రైల్వే మంత్రిత్వ శాఖ

గత ఏడాదితో పోల్చి చూస్తేఅక్టోబర్ లో గణనీయంగాపెరిగిన రైల్వేల సరకు రవాణా ఆదాయం అక్టోబర్ మొదటి వారంలో 18 % పెరుగుదల

గత సంవత్సరం అక్టోబర్ 8 వరకు 22 .1 మిలియన్ టన్నులు. ఈ సంవత్సరం అక్టోబర్ 8 వరకు 26 .14 మిలియన్ టన్నులకు చేరిక

సరకు రవాణా ద్వారా ఆర్జించిన ఆదాయం 250 . 71 రూపాయలకు చేరిక

రవాణాను మరింత ఎక్కువ చేయుటకు సెక్టార్ల వారీగా సమావేశాలు. అన్ని స్థాయిలలో సమన్వయం సాధించడానికి కృషి

సిమెంట్, బొగ్గు, ఇంధనం, ఉక్కు, ఇనుప ఖనిజం, ఆటోమొబైల్ రంగాల ప్రతినిధులతో గత వారం సమావేశం
రైల్వేల ద్వారా సరకు రవాణా చేసేవారికి రాయితీలు / డిస్కౌంట్లు

Posted On: 09 OCT 2020 6:09PM by PIB Hyderabad

గత ఏడాది ఆక్టోబరుతో పోల్చి చూస్తే ఈ ఏడాది అక్టోబర్ లో రైల్వేలో సరకు రవాణా దాని ద్వారా వచ్చిన ఆదాయం గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ 8 వ తేదీ వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే రవాణా మరియు రవాణా ద్వారా రైల్వేలకు వచ్చిన ఆదాయం గత ఏడాది రవాణా, ఆదాయాన్ని మించి ఉన్నాయి.

    గత ఏడాది అక్టోబర్ తో పోల్చి చూస్తే 2020 అక్టోబర్ నెల 8 వ తేదీ వరకు ఇదే సమయానికి జరిగిన సరకు రవాణా మరియు దాని ద్వారా వచ్చిన ఆదాయం 18 % మేరకు పెరిగాయి. అక్టోబర్ 8 వ తేదీ వరకు రైల్వేలు 26 .14 టన్నుల సరకులను రవాణా చేశాయి.  గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఇది 18 % ( 22 . 1 మిలియన్ టన్నులు) ఎక్కువ.  ఈ ఏడాది అక్టోబర్ 8 వరకు రైల్వేలు 26 .14 మిలియన్ టన్నుల సరకులను రవాణా చేశాయి. గత ఏడాది ఇదే సమయానికి రైల్వేల ద్వారా 22 .1 మిలియన్ టన్నుల సరకులు రవాణా అయ్యాయి. ఇదే సమయంలో గత ఏడాదితో  పోల్చి చూస్తే సరకు రవాణా ఆదాయం 250 .71 రూపాయల మేరకు పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 8 వరకు రైల్వేలు 2477 .07 రూపాయల ఆదాయాన్ని ఆర్జించాయి. గత ఏడాది ఈ మొత్తం 2226 .36 కోట్ల రూపాయల వరకు ఉంది.

   2020 అక్టోబర్ 8 వరకు రైల్వేలు రవాణా చేసిన 26 .14 టన్నుల సరుకుల్లో 11 .47 టన్నుల బొగ్గు,3 .44 టన్నుల ఇనుప ఖనిజం, 1 .28 టన్నుల ఆహారధాన్యాలు, 1 .5 టన్నుల ఎరువులు, 1 .56 టన్నుల సిమెంట్ ( కంకరను మినహాయించి ) ఉన్నాయి.

   సరకు రవాణాదారులకు రైల్వేలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను, ప్రొత్సాహకాలను అందచేయడం ఇక్కడ ప్రస్తావించవలసి ఉంటుంది.

   సరకు రవాణా దీనిద్వారా లభిస్తున్న ఆదాయం రానున్న రైల్వే బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్నాయి.

   అన్ని రంగాలలో సమర్దతను మెరుగు పరచుకోడానికి రైల్వేలు కోవిద్ 19 వల్ల నెలకొన్న పరిణామాలను అనుకూలంగా మలచు కొంటున్నాయి. 

                                                              ****



(Release ID: 1663296) Visitor Counter : 95