రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత వైమానిక దళం అధునాతన లైట్ హెలికాప్టర్ ముందు జాగ్రత్త ల్యాండింగ్

प्रविष्टि तिथि: 08 OCT 2020 4:07PM by PIB Hyderabad

భారతీయ వైమానిక ద‌ళానికి చెందిన అధునాతన లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్‌)
సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సర్సావాలో గ‌ల‌ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి గాలిలోకి ప్రయాణించింది. సర్సావా నుండి దాదాపుగా ముఫ్ఫై ఎన్ఎంల వ‌ద్ద‌ హెలికాప్టర్‌లో సాంకేతికంగా అవ‌రోధం ఏర్ప‌డింది. దీంతో ఎయిర్ ‌ఫీల్డ్‌కు దక్షిణాన ముందు జాగ్రత్త ల్యాండింగ్ చేశారు. ఏఎల్‌హెచ్ పైలట్లు తీసుకున్న చర్యలు స‌ముచిత‌మైన‌వి మరియు సరైనవి పేర్కొన‌డ‌మైంది. ఈ సంఘ‌ట‌న‌లో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. సర్సావాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి ఒక రికవరీ బృందం వెంటనే సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని అక్క‌డ అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల్ని చేప‌ట్టింది.

***

 


(रिलीज़ आईडी: 1662867) आगंतुक पटल : 239
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Tamil