రక్షణ మంత్రిత్వ శాఖ
లేహ్ లోని ఖర్దుంగ్లా పాస్ వద్ద భారతవైమానిక దళం స్కైడైవ్ ల్యాండింగ్
Posted On:
09 OCT 2020 6:21PM by PIB Hyderabad
స‌్నేహం, బృంద స్ఫూర్తి, భౌతిక, మానసిక ధైర్యం వంటి లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో భారత వైమానిక దళం తన సిబ్బంది సాహస కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. క్షేత్ర స్థాయిలో సామర్ధ్య నిర్మాణం, సాహస కార్యకలాపాలను నిరంతరం ప్రోత్సహించే కృషి చేస్తూ, యువ వైమానిక యోధులు సాహస కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రేరణనిస్తుంది.
భారత వైమానిక దళం అక్టోబర్ 8 (శుక్రవారం) నాడు తన 88వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమం గుర్తిండిపోయేలా, తన గత కాలపు రికార్డును బద్దలు చేస్తూ 17982 అడుగుల ఎత్తులో ఉన్న లేహ్ లోని ఖర్దుంగ్లా పాస్ వద్ద అత్యంత ఎత్తులో స్కైడైవ్ ల్యాండింగ్ చేసింది. శుక్రవారం నాడు ఖర్దుంగ్లా పాస్ వద్ద వింగ్ కమాండర్ గజానంద్ యాదవ, వారెంట్ ఆఫీసర్ ఎకె తివారీ విజయవంతంగా సి-13- జె విమానందించి రికార్డు సృష్టించారు. అంత ఎత్తులో లాండింగ్ చేయడమన్నది అత్యంత సవాళ్ళతో కూడుకున్న పని. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండడమే కాక, తక్కువ వాయు సాంద్రత కలిగిన కఠినమైన కొండ భూభాగం అది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి, నూతన వైమానిక దళ రికార్డును నెలకొల్పడంలో, ఘన విజయాన్నిసాధించడంలో ఇద్దరు వాయుసేన యోధులు వృత్తి నైపుణ్యాన్ని, సాహసాన్ని, పట్టుదలను ప్రదర్శించారు.
భారత వైమానిక దళాలు సవాళ్లకు ఎదురు నిలిచి నూతన ఎత్తులను అధిరోహిస్తూ,తమ సూత్రమైన మిషన్ ఇంటిగ్రిటీ అండ్ ఎక్సలెన్్స అన్నవాటికి కట్టుబడి ఉంటారని ఈ ప్రత్యేక విజయం మరొకసారి వెల్లడించింది.
***
(Release ID: 1663270)
Visitor Counter : 199