కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

వ్యవసాయ, గ్రామీణ కార్మికుల కోసం....

సెప్టెంబరు నెల అఖిల భారత వినియోగదారుల ధరల సూచికల విడుదల

Posted On: 20 OCT 2020 4:00PM by PIB Hyderabad

ప్రస్తుత సంవత్సరం సెప్టెంబరు నెలలో వ్యవసాయ కార్మికులు  గ్రామీణ కార్మికుల కోసం తయారు చేసిన అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక సంఖ్యలు (బేస్: 1986-87 = 100) వరుసగా 11, 10 పాయింట్లు పెరిగి వరుసగా 1037 (వెయ్యి ముప్పై ఏడు),  1043 (వెయ్యి నలభై మూడు) పాయింట్ల వద్ద నిలిచాయి. వ్యవసాయ కార్మికులు,  గ్రామీణ కార్మికుల సాధారణ సూచిక పెరుగుదలకు ప్రధాన కారణం... ఆహారం వినియోగంలో 9.8 పాయింట్లు పెరుగుదల. మైసూరు పప్పు, శనగపప్పు, వేరుశనగ నూనె, ఆవాలు, కూరగాయలు  పండ్లు మొదలైన వాటి ధరల పెరుగుదల వల్ల మరో 8.95 పాయింట్లు అధికమయ్యాయి.

సూచిక పెరుగుదల రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. వ్యవసాయ కార్మికుల విషయంలో, ఇది 20 రాష్ట్రాల్లో ఒకటి నుండి 23 పాయింట్ల వరకు పెరిగింది. తమిళనాడు 1234 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 816 పాయింట్లతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున నిలిచింది. గ్రామీణ కార్మికుల విషయంలో, సూచిక 20 రాష్ట్రాల్లో  రెండు నుండి 20 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. తమిళనాడు రాష్ట్రం 1,218 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 863 పాయింట్లతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చివరిస్థానంలో నిలిచింది.

రాష్ట్రాలలో, వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచిక సంఖ్యలలో గరిష్ట పెరుగుదల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో  (+23 పాయింట్లు) ఉంది.  జమ్మూకశ్మీర్లో గ్రామీణ కార్మికుల సూచీ 20 పాయింట్లు పెరిగింది. గోధుమ పిండి, పప్పుధాన్యాలు, ఆవనూనె, పాలు, ఉల్లిపాయ, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, పండ్లు, కూరగాయలతోపాటు మంగలి, బస్సు ఛార్జీలు పెరగడం ఇందుకు కారణం.

సీపీఐ-ఎఎల్,  సీపీఐ-ఆర్ఎల్ ఆధారిత పాయింట్ టు పాయింట్ ద్రవ్యోల్బణం 2020 సెప్టెంబరులో 6.25శాతం  నుంచి 6.10శాతం కు తగ్గింది. 2020 ఆగస్టులో ఇవి వరుసగా 6.32శాతం , 6.28శాతం నమోదయ్యాయి. సీపీఐ-ఎఎల్,  సీపీఐ ఆధారిత  ఆహార సూచిక ద్రవ్యోల్బణాలు సెప్టెంబర్‌లో వరుసగా (+) 7.65శాతం, & (+) 7.61శాతం నమోదయ్యాయి.

అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక సంఖ్య (సాధారణం, గ్రూపుల వారీగా)

గ్రూపు

వ్యవసాయ కూలీలు

Rural  Labourers

 

ఆగస్టు 2020

సెప్టెంబరు 2020

August,2020

Sept.,2020

సాధారణ సూచీ

1026

1037

1033

1043

ఆహారం

986

999

991

1004

పాన్, సుపారీ వంటివి

1688

1694

1700

1706

ఇంధనం, విద్యుత్

1087

1090

1082

1085

దుస్తులు, మంచాలు, పాదరక్షలు

1009

1012

1033

1033

ఇతరాలు

1035

1043

1040

1047

కార్మిక  ఉపాధి శాఖ సహాయమంత్రి (ఐ / సి) సంతోష్ గంగ్వార్ తాజా సూచిక గురించి మాట్లాడుతూ,  “వరుసగా ఎనిమిది నెలలు వరుసగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండటం వల్ల   గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది కార్మికుల ఆదాయం పెరుగుతున్నది. వారి ఖర్చులు బాగా తగ్గుతున్నాయి.  కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, ధరల సూచికను తయారు చేయడంలో ఎంతో కష్టపడ్డారంటూ అధికారులను లేబర్ బ్యూరో డైరెక్టర్ జనర్ డీపీఎస్ నేగీ ప్రశంసించారు.  2020 అక్టోబర్ నెల సీపీఐ- ఎఎల్ , ఆర్ఎల్ వివరాలను వచ్చే నెల (నవంబరులో)లో విడుదల చేస్తారు.

***


(Release ID: 1666632) Visitor Counter : 118