వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖరీఫ్ సీజన్ 2020-21లో మద్దతు ధర కార్యక్రమం

ఖరీఫ్ 2020-21 సంవత్సరంలో వరిధాన్యం సేకరణ ఊపందుకుంది. రాష్ట్రాలు మరింత ధాన్యాన్ని కొనడంతోపాటు కొత్త రాష్ట్రాలు కూడా వరిని సేకరించడమే ఇందుకు కారణం. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో రూ. 3.33 కోట్ల విలువైన పెసర, రూ. 52.40 కోట్ల విలువైన కొబ్బరి , 75.45 కోట్ల రూపాయల విలువైన పత్తిని ఈ ఏడాది అక్టోబర్ 10 వరకు సేకరించారు

Posted On: 11 OCT 2020 6:19PM by PIB Hyderabad

2020-21  ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) ప్రారంభం కావడంతో, ప్రభుత్వం మునుపటి సీజన్ల ఎంఎస్పీ పథకాల ప్రకారమే  రైతుల నుండి ఖరీఫ్ 2020-21 పంటలను ఎంఎస్పి వద్ద కొనుగోలు చేస్తున్నది. ఖరీఫ్ 2020-21 సంవత్సరంలో వరిధాన్యం సేకరణ ఊపందుకుంది. రాష్ట్రాలు మరింత ధాన్యాన్ని కొనడంతోపాటు కొత్త రాష్ట్రాలు కూడా వరిని సేకరించడమే ఇందుకు కారణం.   ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి ఈ ఏడాది అక్టోబరు వరకు 37.92  లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎమ్‌టి) వరిని మొత్తం రూ. 7159.39 కోట్ల ఎంఎస్పీతో 3.22 లక్షల మందికి పైగా రైతుల నుంచి సేకరించింది.

 తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020లో 30.70 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె విత్తనాలను సేకరణకు  అనుమతులు వచ్చాయి.  అంతేగాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి  1.23 లక్షల మెట్రిక్ టన్నుల విలువైన కొబ్బరిపంట కొనుగోలుకు అనుమతులు వచ్చాయి.  పప్పులు, నూనె గింజలు,కొబ్బరి సేకరణ కోసం ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద ప్రతిపాదనలు రాగానే ఇతర రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా అనుమతులు వస్తాయి. ఫలితంగా ఈ పంటల ఎఫ్ఏక్యూ గ్రేడ్ను 2020–21 సంవత్సరానికి ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం నిర్ణయిస్తారు.  ప్రకటిత కోతలకాలంలో మార్కెట్ రేటు ఎంఎస్పీ కంటే తక్కువస్థాయులకు చేరితే సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని సేకరణసంస్థల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీలే నమోదు చేసుకున్న రైతుల నుంచి పంటలను కొంటాయి.

ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరు పదో తేదీ వరకు వరకు, తన నోడల్ ఏజెన్సీల ద్వారా 459.60 మెట్రిక్ టన్నుల పెసరను  రూ.3.33 కోట్ల విలువైన ఎంఎస్పీ వద్ద కొనుగోలు చేసింది. ఫలితంగా తమిళనాడు, హర్యానాలో 326 మంది రైతులకు లబ్ధి చేకూరింది. అదేవిధంగా, 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరిని రూ.52.40 కోట్ల విలువైన ఎంఎస్పీ వద్ద కొన్నారు. దీనివల్ల కర్ణాటక, తమిళనాడులలో 3,961 మంది రైతులకు మేలు జరిగింది.

కొబ్బరి, మినుముల రేట్లు చాలా రాష్ట్రాల్లో.. ఎంఎస్పీ లేదా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఖరీఫ్ పప్పులు, నూనె విత్తనాలపంటలు చేతికొచ్చే సమయాన్ని బట్టి ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయించిన తేదీల ప్రకారం ధాన్యాల సేకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి చేస్తున్నాయి. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో  పత్తి  విత్తనాల (కపాస్) సేకరణ 2020 అక్టోబర్ 1 నుండి ప్రారంభమైంది.  కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది అక్టోబర్ 10 వాటికి  సంచిత సేకరణ విధానంలో రూ.7,545 లక్షల విలువైన ఎంఎస్పీ వద్ద 24,863 బేళ్లను కొనుగోలు చేసింది. దీంతో 5252 మంది రైతులకు లబ్ధి చేకూరింది. 

****



(Release ID: 1663626) Visitor Counter : 133