మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్ర‌పంచ‌బ్యాంకు స‌హాయంతో చేప‌ట్టే రూ 5718 కోట్ల స్టార్స్ ప్రాజెక్టు‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇది పాఠ‌శాల విద్య మెరుగుకు నిర్దేశించిన కార్య‌క్ర‌మం

Posted On: 14 OCT 2020 4:49PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఈ కింది అంశాల‌ను ఆమోదించింది :
--రాష్ట్రాల‌లో బోధ‌న‌,అభ్య‌స‌న, ఫ‌లితాల‌ను బ‌లోపేతం చేసేందుకు ఉద్దేశించిన (స్టార్స్‌) ప‌థకాన్ని మొత్తం రూ 5718 కోట్ల‌రూపాయ‌ల ప్రాజెక్టువ్య‌యంతో చేప‌ట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ప్ర‌పంచ‌బ్యాంకు ఆర్ధిక మ‌ద్ద‌తు సుమారు 500 మిలియ‌న్ అమెరిక‌న్‌డాల‌ర్లు. ఇది సుమారు రూ3700 కోట్ల‌కు స‌మానం.
--సార్స్‌ప్రాజెక్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కింద గ‌ల పాఠ‌శాల విద్య , అక్ష‌రాస్య‌తా విభాగం కింద కొత్త కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కంగా ఈ స్టార్స్ ప్రాజెక్టును అమ‌లు చేస్తారు.
--కేంద్ర విద్యా మంత్రిత్వ‌శాఖ కింద పాఠ‌శాల విద్య‌,అక్ష‌రాస్యత విభాగం కింద నేష‌న‌ల్ అసెస్‌మెంట్ సెంట‌ర్ - పిఎఆర్ ఎ కెహెచ్ ను ఒక స్వ‌తంత్ర‌, స్వ‌యంపాల‌క సంస్థ‌గా దీనిని ఏర్పాటు చేసి మ‌ద్ద‌తునిస్తారు.

ఈ ప్రాజెక్టు 6 రాష్ట్రాల‌కు అంటే, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ ‌,మ‌హారాష్ట్ర‌,మ‌ధ్య‌ప్ర‌దేశ్‌,కేర‌ళ‌,ఒడిషాల‌కు వ‌ర్తింప చేస్తారు.ప్ర‌స్తుతం గుర్తించిన ఈ ఆరురాష్ట్రాల‌లో విద్య నాణ్య‌త‌ను పెంపొందించేందుకు వివిధ కార్య‌క్ర‌మాల‌కు చేయూత‌నిస్తారు. అలాగే ఈ ప్రాజెక్టుతోపాటు ఎడిబి నిధుల‌తో ఇలాంటి ప‌థ‌కం గుజ‌రాత్‌,త‌మిళ‌నాడు, ఉత్త‌రాఖండ్‌, జార్ఖండ్‌,అస్సాం ఐదురాష్ట్రాల‌లో అమ‌లు చేయ‌డానికి నిర్ణ‌యించారు. అన్ని రాష్ట్రాలూ ఒక రాష్ట్రం మ‌రొక రాష్ట్రంతో భాగ‌స్వామియై ఒక రాష్ట్రం అనుభ‌వాలు,  అమ‌లు చేసే అత్యుత్త‌మ విధానాల‌ను మ‌రో రాష్ట్రంతో  పంచుకుంటారు.
స్టార్స్ ప్రాజెక్టు మెరుగైన విద్యా ఫ‌లితాల కోసం ప్ర‌త్య‌క్ష లింకేజితో వివిధ కార్య‌క్ర‌మాల అభివృద్ధ‌ఙ‌, అమ‌లు, వాటి పరిశీల‌న‌,మెరుగుప‌రిచేందుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు నిస్తుంది. అలాగే మెరుగైన లేబ‌ర్‌మార్కెట్ ఫ‌లితాల కోసం ప‌రివ‌ర్త‌న వ్యూహాల‌ను పాఠ‌శాల‌లు రూపొందిస్తాయి.

