భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

ఢిల్లీతో పాటు భారతదేశానికి అధునాతన హై-రిజల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన భారత వాతావరణశాఖ

Posted On: 14 OCT 2020 3:01PM by PIB Hyderabad

కాలుష్య నమోదు, గాలిలో నాణ్యత పరిశీలన, భూగర్భ పరిశీలన వంటి ఆంశాలపై మెరుగైన డాటా సేకరణకోసం భూగర్భశాఖ నిరంతరం ప్రయత్నిస్తోంది. అందుకోసం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలిలో నాణ్యత నమోదు కోసం సిస్టమ్ ఫర్ ఇంటిగ్రేటడ్ మోడలింగ్ ఆఫ్ అట్మాష్పియర్ కాంపోజిషన్(ఎస్‌ఐఎల్‌ఏఎమ్) అనే వ్యవస్థను అభివృద్ధి చేసింది. 10 కిలోమీటర్ల పరిధిలో ఖనిజాలు గుర్తించడానికి హైరెజ్యులేషన్‌ ఫోటోల చిత్రీకరణ కోసం ఈ వ్యవస్థలో ఈడీజీఏఆర్ వి4.3.2 అనే వ్యవస్థకు అనుసంధానంగా సీఎఎమ్‌ఎస్‌-జీఎల్‌వోబీ అనే అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

ఢిల్లీ కోసం ఎక్కువ హై రిజల్యూషన్ ఉన్న సిటీ స్కేల్ మోడల్ ఈఎన్‌ఎఫ్‌యుఎస్‌ఈఆర్‌ (ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ ఫ్యూషన్ సర్వీస్‌)ను కూడా వాతావరణ శాఖ ప్రారంభించింది. దీని ద్వారా నగరంలో వీధిస్థాయిలో కాలుష్యానికి సంబంధించిన హాట్‌స్పాట్‌లను కూడా గుర్తించడానికి అవకాశం లభిస్తుంది.

ఫిన్నిష్ వాతావరణ సంస్థ(ఎఫ్‌ఎమ్‌ఐ) సాంకేతిక సహకారంతో సిలామ్ మరియు ఎన్‌ఫ్యూజర్ వ్యవస్థలు అభివృద్ధి చేయబడ్డాయి.

ఎన్‌ఫ్యూజర్ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే గాలిలో నాణ్యత  పరిశీలన, రహదారి నెట్‌వర్క్, భవనాలు మరియు భూ సంబంధిత సమాచారం కోసం అత్యధిక రెజ్యూలేషన్‌ కలిగిన చిత్రాలను ఇది ఉపయోగిస్తుంది.రిజనల్ సైలమ్‌ పాయింట్స్‌లో సమాచార సేకరణకు ఈ వ్యవస్థను భారతవాతావరణ విభాగం  వినియోగిస్తుంది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా హాట్‌స్పాట్‌లో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఈ వ్యవస్థ ఆధునీకరించబడింది. ఢిల్లీ ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది. త్వరలో ఈ విధానం దేశవ్యాప్తంగా వినియోగించబడుతుంది.

గాలి నాణ్యత సూచన మెరుగుపరచడానికి, భూ వినియోగ సమాచార సేకరణ కోసం ఎయిర్ క్వాలిటీ ఫోర్‌కాస్ట్ మోడల్ కూడా కూడా ఆధునీకరించబడింది.

ప్రస్తుతం ఎయిర్‌ క్వాలిటీ వార్నింగ్ సిస్టమ్‌ రెండు కిలోమీటర్ల రెజ్యూల్యూషన్‌తో లక్నో, కాన్పూర్, వారణాసి నగరాల్లో కూడా గాలి స్వచ్ఛత సూచనలను అదిస్తోంది. 10 కిలోమీటర్ల రెజ్యూలేషన్‌తో ఇతర నగరాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

గాలి స్వచ్ఛత సమాచారం  https://ews.tropmet.res.in/  మరియు  https://mausam.imd.gov.in.  వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది.

***


(Release ID: 1664587) Visitor Counter : 173