హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రజా ఉద్యమంలో చేరాలని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"మనందరం ఐక్యంగా ఉంటేనే కోవిడ్ -19 వంటి ప్రపంచ మహమ్మారిపై సమర్ధవంతంగా పోరాడగలం"

" ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సామూహిక ఉద్యమంలో మనందరం అవగాహన పెంచుకుని ఐక్యంగా పోరాడినప్పుడే భారతదేశాన్ని

కొవిడ్-19 రహితంగా మార్చడంలో ముఖ్యపాత్ర పోషించగలం"

"కోవిడ్-19 నుండి మనల్ని కాపాడుకోవడానికి మూడు మార్గాలు మాత్రమే ఉన్నాయి: అవి మాస్క్ ధరించడం, రెండు మీటర్ల సామాజిక

దూరం పాటించడం, మరియు తరచూ చేతులు కడుక్కోవడం"

"ప్రధాని మోదీ సూచించిన ఈ మూడు మార్గాలను అనుసరించడం వల్ల మీరు సురక్షితంగా ఉండడమే కాకుండా మీ కుటుంబం,

స్నేహితులు మరియు సహచరులను కూడా కొవిడ్-19 బారిన పడకుండా సురక్షితంగా ఉంచుకోవచ్చు"

కోవిడ్ -19 కు వ్యతిరేక పోరాటంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో చేరాలని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా

Posted On: 08 OCT 2020 1:32PM by PIB Hyderabad

దేశప్రజలందరికీవిజ్ఞప్తి చేశారు.

తన ట్వీట్ లో  శ్రీ అమిత్ షా  “కోవిడ్ -19 వంటి అంతర్జాతీయ మహమ్మారిపై  దేశ ప్రజలందరూ కలిసి వచ్చినప్పుడు మాత్రమే

పోరాడగలం. మనమందరం ఐక్యంగా ఉండి ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సామూహిక ఉద్యమంలో చేరడంతో పాటు ఈ మహమ్మారి

గురించి అందరికీ అవగాహన కలిగించనప్పుడు మాత్రమే భారతదేశాన్ని కొవిడ్-19 రహితంగా మార్చడంలో కీలకపాత్ర  పోషించగలమని.

”పేర్కొన్నారు.

"కొవిడ్-19 నుండి మనల్ని రక్షించుకోవడానికి కేవలం మూడు మార్గాలు మాత్రమే ఉన్నాయి: అవి మాస్క్ ధరించడం, రెండు మీటర్ల

సామాజిక దూరం పాటించడం మరియు తరచూ చేతులు కడుక్కోవడం. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ సూచించిన ఈ మార్గాలను అనుసరించడం

ద్వార  మిమ్మల్ని సురక్షితంగా ఉంచుకోవడమే కాకుండా, మీ కుటుంబం, స్నేహితులు మరియు సహచరులను కూడా కొవిడ్-19

మహమ్మారి సురక్షితంగా ఉంచుకోవచ్చు” అని కేంద్రహోంమంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు.

***



(Release ID: 1662861) Visitor Counter : 186