మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు చెందిన డిపార్టెమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ, పాఠశాలలు తిరిగి తెరిచేందుకు ఎస్.ఒ.పి, మార్గదర్శకాలను ఈరోజు జారీచేసింది.
Posted On:
05 OCT 2020 6:58PM by PIB Hyderabad
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు చెందిన డిపార్టెమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ విభాగం, పాఠశాలలు తిరిగి తెరిచేందుకు ఎస్.ఒ.పి, మార్గదర్శకాలను ఈరోజు జారీచేసింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి ట్విట్టర్ ద్వారా ఎస్.ఒ.పి, మార్గదర్శకాల గురించి ప్రకటించారు.పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి డిపార్టమెంట్ ఆఫ్ స్కూల్ , లిటరసీ వారి ఎస్.ఒ.పి, మార్గదర్శకాల సంక్షిప్త ముఖ్యాంశాలు.- పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆర్డర్ నెంబర్ 40-3/2020-DM-I(A) తేదీ 30.09.2020ప్రకారం, 15-10-2020 తర్వాత దశలవారీగా పాఠశాలలు, కోచింగ్ కేంద్రాలను తెరిచేందుకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి స్థానిక పరిస్థితులు, సంబంధిత పాఠశాల, సంస్థ యాజమాన్యంతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవచ్చు.
.-పార్ట్ -1, పాఠశాలల పునఃప్రారంభం విషయంలో ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, భద్రతా ప్రొటోకాల్స్ కు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇప్పటికే జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా ఉన్నాయి. వీటిని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేపట్టడం లేదా వర్తింపచేయవచ్చు.
1. పాఠశాల ప్రాంగణంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే కాక, వాటిని క్రిమిరహితం చేయాలి. అలాగే ఫర్నిచర్, పరికరాలు, స్టేషనరి, స్టోరేజ్ ప్రాంతం, వాటర్ ట్యాంకు, వంటగతి, క్యాంటీన్, వాష్‌రూమ్‌లు, లేబరెటరీలు, లైబ్రరీ వంటి వాటిని శుభ్రంగా ఉంచి క్రిమిరహితం చేయాలి. గదులలోపలికి ధారాళంగా గాలి వచ్చేట్టు చూడాలి.
2. పాఠశాలలు అత్యవసర సంరక్షణ మద్దతు, ప్రతిస్పందన బృందం, సాధారణ మద్దతు బృందాన్ని , సరకుల మద్దతు, పరిశుభ్రతా తనిఖీ బృందం, తదితరాలను ఏర్పాటు చేయాలి. వీరికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం వల్ల సహాయకారిగా ఉంటుంది.
3. పాఠశాలలు కింది అంశాలకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీచేసే మార్గదర్శకాలకు అనుగుణంగా స్వంత ఎస్.ఒ.పిలు తయారు చేసుకోవడానికి ప్రోత్సహించవచ్చు. అయితే వారు భద్రత, భౌతిక, సామాజిక దూరం నిబంధనలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులకు ఈ విషయంలో తగిన సమాచారం ఇచ్చేందుకు నోటీసులు, పోస్టర్లు, సందేశాల ద్వారా ప్రచారం చేపట్టి వారికి ప్రముఖంగా తెలిసేట్టు చూడాలి
4. విద్యార్ధుల సీటింగ్ ఏర్పాటుకు సంబంధించి భౌతిక దూరం, సామాజికదూరం పాటించే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. పాఠశాల ప్రారంభ సమయంలో, తరగతుల ముగింపు సమయంలొ విద్యార్థులు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి. ఫంక్షన్లు, ఈవెంట్‌లను ఏర్పాటుచేయకుండా ఉండాలి.
5.విద్యార్థులు,సిబ్బంది అందరూ పాఠశాలలో ముఖానికి మాస్కు, లేదా ఫేస్ కవర్ తప్పకుండా ధరించే ఉండాలి. ప్రత్యేకించి క్లాసులు జరిగేటపుడు, బృంద కార్యకలాపాలు నిర్వహించేటపుడు , మెస్‌లో తినేటపుడు, లేబరెటరీలో పనిచేసేటపుడు లేదా లైబ్రరీలో చదువుకునేటపుడు మాస్కు తప్పకుండా ధరించిఉండాలి.
6. సామాజిక దూరం, భౌతిక దూరం పాటించడానికి వీలుగా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో మార్కింగ్ ఉండాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విద్యార్థులు పాఠశాలకు హాజరుకావడానికి సంబంధించి తల్లిదండ్రులు లేదా గార్డియన్లనుంచి పిల్లలు పాఠశాలకు రావడానికి ముందే సమ్మతి పత్రం తీసుకోవాలి. తల్లిదండ్రుల అనుమతితో ఇంటివద్దనుంచే చదుకుకోవాలనుకునేందుకు అనుకూలంగా ఉన్నవారిని అలాగే చేసేందుకు అనుమతించాలి
7.విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులు , హాస్టల్ సిబ్బందికి కోవిడ్ -19 సంబంధిత సవాళ్లపై అవగాహన కల్పించాలి.కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖల మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించడంలో వారిపాత్రపై అందరు స్టేక్ హోల్డర్లకు అవగాహన కల్పించాలి.
