మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
గ్యాన్ సర్కిల్ వెంచర్లను ప్రారంభించిన కేంద్ర విద్యా శాఖమంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్.
ఇది ఐఐటి శ్రీసిటీలో ఏర్పాటైన ఎంఇఐటి వై నిధులతో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్.
Posted On:
08 OCT 2020 5:43PM by PIB Hyderabad
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్‌పోఖ్రియాల్ నిశాంక్, ఎం.ఇ.ఐటి వై నిధులతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు శ్రీసిటీలో ఏర్పాటైన ఐఐటి కి చెందిన టెక్నాలజీ ఇంక్యుబేటర్ సెంటర్‌నువీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఉన్నత విద్యాశౄఖ కార్యదర్శి శ్రీ అమిత్‌ఖరే, ఎం.ఇ.ఐ.టి వై కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శ్రీ సతీష్ చంద్ర, శ్రీసిటీ ఛైర్మన్ శ్రీ శ్రీనివాస రాజు,ఐఐటి శ్రీసిటీ చిత్తూరు డైరక్టర్ ప్రోఫెసర్ కన్నబీరన్,మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ పోఖ్రియాల్, ఆవిష్కరణలు దేశ ప్రగతికి శక్తినిస్తాయని అన్నారు. మనం నాయకత్వ న్ని కొనసాగించేందుకు,శాస్త్రసాంకేతిక రంగాలలో పోటీపడేందుకు ,స్వావలంబనకు సత్వర ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ మనకు అవసరమని ఆయన అన్నారు. గ్యాన్ సర్కిల్ వెంచర్స్ వంటి ఇలాంటి కేంద్రాల ద్వారా మనం యువత మనసుల్లో ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ భావాలను పాదుకొల్పవచ్చని తద్వారా వారిని విజయవంతమైన ఆవిష్కర్తలుగా ముందుకు తీసుకుపోవచ్చని ఆయనన్నారు.
2020లో ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ స్ఫూర్తిని దృష్టిలోఉంచుకుని ఐఐఐటి శ్రీసిటీ టిబిఐ,గ్యాన్ సర్కిల్ వెంచర్స్‌ను ప్రారంభిస్తోంది. గ్యాన్ సర్కిల్‌వెంచర్స్ టెక్నాలజీ ఇంక్యుబేషన్, డవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యుయర్స్ (టిఐడియి2.0) ఇంక్యుబేషన్ సెంటర్ ను కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎం.ఇ.ఇఐటి వై) ఆమోదించిన విధంగా దీనిని ఏర్పాటు చేసినట్టు శ్రీ పోఖ్రియాల్ తెలిపారు.
ఈ ఇంక్యుమేబేటర్‌ఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ,బ్లాక్‌చెయిన్, సైబర్‌ఫిజికల్‌సిస్టమ్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, రోబోటిక్స్ వంటి వాటిని ఉపయోగించుకునిఆయా సంస్థల ఎంటర్‌ప్రెన్యుయర్ స్ఫూర్తిని పెంపొందించడానకి ఉపకరిస్తుంది.
గ్యాన్ సర్కిల్ వెంచర్స్ ఆవిష్కరణలకు,స్టార్టప్‌లకుహబ్‌గా ఉండి వాటికి మద్దతు నిస్తుందని శ్రీపోఖ్రియాల్ చెప్పారు. వీటికి మద్దతు, వివిధ దశలలో అండగా ఉండడడం, పెట్టుబడలు, మౌలికసదుపాయాలు, మెంటారింగ్‌వంటి సేవలు అందించనున్నట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా టిబిఐకి ఒక సలహా మండలి ఉంటుందని , ఇందులో పారిశ్రామికవేత్తలు, ఎంటర్‌ప్రెన్యుయర్లు, సాంకేతిక నిపుణులు ఉంటారని అన్నారు. ఇంక్యుబేషన్ సంస్థలు నిపుణుల సహాయం,నెట్‌వర్క్ సహాయాన్ని అకడమిక్,పరిశ్రమలనుంచిపొందడానికి వీలు కలుగుతుందని అన్నారు. ఈ ఇంక్యుబేటర్ సమాజంలోఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ స్పృహనుపెంచడానికి చోదకశక్తిగా ఉపయోగపడి ఉపాధి కల్పనను వేగవంతం చేస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ ఖరే, శ్రీసిటీలోని ఐఐఐటి విద్యార్ధులు, ఫాకల్టీలో ఆవిష్కరణల సంస్కృతిని, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ను ప్రోత్సహించి కమ్యూనిటీ అవసరాలను తీర్చేందుకు వారి శక్తిసామర్ధ్యాలు పూర్తి స్థాయిలో వినియోగమయ్యేట్టు పలువిధాలుగా కృషి చేస్తుంది. ఐఐఐటి శ్రీసిటీ విద్యా మంత్రిత్వశాఖలోని ఆవిష్కరణల విభాగంలో భాగంగా ఉంది. ఇది ఇన్‌స్టిట్యూట్ ఇన్నొవేషన్‌కౌన్సిల్‌ను ఏర్పాఉచేసింది. ఇంకా ఐఐటి శ్రీసిటీ ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ సెల్( ఈ -సెల్)ను విద్యార్ధులు తమ ఆలోచనలనకు రూపకల్పన చేసేందుకు వాటిని వ్యాపార అవకాశాలుగా మలచేందుకు కృషి చేస్తుంది. ఈ- సెల్ సామాజిక బాధ్యతగల విజయవంతమైన ఎంటర్‌ప్రన్యుయర్లుగా విద్యార్ధులు ఎదిగేందుకు శిక్షణనిస్తుంది.ఇన్వెస్ట్‌మెంట్, మౌలికసదుపాయాలు, ఇతర రకాల మద్దతు నిచ్చేందుకు ఇన్నొవేటర్లు, స్టార్టప్‌లకు టిబిఐ -గ్యాన్‌సర్కిల్‌వెంచర్స్ కృషిచేస్తుందని శ్రీఖరే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది విద్యార్ధులు, ఫాకల్టీల ఆవిష్కరణలనుంచి రూపుదిద్దుకున్న వాటిని వ్యాణిజ్యపరంగా ముందుకుతీసుకువెళ్లేందుకు ఒకఛానల్ గా కూడా ఉపయోగపడనున్నదని ఆయన అన్నారు.
.ఎం.ఇ.ఐటి వై కార్యదర్శి శ్రీఅజయ్ ప్రకాశ్ సాహ్ని మాట్లాడుతూ, శ్రీసిటీ ఐఐఐటి విద్యారంగం, పరిశ్రమలు పరస్పరం ఆవిష్కరణల రంగంలో సహకరించుకోవడానికి సంబంధించి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.
***
(Release ID: 1662960)
Visitor Counter : 208