకలాపాలను నిరంతర, దీర్ఘకాలిక ప్రాతిపదికపై నిర్వహిస్తాయి. విడబ్ల్యుఎస్‌సిలు గ్రామాలలో మంచినీటి సరఫరా వ్యవస్థలను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించడం, వాటి నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇళ్లకు నిర్ణీత వినియోగ చార్జీలను నిర్ణయిస్తారు. సంప్రదాయ జలవనరుల ను పునరుద్ధరించడంపై దృష్టి కేంద్రీకరించడమే కాక గ్రేవాటర్ ట్రీట్‌మెంట్‌కు ంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే శుద్ధిచేసి తిరిగి ఉపయోగించేందుకు చర్యలు చేపడతారు. ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్, ఎస్.బి.ఎంవంటి వివిధ పథకాలను గ్రామస్థాయిలో సమ్మిళితం చేయడం జరుగుతుంది. దీనివల్ల నిధుల అందుబాటు పెరగడంతోపాటు నిధుల పంపిణీకి , ఉమ్మడి వినియోగానికి వీలు కలుగుతుంది. నీటి సంరక్షణ, భూగర్భజలాల రీచార్జి,నీటి శుద్ధి, గ్రేవాటర్ నిర్వహణ తదితరాలకు ఇవి ఉపయోగపడతాయి.
గ్రామపంచాయతి కార్యకలాపాలు నిర్వహించేవారికి, ఇతర స్టేక్‌హోల్డర్లకు సామర్ధ్యాల అభివృద్ధికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా అండమాన్ నికోబార్ దీవులకు సూచించడం జరిగింది. అలాగే గ్రామస్థాయిలో తగినంత మంది శిక్షణ పొందిన మానవ వనరులు అందుబాటులో ఉండే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఇది నీటిసరఫరా వ్యవస్థల సక్రమ నిర్వహణ, అమలు కు సంబంధించి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాలలో నిరంతరాయనీటిసరఫరాకు చర్యలు తీసుకోవడం పై దృష్టిపెట్టాల్సిందిగా అండమాన్ నికోబార్ దీవులకు సూచించారు. దీనివల్ల గ్రామపంచాయితీలు ప్రజాఉపయోగ కార్యక్రమాన్ని సేవల అందుబాటు పై దృష్టితో చేపట్టడానికి వీలు కలుగుదుంది.గ్రామాలలో నీటిసరఫరాకు సంబంధించి రియల్ టైమ్ పర్యవేక్షణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సెన్సర్లను వాడేందుకుగల అవకాశాలను పరిశీలిస్తోంది.
జల్ జీవన్ మిషన్ కింద నీటిసరఫరాకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతోంది. నీటి పరీక్షా ప్రయోగశాలలు వివిధ స్థాయిలలో ఏర్పాటు చేయడం జరిగింది. నీటినాణ్యతకు సంబంధించిన పరిశీలన విషయంలో ప్రజలను భాగస్వాములను చేయడం జరగుతోంది. ఇందుకు వివిధ కార్యకలాపాలను సిద్ధం చేస్తున్నారు.ఫీల్డ్ టెస్ట్ కిట్(ఎఫ్.టి.కె)లు సమకూర్చుకోవడం, కమ్యూనిటీకి ఇలాంటి కిట్‌లు అందజేయడం, ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు మహిళలను ఎంపికచేసి ఈ ఫీల్డ్ టెస్ట్ కిట్‌లు వాడడంపై వారికి శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల గ్రామాలలో సరఫరా అయ్యే నీటి నాణ్యతను అక్కడికక్కడే పరిశీలించడానికి వీలు కలుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో మంచినీటిసరఫరాకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతోంది. ఇందుకు అనుగుణంగా అండమాన్ నికోబార్ దీవులు ఈ ప్రచార గడువులోగా, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మంచినీటి సరఫరా చేయనుంది.
***
(Release ID: 1667596)
Visitor Counter : 149