శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత జాతీయ సైన్స్ అకాడెమీకి డాక్టర్ సమన్ హబీబ్ ఎన్నిక
దేశంలోని మూడు విఖ్యాత సైన్స్ అకాడెమీల ఫెలోషిప్ సాధించిన ఘనత
Posted On:
22 OCT 2020 5:11PM by PIB Hyderabad
లక్నో లోని సిఎస్ ఐఆర్ –సిడి ఆర్ ఐ మైక్రోబయాలజీ విభాగం చీఫ్ సైంటిస్ట్. ప్రొఫెసర్ డాక్టర్ సమన్ హబీబ్ మలేరియా పరాన్నజీవిని అర్థం చేసుకోవటంలో చేసిన అసాధారణ కృషికిగాను మరోమారు తమ సంస్థకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. ఆమె న్యూ ఢిల్లీలోని భారత జాతీయ సైన్స్ అకాడెమీకి ఎన్నికయ్యారు. ప్లాస్మోడియంలో అణువుల పనితీరును, అందులో ప్రొటీన్ మార్పిడి ప్రక్రియను, భారతదేశంలో మలేరియాకు గురవటానికి మానవుల జన్యుపరమైన అంశాలు అర్థం చేసుకోవాలన్న కోరిక ఆమె పరిశోధక బృందం ఆసక్తిని మలేరియా పరాన్నజీవి వైపు మళ్ళించింది.
సుమన్ హబీబ్ సాధించిన గౌరవాలు, అవార్డులు
ఫెలో ఆఫ్ ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్, బెంగళురు (2016)
ఫెలో ఆఫ్ నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా, అలహాబాద్ (2015)
జాతీయ మహిళా బయో సైంటిస్ట్ పురస్కారం, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (2012)
ప్రొఫెసర్ బికె బచావత్ స్మారకోపన్యాస పురస్కారం, నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ (2008)
సి ఎస్ ఐ ఆర్ యువ శాస్త్రవేత్త పురస్కారం (2011)
భారత జాతీయ సైన్స్ అకాడెమీ
మానవాళి ప్రయోజనం కోసం, జాతీయ సంక్షేమం కోసం ఉపయోగపడేలా భారతదేశంలో సైన్స్ ను, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1935 లో భారత జాతీయ సైన్స్ అకాడెమీ స్థాపించారు. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించటంతోబాటు సంక్షేమం కోసం దాన్ని వాడాలన్నది కూడా దాని ఉద్దేశ్యం. శాస్త్రీయ అకాడెమీలు, సొసైటీలు, సంస్థలు, ప్రభుత్వ శాస్త్ర విభాగాలు, సేవల మధ్య సమన్వయం సాధించటం కోసం అకాడెమీ పనిచేస్తుంది.దేశంలోని శాస్త్రవేత్తల ప్రయోజనాలు కాపాడటం, దేశంలో జరిగిన శాస్త్ర పరిశోధనలను, కృషిని ప్రపంచానికి చాటిచెప్పటం కూడా దీని లక్ష్యాల్లో ఒకటి. సరైన విధానం ద్వారా ఏర్పాటైన జాతీయ కమిటీల ద్వారా ప్రభుత్వం కోరుకున్న విధంగా జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న శాస్త్రీయ కార్యకలాపాలు చేపట్టటం జాతీయ సైన్స్ అకాడెమీ బాధ్యత.
***
(Release ID: 1666878)
Visitor Counter : 150