నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2020 5:23PM by PIB Hyderabad
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ తన 20 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 2020 అక్టోబర్ 01 న జరుపుకుంది. ఈ సందర్భంగా ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ త్రివిధ దళాలకు చెందిన వారికి , వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. హెడ్‌క్వార్టర్ ఐడిఎస్ ను 2001 అక్టోబర్ 01న ఏర్పాటుచేశారు. సైనిక దళాలలో సంయుక్తత, సమన్వయాన్ని ప్రోత్సహించేందుకు , రక్షణ రంగానికి చెందిన విభాగాలు, మంత్రిత్వశాఖలతో మరింత మెరుగైన సమన్వయానికి హెడ్‌క్వార్టర్స్ ఐడిఎస్ గత 19 సంవత్సరాలుగా అద్భుత కృషి చేస్తోంది. దేశ భద్రత, సైనిక దళాల ఆధునీకరణ, సంయుక్తత, సైనిక దౌత్యం, వంటి కీలక రంగాలలో జాతీయలక్ష్యాలను ప్రోత్సహించేందుకు ఇది కృషిచేస్తోంది.
మిలటరీ వ్యవహారాల విభాగాన్ని(డిఎంఎ) ఏర్పాటుచేయడం,ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) పదవిని సృష్టించడం వల్ల సాయుధదళాల పరివర్తనాత్మకమార్పునకు,దేశంలోని ఉన్నత స్థాయి రక్షణ సంస్థల సమీకృత కార్యకలాపాలకు మైలురాయిగా నిలిచాయి. సమష్టితత్వంతో విజయం నినాదాన్ని సాకారం చేసేందుకు త్రివిధ దళాలలో మరింత సమష్టి తత్వాన్ని పెంచేందుకు హెడ్ క్వార్టర్ ఐడిఎస్ పలు చర్యలు తీసుకుని ముందుంటున్నది.
***