కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
బెంగళూరు రాజాజీనగర్ ఇఎస్ఐసి మెడికల్‌కాలేజి , ఆస్పత్రిలో తగిన సౌకర్యాలు లేవని,సరైన సేవలు అందడంలేదంటూ కొన్ని టివి ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలను ఖండించిన ఇఎస్ఐసి
Posted On:
13 OCT 2020 5:27PM by PIB Hyderabad
కేంద్రకార్మిక మంత్రిత్వశాఖ కిందగల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి)కు చెందిన బెంగళూరు రాజాజీనగర్‌లోని ఇఎస్ఐసి మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని, సరైన సేవలు అందడంలేదంటూ కొన్ని ఛానళ్లు ఆరోపించడాన్ని ఇఎస్ఐసి ఖండించింది.
ఇందుకు సంబంధించిన వివరణ ఇస్తూ ఇఎస్ఐసి , రాజాజీనగర్‌లోని ఇఎస్ఐసి మెడికల్ కాలేజి, ఆస్పత్రి ఇఎస్ ఐ కింద బీమా కలిగిన వర్కర్లు, వారి పై ఆధారపడిన వారికి అన్నిరకాల చికిత్సలకు సంబంధించినసేవలు అందిస్తున్నదని తెలిపింది.
రాజాజీనగర్ లోనిఇఎస్ఐసి మెడికల్‌కాలేజీ, ఆస్పత్రి కోవిడ్ తొలి స్పందన ఆస్పత్రి , ప్రత్యేక కోవిడ్ హెల్త్ కేర్‌సెంటర్‌గాఉన్నదని , ఇది 2020 మార్చినుంచి 60,690 మంది పేషెంట్లకు చికిత్స చేసిందని తెలిపింది.
ఈ కళాశాల 2020 మార్చి నుంచి కోవిడ్ -19కు చికిత్స అందిస్తోంది. అలాగే ఐసిఎంఆర్ ఆమోదిత ఆర్‌టిపిసిఆర్, రాపిడ్ యాంటిజెన్‌పరీక్షలు నిర్వహిస్తోంది. కోవిడ్ పాజిటివ్ కలిగిన వారికిసంబంధించి కాన్పులుకూడా ఈ ఆస్పత్రి విజయవంతంగా చేసింఇ. దీనికితోడు ఇఎస్ఐసి బీమా సదుపాయం కలిగిన కార్మికులకు , బీమా సదుపాయం లేనివారికి వైద్య సేవలు అందిస్తోంది. కోవిడ్ -19 మహమ్మారిసమయంలో పేషెంట్లు, వైద్య ఆరోగ్య కార్యకర్తల ఆరోగ్యం ఆస్పత్రికి ఎంతో ప్రాధాన్యత కలిగినది. కొన్నిటివి ఛానళ్లు చేసిన ఆరోపణలకు సంబంధించి,ప్రస్తావిస్తూ ఆస్పత్రిలో ఎన్-95 మాస్కులు, పిపిఇ సేఫ్టీకిట్‌లు. మూడు పొరలు కలిగిన మాస్కులు, గ్లోవ్‌లు మందులు సరిపడినన్నిఉన్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పేషెంట్లు, వ్యక్తుల భద్రతకు సంబంధించి వైఫల్యం జరిగినట్టు ఒక్క సంఘటన కూడా ఆస్పత్రిలో రిపోర్టు కాలేదని ఇఎస్ఐసి తెలిపింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఇఎస్ ఐ సి ఆస్పత్రులుకోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనే కార్యక్రమంలో పనిచేస్తున్నాయి. ఇఎస్ ఐ కార్పొరేషన్ తమ మౌలిక సదుపాయాలను సాధారణ ప్రజలకు కూడా కోవిడ్ చికిత్సకు అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా గల 23 ఇఎస్ఐ ఆస్పత్రులలో సుమారు 3597 బెడ్లతో కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులుగా పనిచేస్తున్నాయి.ఇవి కోవిడ్ వైద్యసేవలను సాధారణ ప్రజలకుకూడా అందిస్తున్నాయి.ఇంకా ఈ ఆస్పత్రులలో మొత్తం 555 ఐసియు, హెచ్‌డియు బెడ్లు,213 వెంటిలేటర్ సదుపాయంకలిగిన బెడ్లు ఈ ఆస్పత్రులలో అందుబాటులోకి తేవడం జరిగింది.
ప్రస్తుత పరీక్షా సమయంలోదేశం మొత్తం కోవిడ్ మహమ్మారిక వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది, వైద్యులు, పారా మెడికల్‌సిబ్బంది నిజమైన యోధులు. వారు తమ విధి నిర్వహణ సమయాలకుమించి ప్రజల ప్రాణాలుకాపాడడానికి , కోవిడ్ మహమ్మారి దారుణ ప్రభావం నుంచి ప్రజలను కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నారు.
మీడియా పాత్రను ఏమాత్రం తక్కువచేయడానికి లేదు. అయితే ఈ పరీక్షా సమయంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నైతికస్థైర్యాన్ని ఉన్నతస్థాయిలో ఉంచేందుకు మీడియా సహకారాన్ని,సంయమనాన్ని కోరుతున్నది
ఇలాంటి అంశాలను రిపోర్టు చేసేటపుడు హడావుడిగా అవాస్తవాలు ప్రసారమయ్యే పరిస్థితి కాక, నైతిక విలువలతో కూడిన జర్నలిజంలో భాగంగా, ఆయా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు అధికారులనుంచి తనిఖీచేసుకుని వాస్తవాలను ప్రజలకు నివేదించాలని ఇఎస్ఐసి కోరుకుంటోంది
***
(Release ID: 1664233)
Visitor Counter : 107