జల శక్తి మంత్రిత్వ శాఖ
జల జీవన్ మిషన్: చక్రాలపై ప్రయోగశాల!
నీటి పరీక్షల కోసం వినూత్న పరిష్కారాన్ని కనుగొన్న హర్యానా ప్రభుత్వం; అత్యాధునిక నీటి పరీక్షా లాబొరేటరీ వ్యాన్ ప్రారంభం
Posted On:
12 OCT 2020 5:12PM by PIB Hyderabad
పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అన్నది ప్రజారోగ్యానికి అత్యవసరం, అందుకే నిత్యం నీటిని పరీక్షించి సరఫరా చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం నిశ్చయించింది.
ప్రతి ఆవాసానికీ 2024నాటికి కుళాయి నీరు ఇవ్వాలన్నది జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జల జీవన్ మిషన్ లక్ష్యం. ఇందుకోసం ఉద్దేశించిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఇందులో భాగంగా నీటి నాణ్యత, పర్యవేక్షణ మిషన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. నీటి పరీక్షల అవసరం ఎంత ఉన్నదో గుర్తించి, హర్యానా ప్రభుత్వం అత్యాధునిక మొబైల్ వాటర్ టెస్టింగ్ వ్యాన్‌ను ప్రారంభించింది. ఇందులో అనలైజర్లు / సెన్సార్ / ప‌్రోబ్స్ / నీటి పరీక్షలకు అవసరమైన పరికరాలతో కూడిన బహుళ పారామితి వ్యవస్థ ఉంటుంది. హర్యానా రాష్ట్రంలో నీరు ఫ్లోరైడ్, నైట్రేట్, ఇనుము, క్షారత వంటి మొత్తం పదార్ధాలు కరిగి ఘనమైన (టోటల్లీ డిసాల్వ్డ్ సాలిడ్స్ -టిడిఎస్) వల్ల ప్రభావితమవుతోంది.
మొబైల్ వాటర్ టెస్టింగ్ లాబ్ వ్యాన్ లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరికరాలు ఉంటాయి. ప్రాంతాన్ని గుర్తించేందుకు జిపిఎస్ ట్రాకర్, విశ్లేషించిన శాంపుల్ డాటాను పవర్ బ్యాక్ అప్ తో కూడి జిపిఆర్ ఎస్ / 3జి అనుసంధానిత కేంద్రీకృత పిహెచ్ ఇడి సర్వర్ ద్వారా పంపుతారు. అక్కడికక్కడే రికార్డింగ్ చేసి, ఫలితాలను స్మార్ట్ ఫోన్ లేక అటువంటి పరికరాల ద్వారా వెబ్ ఆధారిత కేంద్ర సర్వర్‌కు నేరుగా పంపే సామర్ధ్యం కలిగి ఉంది. పూర్తిగా యాంత్రికమైన సెన్సార్ ఆధారిత విశ్లేషణ కలిగి ఉంది. ఇది కేంద్రీకృత సాఫ్ట్ వేర్ ఆధీనంలో ఉంటుంది. విశ్లేషణ పూర్తి అయిన తక్షణమే మొబైల్ వ్యాన్‌లో ఉన్న ఎల్ ఇడి డిస్ల్పే యూనిట్ ఫలితాలను చూపుతుంది.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోని మంచినీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు ఈ మొబైల్ వాటర్ టెస్టింగ్ లాబొరేటరీ సమర్ధవంతంగా పని చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. పిహెచ్, క్షారత, టిడిఎస్, కఠినత, క్లోరిన్ అవశేషాలు, జింక్, నైట్రేట్, ఫ్లోరైడ్, మాలిన్యాలు, సూక్ష్మ - జీవ పరీక్షల శాంపుళ్ళ భిన్న నీటి నాణ్యత పారామితులను కొలిచే సామర్ధ్యాన్ని లాబ్ కలిగి ఉంది. పరీక్షిస్తున్న ప్రాంతంలోని నీటి నాణ్యతను త్వరిత గతిన గుర్తించేందుకు ఈ మొబైల్ లాబ్ తోడ్పడుతుంది.
ఈ మొబైల్ టెస్టింగ్ వాన్‌ను కర్నాల్‌లోని రాష్ట్ర నీటి పరీక్షల ప్రయోగశాల వద్ద ఉంచుతారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతాలలో కార్యకలాపాలను సాగిస్తుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో కూడా నీటి పరీక్షలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నూతన సౌకర్యం అవకాశాన్ని కల్పిస్తుంది. నీటి ద్వారా కలిగే వ్యాధులు పెచ్చరిల్లినప్పుడు, ఆ ప్రాంతంలో ఈ వ్యాన్లను మోహరించి, నీటి పరీక్షల రిపోర్టులను త్వరితగతిన అందుబాటులోకి తెచ్చుకొని ప్రభావవంతంగా వ్యాధిని నియంత్రించేందుకు సహాయపడుతుంది.
జల జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకం. ఈ పథకం కింద ప్రతి గ్రామీణ గృహానికీ కుళాయి నీటి అనుసంధానాన్ని కల్పించి, స్థిరమైన మంచి నీటి సరఫరాకు హర్యానా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నీటి నాణ్యత పర్యవేక్షణకు ఈ మిషన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. ప్రతి గ్రామంలో ఐదుగురు వ్యక్తులు, ముఖ్యంగా మహిళలకు ఫీల్డ్ టెస్ట్ కిట్స్‌ను ఉపయోగించడంలో శిక్షణను ఇవ్వడాన్ని మిషన్ తప్పనిసరి చేస్తుంది. తద్వారా గ్రామాలలో నీటిని పరీక్షించవచ్చు. రాష్ట్రాలకు చెందిన ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ / గ‌్రామీణ నీటి సరఫరా శాఖ గ్రామీణ ఆవాసాలకు సురక్షిత మంచినీటి సరఫరా చేసేందుకు, ప్రయోగశాలల్లో నీటి నాణ్యతను నిత్యం పరీక్షించడాన్ని తప్పనిసరిగా చేస్తున్నారు.
***
(Release ID: 1663825)
Visitor Counter : 183