రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఎన్‌ఎఫ్‌ఎల్‌తో కలిసి రాజస్థాన్‌లో రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన సీసీఐ
- ఉచితంగా రైతులకు 75 కాటన్ ప్లకింగ్ యంత్రాల పంపిణీ
Posted On:
21 OCT 2020 5:35PM by PIB Hyderabad
'నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' (ఎన్ఎఫ్ఎల్) సీసీఐతో కలిసి రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిన్న ఒక్క రోజు రైతుల శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. ఈ శిక్షణ కార్యక్రమంలో శ్రీ గంగ నగర్, బికనీర్, హనుమన్‌ఘర్ జిల్లాలకు చెందిన దాదాపు మొత్తం 75 మంది ప్రగతిశీల రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సాగులో తాజా సాంకేతిక పరిజ్ఞానం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఇది రైతులకు వారి సాగు ఖర్చులను తగ్గించి మంచి ఆదాయాన్ని సంపాదించేందుకు దోహదపడుతుంది. శిక్షణ సమయంలో శాస్త్రవేత్తలు పత్తి పండించే రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు పరిష్కారాలను సూచించారు. 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' అధికారులు రైతులను ఉత్పత్తిని పెంచడానికి మరియు పంట నాణ్యతను మెరుగుపరచేలా అధునాతనమైన యంత్రాలను ఉపయోగించమని ప్రోత్సహించారు. ఎన్ఎఫ్ఎల్ జోనల్ మేనేజర్ శ్రీ దిల్బాగ్ సింగ్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ కుమార్ భట్ పత్తిని తీసే యంత్రాలను ఉపయోగించి.. పత్తిని వెలికి తీయడంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు 75 కాటన్ ప్లకింగ్ యంత్రాలను ఎన్ఎఫ్ఎల్ ఉచితంగా పంపిణీ చేసింది. పంటకు మార్కెట్‌లో మంచి ధరను రాబట్టేందుకు గాను పత్తి పంటలో తేమను కనిష్టంగా ఉంచాలని శ్రీ భట్ ఉద్ఘాటించారు. భూసార పరీక్షల నివేదికల ఆధారంగా రైతులు తమ పంటలకు ఎరువులు వాడాలని శ్రీ దిల్బాగ్ సింగ్ ప్రోత్సహించారు. రైతన్నలు పండించిన వివిధ పంటలకు వేరువేరుగా
ఎరువులను వాడుతూ సమతౌల్యత పాటించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఉద్ఘాటించారు. తద్వారా ఎరువుల ఖర్చు తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని అన్నారు. మొక్కల పెంపక శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ ప్రకాశ్ మాట్లాడుతూ శ్రీ గంగానగర్ మరియు రాజస్థాన్ పరిసర జిల్లాలలో వాతావరణం ప్రకారం అనువైన ఉత్తమ రకాల పత్తి పంటల గురించి సమాచారం ఇచ్చారు.
ఉత్తమమైన మరియు అధిక దిగుబడినిచ్చే పత్తి రకాలను ఎంచుకోవడం ద్వారా మరియు దాని సాగుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. డాక్టర్ విజయ్ మాట్లాడుతూ సరైన పంట నిర్వహణపై (పత్తి సాగు కోసం అన్ని కార్యకలాపాలను కలిగి ఉంటుంది) ఖర్చు తగ్గించడానికి మరియు లాభాలను పెంచడం గురించి నొక్కి చెప్పారు. కార్యక్రమం ప్రారంభంలో శ్రీ దిల్బాగ్ సింగ్, ఎన్ఎఫ్ఎల్ యొక్క వివిధ ఉత్పత్తుల గురించి సవివరంగా తెలియజేశారు. ఎరువులు (యూరియా, డీఏపీ, ఎంఓపి & ఎన్‌పీకే) విత్తనాలు, వ్యవసాయ రసాయనాలు, సిటీ కంపోస్ట్, బయో ఎరువులు మరియు బెంటోనైట్ సల్ఫర్ మొదలైన వాటి గురించి ఆయన వివరించారు. కంపెనీ చేపడుతున్న వివిధ సీఎస్ఆర్ కార్యకలాపాల గురించి కూడా ఆయన వివరించారు. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఎన్ఎఫ్ఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ.
***
(Release ID: 1666638)
Visitor Counter : 129