స్టార్స్ ప్రాజెక్టు కింద మొత్తంగా ఉన్న అంశాలు , నాణ్య‌త ప్రాతిప‌దిక‌న అభ్య‌స‌న ఫ‌లితాలు ఉండాల‌న్న జాతీయ విద్యావిధానం(ఎన్ఇపి)2020 ల‌క్ష్యాల‌కు అనుగుణంగా దృష్టిపెట్ట‌డం జ‌రిగింది.
ఈ ప్రాజెక్టు భార‌తీయ పాఠ‌శాల విద్యా వ్య‌వ‌స్థ‌లో మొత్తంగా ప‌ర్య‌వేక్ష‌ణ‌, కొల‌మానానికి సంబంధించిన కార్య‌క‌లాపాల‌ను మెరుగుప‌రిచేందుకు నిర్దేశించిన‌ది.  ఈ ప్రాజెక్టు ఇన్‌పుట్ ల‌పై దృష్టిపెట్ట‌డం నుంచి   ఫ‌లితాల‌పై దృష్టిపెడుతుంది. అలాగే వాస్త‌వ ఫ‌లితాల‌ను నిధుల‌ను అందుకోవ‌డం, పంపిణీతో ముడిపెడుతుంది.
స్టార్స్ ప్రాజెక్టు విష‌యంలో రెండు ప్ర‌ధాన కాంపొనెంట్లు ఉన్నాయి.
1) జాతీయ స్థాయిలో ఈప్రాజెక్టు కింది చ‌ర్య‌లు చేప‌డుతుంది. అవి అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండ‌నున్నాయి.

--విద్యామంత్రిత్వ‌శాఖ జాతీయ డాటా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తారు.ఇది ఖ‌చ్చిత‌మైన డాటాను నిల్వ‌చేయ‌డం,  విద్యార్ధుల విద్యా పూర్తి కి సంబంధించిన, రిటెన్ష‌న్‌, ట్రాన్సిష‌న్  శాతాల‌ను రూపొందించ‌డం,
--రాష్ట్రాల పిజిఐ స్కొర్‌ల‌ను మెరుగుప‌రిచేందుకు   విద్యామంత్రిత్వ‌శాఖ‌కు మ‌ద్ద‌తునివ్వ‌డం, ఎస్ఐజి( స్టేట్ ఇన్సెంటివ్ గ్రాంట్‌ల ద్వారా  రాష్ట్రాల పాల‌నా సంస్క‌ర‌ణ‌ల అజెండాకు ఇన్సెంటివ్‌లు ఇవ్వ‌డం
--అభ్య‌స‌న అసెస్‌మెంట్ వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేసేందుకు మ‌ద్ద‌తునివ్వ‌డం.
--నేష‌న‌ల్ అసెస్‌మెంట్ సెంట‌ర్‌(పి.ఎ.ఆర్.ఎ.కె.హెచ్‌) ఏర్పాటుకు విద్యామంత్రిత్వ‌శాఖ కృషికి మ‌ద్ద‌తునివ్వ‌డం. ఎంపిక‌చేసిన రాష్ట్రాలు త‌మ అనుభ‌వాల‌ను ఇత‌ర రాష్ట్రాల‌తో ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ద్వారా పంచుకోవ‌డానికి  ( ఉ దాహ‌ర‌ణ‌కు ష‌గున్ , దీక్షా),సామాజిక‌, ఇత‌ర మీడియావే‌దిక‌లు, టెక్నిల్‌వ‌ర్కుషాపులు, రాష్ట్రాల సంద‌ర్శ‌న‌లు, స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ‌కు ఈ కేంద్రం ఉప‌యుక్తంగా ఉంటుంది.
దీనికి తోడు స్టార్స్ ప్రాజెక్టులో ఒక కంటింజెన్సీ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ కాంపొనెంట్‌(సిఇఆర్‌సి) ఉంది. నేష‌న‌ల్ కాంపొనెంట్కింద ఏదైనా ప్ర‌కృతి, మాన‌వుల కార‌ణంగా, ఆరోగ్య ప‌రంగా ఎదుర‌య్యే ముప్పున‌కు మ‌రింత బాధ్యతాయుతంగా ఎదుర్కొనేందుకు వీలు క‌ల్పిస్తుంది. పాఠ‌శాల మూసివేత‌, మౌలిక‌స‌దుపాయాలు పాడైపోవ‌డం, త‌గినంత‌గా స‌దుపాయాలు లేక‌పోవ‌డం,మారుమూల ప్రాంతాల‌లోఅభ్య‌స‌న‌కు సాంకేతిక‌ప‌రిజ్ఞానం వినియోగానికి సంబంధించి ప్ర‌భుత్వం త‌గిన విధంగా స్పందించ‌డానికి ఇది ఉప‌క‌రిస్తుంది.
సిఇఆర్‌సి కాంపొనెంట్ స‌త్వ‌ర ఫైనాన్సింగ్ రీ కేట‌గిరైజేష‌న్‌, ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం గ‌ల ఫైనాన్సింగ్ అభ్య‌ర్థ‌న ప్ర‌క్రియ‌ల‌ను వాడుకునేందుకు వీలు క‌ల్పిస్తుంది.

