ఆయుష్

పుణెలో గిరిజన ఆరోగ్య సంరక్షణకు ప్రకృతి వైద్యం ప్రాజెక్టును ప్రారంభించనున్న ఆయుష్ మంత్రి

प्रविष्टि तिथि: 01 OCT 2020 5:54PM by PIB Hyderabad

గాంధీజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి (ఇన్ చార్జి) శ్రీ శ్రీపాద్ యశో నాయక్ రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మహారాష్ట్రలోని పుణె సమీపంలో గోహె బద్రుక్  గిరిజన ఆవాస ప్రాంతంలో ప్రకృతి చికిత్సాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ ఆస్పత్రి గిరిజన తెగలకు చెందిన రోగులకు ప్రకృతి చికిత్స, యోగా చికిత్సా కేంద్రంగా వ్యవహరిస్తుంది. అలాగే గిరిజనుల్లోని వైద్య అలవాట్లకు ప్రకృతి చికిత్స, యోగా నైపుణ్యాలు కూడా జోడించే శిక్షణ కేంద్రంగా కూడా పని చేస్తుంది. అలాగే గిరిజనుల్లోని వైద్య చికిత్సా అలవాట్లపై అధ్యయనం నిర్వహించి వాటి ఆధారంగా శ్వాసకోశ వ్యాధులకు చికిత్సా విధానాలు అభివృద్ధి చేస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వ గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కెసి పడావి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ ప్రాంతంలోని గిరిజన పాఠశాల (ఆశ్రమ) ప్రాంగణాన్ని యోగా, ప్రకృతి చికిత్సాలయంగా మార్చేందుకు వీలుగా దాన్ని అప్పగించేందుకు పూణె ప్రాంతంలోని గోడెగాం సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టు... ప్రాజెక్ట్ అధికారికి, ఎన్ఐఎన్ డైరెక్టర్ కు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఫలితంగా ఈ ఆరోగ్య కేంద్రం ఏర్పాటవుతోంది. ఈ ప్రాంతంలోని గిరిజన తెగలకు చెందిన రోగులకు ప్రకృతి చికిత్స, యోగా చికిత్స అందించడం, వారిలోని రోగనిరోధక శక్తికి సంబంధించిన లోపాన్ని సరిదిద్దడం ఈ ప్రాజెక్టు ప్రత్యేక లక్షణం. ఈ ప్రకృతి చికిత్స, యోగా ఆస్పత్రి, శిక్షణ కేంద్రం యావత్ దేశానికే ఒక నమూనాగా నిలుస్తుంది.

గోహె బద్రుక్ ప్రకృతి చికిత్సాలయం 20 పడకలు కలిగి ఉండి అటు ఔట్ పేషెంట్లు, ఇటు ఇన్ పేషెంట్లకు వైద్య సేవలందించగల సామర్థ్యాలు కలిగి ఉంది. ఇందులో చక్కని వసతులున్న యోగా హాలు, ప్రకృతి ఆహార కేంద్రం, పలు ప్రకృతి చికిత్సలు ఉన్నాయి. 

ఈ కేంద్రం స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని స్థానిక ప్రజల పోషకాహార అవసరాలు తీర్చడంపై దృష్టి సారించడంతో పాటు ప్రకృతి చికిత్సల ద్వారా స్థిరమైన ఆరోగ్య సంరక్షణ మోడల్ అనుసరిస్తుంది. అలాగే స్థానిక గిరిజన ప్రజలకు దీర్ఘకాలం పాటు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా ఈ కేంద్రం తేలికపాటి ప్రకృతి చికిత్సలపై గిరిజన సోదరసోదరీమణులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా కూడా వ్యవహరిస్తుంది. అలాగే గిరిజనులకు నానాటికీ పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా  ప్రకృతి చికిత్స, యోగా, వెల్ నెస్, స్పా విభాగాల్లో స్వయం ఉపాధి అవకాశాలతో సాధికారం చేస్తుంది.  
 

***


(रिलीज़ आईडी: 1660931) आगंतुक पटल : 181
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese