యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ‘వయస్సుకు సరిపడా ఫిట్‌నెస్ సూత్రాలు’విడుదల

Posted On: 23 OCT 2020 6:47PM by PIB Hyderabad

ఆరోగ్య సమస్యలు మరియు ఫిట్నెస్‌కు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగించడానికి  పంజాబ్ స్పోర్ట్స్, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి శ్రీ రానా గుర్మిత్ సింగ్ సోధి పంజాబ్‌కు సంబంధించిన  వయస్సుకు సరిపడా ఫిట్‌నెస్ సూత్రాలను విడుదల చేశారు.  అన్ని వయస్సుల వారిలో  ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడానికి ఫిట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పాటియాలాలు సంయుక్తంగా వీటిని రూపొందించాయి.


ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తన   అధికారిక నివాసంలో  శ్రీ రానా సోధి మాట్లాడుతూ " ఈ కార్యక్రమం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖలో చొరవతో రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ రోజు మనం పంజాబ్‌ రాష్ట్రం కోసం రూపొందించిన ఆరోగ్య సూత్రాలను విడుదల చేస్తున్నామని తద్వారా అన్ని వయస్సులు, అన్ని వర్గాల ప్రజలు ఫిట్‌నెస్‌కు సంబంధించిన చిట్కాల గురించి తెలుసుకోవచ్చని చెప్పారు. భారత క్రీడా మంత్రిత్వ శాఖ, క్రీడా అథారిటీలు ప్రత్యేక చొరవతో చేపట్టిన ఫిట్ ఇండియా ఉధ్యమం అన్ని వయసుల వారిలో ఫిట్‌నెస్‌పట్ట శ్రద్ధను పెంచుతుందని వెల్లడించారు. వయస్సు వారీగా నిర్దిష్ట ఫిట్‌నెస్ ప్రోటోకాల్‌లను రూపొందించే ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఎందుకంటే ఇది అన్ని వయసుల వారు వీటిని అనుసరించడానికి  తద్వారా ఫిట్‌నెస్‌ను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ ఉద్యమాన్ని పంజాబ్ ప్రజల్లోకి తీసుకువెళతామని కేబినెట్‌ మంత్రి స్పష్టం చేశారు. పంజాబీ వెర్షన్‌ ఫిట్‌ ఇండియా ఉద్యమం ప్రజల్లోకి చేరడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. క్రీడల్లో భారతదేశాన్ని పంజాబ్‌ రాష్ట్రం ముందుడి నడిపిందని అలాగే ఫిట్‌నెస్‌ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. ఈ వర్చువల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 325 మంది కోచ్‌లు, ఆటగాళ్లు పాల్గొన్నారు.

ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా  ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఈ వయసు తగిన ఫిట్‌నెస్ ప్రోటోకాల్‌లను 2020 సెప్టెంబర్ 24 న ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో  స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. శివ ప్రసాద్, డైరెక్టర్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ దేవిందర్ పాల్ సింగ్ ఖర్బండ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ ఆర్ ఎస్ బిష్ణోయ్, డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌ఐఐ, ఎన్‌ఐఎస్ పాటియాలా రితు పాఠిక్ పాల్గొన్నారు.

***



(Release ID: 1667246) Visitor Counter : 74