8. అన్ని తరగతులకు అకడమిక్ క్యాలండర్‌లో మార్పులు , ప్రత్యేకించి బ్రేక్‌లు, పరీక్షల విషయంలో ప్రణాళిక రూపొందించుకోవాలి. విద్యార్థులందరికీ పాఠశాల తెరవగానే సంబంధిత పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండాలి.9. పూర్తికాలపు ఆరోగ్య కార్యకర్త, నర్సు లేదా డాక్టర్, కౌన్సిలర్ విద్యార్థుల భౌతిక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేందుకు ఏర్పాటు ఉండాలి. విద్యార్థులు, టీచర్లకు సంబంధించి రెగ్యులర్ గా ఆరోగ్య పరీక్షలు నిర్వహింప చేయాలి.10. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయల ఆరోగ్యవివరాలను ఎప్పటికప్పుడు సేకరించాలి. జిల్లా పాలనా యంత్రాంగం నుంచి రాష్ట్ర, జిల్లా హెల్ప్‌లైన్ నెంబర్లను సేకరించాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సంప్రదించేందుకు సమీప కోవిడ్ కేంద్రం, ఇతర కాంటాక్ట్ సమాచారాన్ని దగ్గర ఉంచుకోవాలి.
11. హాజరులో వెసులుబాటు, అనారోగ్యసంబంధిత సెలవులుకు సంబంధించి న విధానాలను అభివృద్ధి చేసుకుని వాటిని అమలు చేయాలి. విద్యార్థులు, సిబ్బంది అనారోగ్యానికి గురైనపుడు ఇంట్లో ఉండే విధంగా ప్రోత్సహించాలి.
12. కోవిడ్ -19 అనుమానిత కేసులను గుర్తించినపుడు ప్రొటోకాల్ ప్రకారం చర్యలు ఉండాలి.
13. దివ్యాంగులు, వలస వచ్చినవిద్యార్ధులు, కుటుంబంలో ఎవరైనా కోవిడ్ తోమరణించడం వల్ల కానీ లేదా కోవిడ్ కారణంగా ఆస్పత్రి పాలైన వారి వల్ల నేరుగా ప్రభావితులైన విద్యార్థుల విషయంలో ఆయా విద్యార్ధుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రత్యేక అవసరాల విద్యార్దులకు(సిడబ్ల్యుఎస్ ఎన్) వారి వారి అవసరాల మేరకు సహాయ ఉపకరణాలు అందజేయడం,అభ్యసన అంశాలను అందజేయడం చేయాలి.
14.పిల్లల పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకు , కోవిడ్ సమయంలో వారి రోగనిరోధక శక్తి పెంచేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యార్ధులకు వేడిగా వండిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలిలేదా అందుకు సమానంగా ఆహార భద్రతా అలవెన్సు అర్హులైన పిల్లలకుపాఠశాల మూసివేసిన రోజులలో ,వేసవి సెలవులలో ఇవ్వాలి. ఆహార భద్రత, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం వంటివాటిపై దృష్టి పెట్టాలి.
పార్ట్-2 సామాజిక.భౌతిక దూరం పాటిస్తూ అభ్యసన కొనసాగించడం,విద్యను అందించేందుకు సంబంధించిన వివిధ అంశాలు, టైమ్ టేబుళ్లు, అసెస్‌మెంట్, కరికుల్‌మ్, బోధన వంటి అంశాలకు సంబంధించిన ది. ఇవి సలహా పూర్వకమైనవి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటిని ఉపయోగించుకుని తమ స్వంత మార్గదర్శకాలను తయారు చేసుకోవచ్చు.
1.సంవత్సరం మొత్తానికి అభ్యసన ఫలితాలను బట్టి సమగ్ర ప్రత్యామ్నాయ క్యాలండర్‌ను రూపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు ఏర్పడే పరిస్తితిని బట్టి సంవత్సరం మొత్తానికి అకడమిక్‌క్యాలండర్‌ను తగినవిధంగా సర్దుబాటు చేసుకోవాలి. సంబంధిత విద్యా డైరక్టరేట్ నుంచిఅందే మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర అకడమిక్‌ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ ప్రణాళిక ఎన్.సి.ఇ.ఆర్.టి రూపొందించిన ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలండర్‌కు సంబంధించి న మార్గదర్శకాలను పాటించాలి.
2. పాఠశాలలను తెరిచిన తరువాత పాఠశాలతో విద్యార్ధుల పునఃఅనుసంధానతకు ప్రాధాన్యతనివ్వాలి
3.వీలైనంతవరకు ఐసిటి ని అనుసంధానం చేసేవిధంగా వారి నైపుణ్యాలను మెరుగుపరచాలి. ఇందుకు శిక్షణ మాడ్యూళ్లను రూపొందించాలి.
4. కోవిడ్ మహమ్మారి గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. ,భాష, సైన్సు, సోషల్‌సైన్సెస్,ఆర్ట్స్ బోధన సందర్భంగా వారికి దీని గురించి తెలియజెప్పాలి.
