రక్షణ మంత్రిత్వ శాఖ
78వ ఇఎంఇ కార్ప్స్ దినోత్సవ వేడుకలు
Posted On:
15 OCT 2020 5:11PM by PIB Hyderabad
సాంకేతికత, ఆవిష్కరణల శక్తిని వినియోగించడం ద్వారా సైనిక పోరాట సామర్ధ్యాన్ని పెంచే విధంగా భారతీయ సైన్యానికి చెందిన మొత్తం పరికరాలు, ఆయుధ వ్యవస్థలను రూపొందించి, విసర్జించే వరకూ సమగ్ర ఇంజినీరింగ్ తోడ్పాటును అందించే బాధ్యతను నిర్వర్తిస్తున్న కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్్స గురువారం నాడు 78వ కార్ప్స్ దినోత్సవాన్ని నిర్వహించింది.
పోరాట ప్రభావాన్ని పెంచడంలో శక్తి గణకం చేసేదిగా కార్స్ప్ ఆఫ్ ఇఎమ్ ఇ వివిధ రంగాలలో నూతన ఎత్తులను అధిరోహించింది. వెంటిలేటర్లతో సహా కీలకమైన వైద్య సంరక్షణ పరికరాలను తక్షణమే వినియోగించేలా సంసిద్ధంగా ఉంచడం ద్వారా కోవిడ్ -19 సంక్షోభ నేపథ్యంలో కార్ప్స్ తన ప్రభావాన్ని రుజువు చేసుకుంది. కోవిడ్ -19పై పోరాటంలో జాతి కృషికి దోహదం చేస్తూ అనేక ఆవిష్కరణలను అభివృద్ధి చేసింది.
భారతీయ సైన్యంలో సాహస క్రీడల క్షేత్రంలో కార్ప్స్ ముందుగా ఉంది. పర్వతారోహణ, స్కై డైవింగ్, పదవలు నడపడం, హాట్ ఎయిర్ బెలూనింగ్, పారా సైలింగ్, హాంగ్ గ్లైడింగ్, స్కీయింగ్, రాఫ్టింగ్, కానోయింగ్, అంటార్కిటికా అన్వేషణ క్షేత్రాలలో అది అత్యంత ప్రేరణను ఇచ్చింది. ఫ్లైయింగ్ సిఖ్‌గా ప్రాచుర్యం పొందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మిల్ఖా సింగ్ సమ్మర్ ఒలింపిక్స్‌లోనూ, కామన్‌వెల్త్ క్రీడలలోనూ మూడు సార్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే కల్నల్ జెకె బజాజ్, విఎస్ ఎం, ఎస్ ఎం పర్వతారోహణలో రాణించారు. ఇటీవలి కాలంలో లెఫ్టనెంట్ కల్నల్ భరత్ పన్ను వర్చువల్ రేస్ అక్రాస్ అమెరికాలో గెలవగా, మారథాన్ రన్నర్ అయిన లెఫ్టనెంట్ కల్నల్ విశాల్ అహ్లావత్ వివిధ హాఫ్ మారథాన్లలో రికార్డులు సృష్టించి కీర్తిని తెచ్చారు.
భారతీయ సైన్యం కార్యాచరణకు సంసిద్ధంగా ఉండేందుకు కార్ప్్స ఆఫ్ ఇఎమ్ ఇ అత్యున్నత స్థాయిలో సందర్భానికి తగినట్టుగా తన కార్యకలాపాలు నిర్వహించింది. వారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని, దేశానికి కీర్తిని తీసుకువస్తామని మరణించిన తన సైనిక సోదరులకు సైనికుడు నిపుణుడు ప్రతిజ్ఞ చేస్తాడు.
***
(Release ID: 1664877)
Visitor Counter : 137