కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

గత 175 రోజులలో 100 శాతం కోవిడ్ దరఖాస్తులను కేవలం 24 గంటల్లోనే పరిష్కరించిన పశ్చిమ ఢిల్లీ ఈపీఎఫ్ఓ అధికారులు, సిబ్బందిని శ్రీ గంగ్వార్ అభినందించారు. సుమారు 750 కోట్ల రూపాయలను 3.25 లక్షల ఈపీఎఫ్ఓ చందాదారులకు ఈ కార్యాలయం పంపిణీ చేసింది.

దరఖాస్తులు 3 రోజుల లోపే పరిష్కరించాలన్నఈపీఎఫ్ఓ చార్టర్ ప్రకారం 90 దరఖాస్తులు 24 గంటల్లోపే పరిష్కరించబడ్డాయి.

భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇతర ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లో పారదర్శకత మరియు సమర్థతను పెంపొందించాలని ఈ సందర్భంగా శ్రీ గంగ్వార్ పిలుపునిచ్చారు.

అక్టోబర్ 15 వరకూ 44 లక్షలకు పైగా కోవిడ్ అడ్వాన్స్ క్లెయిమ్‌లను ఈపీఎఫ్ఓ పరిష్కరించి 11,500 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేసింది: శ్రీ గంగ్వార్

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2020 5:23PM by PIB Hyderabad

24 గంటల వ్యవధిలోనే కొవిడ్ దరఖాస్తులను పరిష్కరించడంతో పాటు ఇతర కార్యాలయాలకు ఆదర్శంగా నిలిచిన పశ్చిమ ఢిల్లీలోని ఈపీఎఫ్ఓ సిబ్బందిని, అధికారులను కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్ అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ గంగ్వార్ మాట్లాడుతూ..గత 175 రోజులలో 100 శాతం కోవిడ్ -19 దరఖాస్తులు/ దావాలు 24 గంటల్లో పరిష్కరించబడ్డాయని తెలిపారు. పనిగంటలకు మించి పనిచేసిన సిబ్బంది సుమారు 750 కోట్ల రూపాయలను 3.25 లక్షల ఇపిఎఫ్ఓ చందాదారులకు పంపిణీ చేశారని వెల్లడించారు.

దరఖాస్తులను 3 రోజులలోపే పరిష్కరించాలన్నఈపీఎఫ్ఓ చార్టర్ ప్రకారం ఈ కార్యాలయం 90 శాతం ఇతర ఇపిఎఫ్‌ఓ క్లెయిమ్‌లను కూడా 24 గంటల్లోపే పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు

దేశంలోని ఇతర ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లో కూడా ఇదే విధమైన సమర్ధతను ,పారదర్శకతను కనబర్చాలని శ్రీ గంగ్వార్ పిలుపునిచ్చారు.

కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్ డౌన్, కొవిడ్ పరిస్థితుల కారణంగా సాధారణ పని కూడా కష్టమైన సందర్భంలో కూడా.. ఈపీఎఫ్ఓ అధికారులు మరియు సిబ్బంది అక్టోబర్ 15 వరకు 44 లక్షలకు పైగా కోవిడ్ అడ్వాన్స్ క్లెయిమ్‌లను పరిష్కరించారని ఈ మేరకు విశేషంగా కృషి చేశారని శ్రీ గంగ్వార్ చెప్పారు.

తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈపిఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసి, డిజి ఫాస్లి, డిజి మైన్స్‌ వంటి శాఖల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన కార్యాలయాలను అభినందించే కార్యక్రమాన్ని ఈ రోజునుంచి ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

కార్మిక సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాలను శ్రీ గంగ్వార్ ఈ సందర్భంగా వివరించారు.

***


(రిలీజ్ ఐడి: 1665980) సందర్శకుల సూచీ సంఖ్య : : 131
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Tamil