మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆగ్నేయాసియా దేశాల బృందం (ఏషియాన్) పి హెచ్ డి పరిశోధకత్వ సభ్యత్వ కార్యక్రమం మొదటి జట్టు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్'

Posted On: 15 OCT 2020 7:15PM by PIB Hyderabad

2020 అక్టోబర్ 16 ఉదయం 11 గంటలకు ఆగ్నేయాసియా దేశాల పి హెచ్ డి పరిశోధకత్వ సభ్యత్వ కార్యక్రమం మొదటి జట్టు విద్యార్థుల చాక్షుష స్వాగత సమావేశంలో  కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్'  ప్రసంగిస్తారు.  భారత ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఏషియాన్ పి హెచ్ డి పరిశోధకత్వ సభ్యత్వ కార్యక్రమానికి (ఏ పి ఎఫ్ పి)  ఈ విద్యార్థులు ఎంపికయ్యారు.  కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ఈ సమావేశంలో గౌరవ అతిధిగా పాల్గొంటారు.  స్వాగత సమావేశం 2020 అక్టోబర్ 16 ఉదయం 11 గంటలకు జరుగుతుంది.  

ఏషియాన్ సభ్య దేశాల రాయబారులు,  ప్రతినిధులు,   కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే,  విదేశాంగ శాఖలో తూర్పు ప్రాంత కార్యదర్శి రివా గంగూలీ దాస్,  ఆయా ఐఐటిలలో ఏషియాన్ సమన్వయకర్తలు,   ఐఐటిల డైరెక్టర్లు మరియు ఎంపిక చేసిన విద్యార్థులు సమావేశానికి స్వయంగా హాజరవుతారు.  

ఏషియాన్ సభ్య దేశాల నాయకుల సమక్షంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యలో 2018 జనవరి 25న ఏషియాన్ పి హెచ్ డి పరిశోధకత్వ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రకటించారు.  

ఏ పి ఎఫ్ పి కింద 1000 ఫెలోషిప్ లను ప్రత్యేకంగా ఆగ్నేయాసియా దేశాలకు చెందిన పౌరులకు ఇవ్వడం జరుగుతుంది. ఏ పి ఎఫ్ పి విదేశీ లబ్ధిదారుల కోసం భారత ప్రభుత్వం కల్పిస్తున్న అతిపెద్ద సామర్ఢ్య అభివృద్ధి కార్యక్రమం కూడా.  

***

 


(Release ID: 1665097) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Hindi , Manipuri