సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కొత్త వ్యవసాయ సంస్కరణలు దేశంలోని యువతకు వ్యవసాయ వ్యవస్థాపకతను సులభతరం చేస్తాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

Posted On: 14 OCT 2020 7:08PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు యువతకు వ్యవసాయ వ్యవస్థాపకతను సులభతరం చేస్తాయని మరియు వ్యవసాయంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా  ప్రోత్సహిస్తాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఇక్కడ అన్నారు.

తన లోక్‌సభ నియోజకవర్గమైన ఉధంపూర్-కథువా-దోడాలో ఆరు జిల్లాల్లోని యువ రైతులు, యువత సర్పంచ్‌లు మరియు యువ కార్యకర్తలతో “యువసమ్మేళన్” లో సంభాషించారు. డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కొత్త సంస్కరణల యొక్క అపారమైన ప్రయోజనాలు క్రమంగా లభిస్తాయన్నారు. వ్యవసాయేతర కుటుంబాల యువత కూడా ఒక రోజు వ్యవసాయ రంగంలో స్టార్ట్ అప్ లు పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన చట్టం ద్వారా అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలు, సౌకర్యాలు యువ రైతులకు సాంకేతిక పరిజ్ఞానం మరియు హైటెక్ పద్దతుల సాధనాలు సాధికారత సాధించడమే లక్ష్యంగా ఉన్నాయని ఆయన అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఎపిఎంసి లేదా మాండిస్ ద్వారా పంటల అమ్మకాన్ని పరిమితం చేసే మునుపటి ఏర్పాటు 50 సంవత్సరాల క్రితం రైతు తన వద్ద వనరులు లేనప్పుడు ఉండే పరిస్థితి, తన పంటను మార్కెట్లోకి తీసుకెళ్లడానికి ఇతరులపై ఆధారపడవలసి వచ్చి ఉండేది. మొత్తం దృష్టాంతం మారిపోయింది మరియు యువ రైతు వనరులు, మంచి అనుసంధానం, మంచి సమాచారం అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, ఇతర పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న ఎంపికలను కోల్పోయే పరిస్థితి లేదు. యువ రైతులు మరియు పంచాయతీ ప్రతినిధులందరూ కొత్త వ్యవసాయ చట్టాన్ని స్వాగతించారు మరియు వ్యవసాయ రంగంలో ఇది పెను మార్పు తెస్తుందని అన్నారు. 

పాల్గొన్న వారిలో గౌరవ్ శర్మ, జస్విందర్ సింగ్ జాస్సీ, రాహుల్ హన్స్, సుశాంక్ గుప్తా, రాజేష్ చిబ్, గురుదీప్ చిబ్, ప్రభాత్ సింగ్, రాకీ గోస్వామి, రవీందర్ సింగ్, ఆనంద్ కిషోర్ తదితర ప్రముఖులు ఉన్నారు. 

***



(Release ID: 1664594) Visitor Counter : 108