2) రాష్ట్రాల స్థాయిలో, ఈ ప్రాజెక్టు
--శిశు విద్య,అభ్య‌స‌న పునాదిని బ‌లోపేతం చేయ‌డం
--అభ్య‌స‌న అసెస్‌మెంట్‌విధానాల‌ను మెరుగుప‌ర‌చ‌డం
--క్లాస్‌రూమ్ బోధ‌న‌ను బ‌లోపేతంచేయ‌డం
--ఉపాధ్యాయ‌నైపుణ్యాల‌ను అభివృద్ధి చేయ‌డం ద్వారా రెమిడియేష‌న్‌,పాఠ‌శాల నాయ‌క‌త్వం పెంపొందించ‌డం ,మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు పాల‌న‌, వికేంద్రీకృత మేనేజ్‌మెంట్‌
--పాఠ‌శాల‌ల్లో వృత్తివిద్య‌ను బ‌లోపేతం చేయ‌డం,కెరీర్‌గైడెన్సు, కౌన్సిలింగ్‌, ఇంటర్న్‌షిప్‌, పాఠ‌శాల వెలుప‌లి విద్యార్ధుల‌కు క‌వ‌రేజ్‌
స్లార్స్‌ప్రాజెక్టు ప్ర‌ధాన‌మంత్రి ఈ విద్య‌,  ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్‌లో భాగంగా ఫౌండేష‌న‌ల్ లిట‌రసీ, ‌న్యూమ‌ర‌సీ మిష‌న్‌,నేష‌న‌ల్‌క‌రికుల‌ర్ పెడ‌గోగిక‌ల్‌ఫ్రేమ్ వ‌ర్క్ ఫ‌ర్  ఎర్లీ చైల్డ్‌హుడ్‌కేర్‌, ఎడ్యుకేష‌న్‌పైకూడా  దృష్టిపెడుతుంది.
ఈ ప్రాజెక్టు కింద విద్యార్ధులు గ్రేడ్‌3 లాంగ్వేజ్‌ లో ఎంపిక‌చేసిన రాష్ట్రాల‌లో క‌నీస నైపుణ్యాలు సాధించడం, సెకండ‌రీ స్కూలు విద్య‌పూర్తి చేసే రేటును మెరుగు ప‌ర‌చ‌డం, గ‌వ‌ర్నెన్స్ ఇండెక్స్‌స్కోరును మెరుగుప‌ర‌చ‌డం,అభ్య‌స‌న అసెస్‌మెంట్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డం, వివిధ రాష్ట్రాల మ‌ధ్య క్రాస్ లెర్నింగ్‌కు వీలు క‌ల్పించే విధంగా భాగ‌స్వామ్యాన్ని అభివృద్ధి చేయ‌డం,  బిఆర్‌సి, సిఆర్‌సిల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం ద్వారా వికేంద్రీకృత యాజ‌మాన్యానికి సంబంధించి రాష్ట్ర‌స్థాయిలో ప్ర‌ణాళిక‌,నిర్వ‌హ‌ణ సామ‌ర్ధ్యాలు మెరుగుప‌ర‌చ‌డం, హెడ్‌టీచ‌ర్లు, ప్రిన్సిపాళ్ల‌కు శిక్ష‌ణ ఇవ్వడం ద్వారా విద్యా సేవ‌ల అందుబాటును మెరుగు ప‌రిచేవిధంగా బ‌లోపేత‌మైన పాఠ‌శాల యాజ‌మాన్యం ఉండేట్టు చేయ‌డం వంటివి ఉన్నాయి.


(Release ID: 1664505) Visitor Counter : 255