బొగ్గు మంత్రిత్వ శాఖ

న‌వంబ‌రు 5న బొగ్గు వినియోగంపై భార‌త్-ఇండోనేషియాల మ‌ధ్య జాయింట్ వ‌ర్కింగ్ గ్రూపు స‌మావేశం

Posted On: 20 OCT 2020 7:09PM by PIB Hyderabad

బొగ్గు వినియోగంపై భార‌త్ - ఇండోనేషియాల మ‌ధ్య జాయింట్ వ‌ర్కింగ్ గ్రూపు స‌మావేశం న‌వంబ‌రు 5న జ‌రగ‌నుంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ప్రయాణ ఆంక్షల కారణంగా జాయింట్ వర్కింగ్ గ్రూప్(జేడ‌బ్ల్యూజీ) స‌మావేశం
న్యూఢిల్లీ వేదిక‌గా వీడియో కాన్ఫ‌రెన్సింగ్ విధానంలో జ‌ర‌గ‌నుంది. ఈ జేడ‌బ్ల్యూజీ
స‌మావేశానికి సహ అధ్యక్షులుగా  భారత వైపు నుండి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్ తివారీ, ఇండోనేషియా వైపు నుండి ఇండోనేషియా రిపబ్లిక్ ఖ‌నిజ మరియు బొగ్గు ఇంధనం, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్ట‌ర్ ఐర్ రిద్వాన్ జమలుద్దీన్‌లు పాల్గొన‌నున్నారు. ఒక్క‌ రోజు పాటు జ‌ర‌గ‌నున్న ఈ సమావేశంలో భాగంగా భారత దేశ‌పు బొగ్గు విధానంలో సంస్కరణలు- ఇటీవలి నవీకరణలు; భారతదేశంలో కోకింగ్ బొగ్గు అన్వేషణ మరియు వాణిజ్య బొగ్గు మైనింగ్; భారత దేశంలో సీసీటీ పరిశోధన, అభివృద్ధి మరియు ఇండోనేషియా యొక్క సంభావ్యత- కోవిడ్ -19 త‌ద‌నంత‌రం భార‌త వ్యాపార సహకారం అనే అంశాల‌పై సాగ‌నుంది. రెండు దేశాల‌లో రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ నేపథ్యంలో వ్యాపార అవకాశాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించడానికి రెండు వైపుల నుండి పరిశ్రమలకు బీ2బీ సెషన్ అవ‌కాశాన్ని కలిపించ‌నున్నారు. ఇది బొగ్గు రంగంలోని మరిన్ని విభాగాల‌లో కొత్త వ్యాపార అవకాశాలను కూడా అన్వేషిస్తుంది. ఈ చర్చలు రెండు దేశాల మధ్య బొగ్గు వ్యాపారానికి మార్గనిర్దేశం చేయ‌నున్నాయి.

                                 

****



(Release ID: 1666251) Visitor Counter : 113