5.పాఠ్యాంశాల ప్రణాళిక గురించి , నేర్చుకునే పద్ధతి గురించి విద్యార్ధులకు టీచర్లు తెలియజెప్పాలి.
6. ఇళ్లు లేనివారు , వలసవచ్చిన పిల్లలు, దివ్యాంగులైన వారు కుటుంబంలో కోవిడ్ -19 కారణంగా మరణించిన లేదా ఆస్పత్రి పాలైన వారి వల్ల నేరుగా ప్రభావం పడిన పిల్లల అవసరాలను ప్రాధాన్యత కింద చూడాలి.
7. సామాజిక దూరం పాటించడం, ఇతర భద్రతా ప్రమాణాలను పాటించడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని భిన్నరకాల బోధన వనరులను ఉపయోగించుకోవాలి. పీర్ టీచింగ్, అభ్యసన, వర్కుబుక్‌ల వినియోగం, వర్క్‌షీట్లవినియోగం, టెక్నాలజీ ఆధారిత వనరులు తరగతిగదిలో వాడడం, తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దవారు, పెద్దపిల్లల చేత చెప్పించడం, కమ్యూనిటీలోని వలంటీర్ల సేవలు వినియోగించుకోవడం వంటివి చేయాలి.
8.డిజిటల్, ఆన్‌లైన్ విద్యపై ప్రగ్యతా మార్గదర్శకాలను ఉపాధ్యాయులు,విద్యార్ధులకు డిజిటల్ , ఆన్‌లైన్ విద్యపై అవగాహన కల్పించేందుకు వాడవచ్చు., రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు ఆసక్తికరరీతిలో పాఠ్యపుస్తకాలను రూపొందించినట్టయితే వాటిని ఎలా డౌన్‌లోడ్‌చేసుకోవాలో తెలియజేయాలి.
9.టీచర్లు, తల్లిదండ్రులు, పాలనాయంత్రాంగాలు ఫార్మటివ్ అసెస్‌మెంట్‌పై దృష్టిపెట్టాలి. విద్యార్ధులంతా అభ్యసన లక్ష్యాలు చేరుకునేవిధంగా చూడాలి. ఎస్.సి.ఇ.ఆర్.టి, ఎన్.సి.ఇ.ఆర్.టి లమార్గదర్శకాలను ఉపయోగించుకుని తల్లిదండ్రులకు ఫార్మటివ్ అసెస్‌మెంట్‌పై సెన్సిటైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
10లాక్‌డైన్ సమయంలో ఇంటి ఆధారిత స్కూలింగ్ నుంచి ఫార్మల్ స్కూలింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరివర్తన జరిగేలా చూడాలి. పాఠశాలలు సవరించిన స్కూలు క్యాలండర్‌ను , రీడిజైన్‌చేసిన వార్షికపాఠ్యప్రణా|ళిక (ఎసిపి)ని రెమిడియల్ తరగతులును నిర్వహించం, తిరిగి బడికి వంటి కార్యక్రమలతో పాటు ఇతర చర్యలు తీసుకోవాలి.
11. విద్యార్ధుల భావోద్వేగ సంరక్షణకు టీచర్లు, పాఠశాల కౌన్సిలర్, ఆరోగ్యకార్యకర్త సమష్టిగా కలసి కృషి చేయాలి. కోవిడ్ మహమ్మారి సమయంలోను,ఇతర సందర్భాలలోనూ విద్యార్ధులకు , టీచర్లకు, వారి కుటుంబాల వారికి మానసిక ఆరోగ్యం, భావోద్వేగపరమైన అంశాల విషయంలో మద్దతుకు సంబంధించి మనోదర్పణ్ చాలా కార్యకలాపాలను కవర్‌చేస్తుంది.
12. ఈ ఎస్.ఒ.పిలు మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు తమ స్వంత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్లు -ఎస్.ఒ.పిలను పాఠశాలల పునఃప్రారంభించడానికి రూపొందించవచ్చు.. అలాగే సాఠశాలలు తెరవడానికి సురక్షిత సమయం అనుకున్నప్పుడు వివిధ స్టేక్ హోల్డర్లకు అవసరమైనపుడు శిక్షణ ఇవ్వడానికి వాటిని ఉపయోగించవచ్చు.
13.సురక్షిత పాఠశాల వాతావరణానికి సంబంధించిన తనిఖీ జాబితాలో వివిధ స్టేక్‌హోల్డర్లకు ఉ పయోగించేవి,అకడమిక్‌ప్లానింగ్, స్కూలు కార్యకలాపాలు వంటి వాటిని ఉండేట్టు చూడవచ్చు
14. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యావిభాగాలు డైట్ ఫాకల్టీ సభ్యులు, పాఠశాల అధిపతులు,టీచర్లు, తల్లిదండ్రులకు సామర్ధ్యాల నిర్మాణానికి సంబంధించి అవగాహనా కార్యక్రమాలను పాఠశాలల పునఃప్రారంభానికి ముందు నిర్వహించవచ్చు.
***
(Release ID: 1662244)
Visitor Counter : 265