ఆయుష్

యోగా మరియు రోగనిరోధక శక్తిపై వెబ్‌నార్ నిర్వహించిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి


Posted On: 16 OCT 2020 6:42PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి..విహారా పేరుతో రోగనిరోధక శక్తితో పాటు పలు ఆంశాలపై చర్చించేందుకు ప్రత్యేక వెబ్‌నార్‌ను ఈ రోజు నిర్వహించింది. పలువురు నిపుణులతో పాటు క్లినికల్ ఇమ్యునాలజిస్టులు, పరిశోధకులు, వైద్యులు మరియు యోగా & నేచురోపతి వైద్యులు ఈ వెబ్‌నార్‌లో పాల్గొన్నారు.

కొవిడ్-19 నేపథ్యంలో నెలకున్న పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి యొక్క ప్రాముఖ్యతపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ రంజిత్ కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. అలాగే యోగా మరియు రోగనిరోధక శక్తిపై మాట్లాడారు. సిసిఆర్‌వైఎన్ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్ర రావు ఈ కార్యక్రమంపై సంక్షిప్త వివరణతో పాటు కార్యక్రమానికి హాజరైన వక్తలు, మరియు ప్రముఖులకు స్వాగతం పలికారు.

బెంగళూరుకు చెందిన ప్రఖ్యాత ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ ఎస్ సాంకేతిక సెషన్‌లో మాట్లాడుతూ..రోగనిరోధక శక్తిని పెంపొందించే అలవాట్ల గురించి, హానికలిగించే అలవాట్ల గురించి వివరించడంతో పాటు శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలని అనే ఆంశంపై ప్రసంగించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి రోగనిరోధకత మూలస్తంభమని దాన్ని సమతుల్యంగా ఉంచడంలో యోగా, నేచురోపతి విధానాలు సహాయపడతాయని వివరించారు. అంటువ్యాధులు, ఒత్తిడి మరియు సరైన పద్ధతిలో చేయని వ్యాయామం వంటి పరిస్థితులు రోగనిరోధక శక్తిపై ఎలా హానికరమైన ప్రభావాలను చూపుతాయో తెలిపారు. అలాగే యోగా విధానాలను ఉపయోగించడం ద్వారా ఆటో ఇమ్యూనిటీ ఏ విధంగా పెంచుకోవచ్చన్నదానిపై పలు ఘటనలను ఉదహరించారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కంటే రోగనిరోధక స్థిరీకరణ అవసరమని స్పష్టం చేశారు.

చండీగడ్‌లోని న్యూరాలజీ రీసెర్చ్ ల్యాబ్, న్యూరోసైన్స్ రీసెర్చ్ ల్యాబ్ ప్రొఫెసర్ డాక్టర్ అక్షయ్ ఆనంద్ వివిధ రకాల యోగాసనాలపై చేసిన పరిశోధనలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను సచిత్రంగా ప్రదర్శించారు. డీహెచ్‌ఈఎస్, సిర్టన్‌1 స్థాయిల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు టెలోమెరసెతో కార్టిసల్ మరియు ఐఎల్-6 లెవెల్స్‌ తగ్గుదలను వివరించారు. జంతు నమూనాలపై అధ్యయనాలకు సంబంధించిన వివరాలను సెల్ కల్చర్ ఆధారిత మోడళ్లతో ప్రదర్శించారు. డీఎన్‌ఏ ద్వారా రోగనిరోధక శక్తి ఆధారిత మార్పులను గుర్తించడంపై వివరించారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్టూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అనాటమీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రిమా దాదా.. యోగాపై జరిగిన అధ్యయనాలపై విస్తృత ప్రసంగం చేశారు. స్పెర్మ్ డిఎన్ఎకు కలిగే నష్టం, ఒత్తిడి, మగవాళ్లలో వంధత్వం , గ్లాకోమా, డిప్రెషన్ మరియు వృద్ధాప్యంలో కలిగే ఇబ్బందులను అరికట్టడంలో యోగా ఫలితాలను చూపుతుందని వివరించారు. ఈ మేరకు ప్రేక్షకులకు అవగాహన కల్పించారు. ఇక్రిసెట్ డైరెక్టర్, డాక్టర్ గురురాజ్ రావు ఈ వెబ్‌నార్‌లో మాట్లాడుతూ బాహ్యజన్యు మార్పులు, జన్యు వ్యక్తీకరణ మరియు ప్రయోగశాలల్లో బాహ్యజన్యు మార్పులను ఎలా కొలవాలి అనే ఆంశంపై పరసంగించారు. రోగనిరోధక వ్యవస్థలోని రకాలపై ఇక్రిసెట్ డైరెక్టర్ డాక్టర్ జ్యోత్స్నారావు ప్రసంగించారు. రోగనిరోధక శక్తిపై వత్తిడి ప్రభావం, శరీరంలో దాగి ఉన్న వైరస్ క్రియాశీలత, రోగనిరోధక శక్తిని కొలిచేందుకు అవలంభిస్తున్న పద్దతులను వివరించారు.యోగాపై అంటార్కిటికాలో చేసిన పరిశోధనలపై తన అధ్యయనాన్ని, ఆ అనుభవాలను డాక్టర్ రాఘవేంద్ర సామి వివరించారు. భారతీయుల చొరవతో అంటార్కిటికాలో యోగా అభ్యసనం ఆరంభమయిందని చెప్పారు. చాలా కఠినమైన పర్యావరణ పరిస్థితుల్లో యోగా ద్వారా మానసిక, జీవరసాయన, జన్యు వ్యక్తీకరణలపై ఫలితాలను వివరించారు.

హెచ్‌సిజి హాస్పిటల్స్, మెడికల్ ఆంకాలజీ హెడ్, డాక్టర్ రాధేశ్యామ్ నాయక్.. రోగనిరోధక వ్యవస్థ మరియు క్యాన్సర్‌ల మధ్య సంబంధాన్ని వివరించారు. క్యాన్సర్ కణితులు, కోల్డ్ ట్యూమర్‌ ఇమ్యునోజెనిక్ హాట్ ట్యూమర్‌గా మారడానికి ఉండే అవకాశాలపై తాను చేసిన పరిశోధన వివరాలను వెల్లడించారు. కెమోథెరపీ, రేడియోథెరపీ, మరియు యాంటిట్యూమర్ రోగనిరోధక వ్యవస్థలను మెరుగుపర్చడంలో యోగా పాత్రపై వివరించారు. హెచ్‌సిజి హాస్పిటల్స్ హెడ్ మరియు ప్రోగ్రాం డాక్టర్ అమృతాన్‌షురామ్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. క్యాన్సర్‌నుండి తెరుకున్నవారిలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని వారి మానసిక ఆరోగ్యం మెరుగపర్చడంతో పాటు రోగనిరోధకతను పెంపొందించడంలో యోగా ప్రముఖపాత్ర పోషిస్తోందని చెప్పా. అది ఎలా పనిచేస్తుంది అన్న ఆంశాన్ని వివరించారు.

*****



(Release ID: 1665525) Visitor Counter : 125