వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది: వ్యవసాయ కార్యదర్శి పంజాబ్‌కు చెందిన 29 రైతు సంఘాలతో సమావేశం నిర్వహణ

Posted On: 14 OCT 2020 8:02PM by PIB Hyderabad

వ్యవసాయానికి భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తుంది. పంజాబ్‌లో గత కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న 29 రైతు సంఘాల ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. భారత ప్రభుత్వ కార్యదర్శి (ఎసి&ఎఫ్‌డబ్ల్యు) స్థాయిలో ఈ సమావేశం జరిగింది.

భారత ప్రభుత్వ కార్యదర్శి (ఎసి&ఎఫ్‌డబ్ల్యు)తో  జరిగిన ఈ సమావేశంలో  పంజాబ్‌లోని రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాల గురించి ఈ సమావేశంలో సుమారు రెండు గంటలు చర్చించారు. అనంతరం రైతు  ప్రతినిధుల తరఫున రెండు  మెమోరాండంలను కార్యదర్శి(ఎసి అండ్ ఎఫ్‌డబ్ల్యు)కు అందించారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఈ మేరకు చర్చలు జరిపేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

 

 

***



(Release ID: 1664593) Visitor Counter : 88