రక్షణ మంత్రిత్వ శాఖ
మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన మేజర్ జనరల్ సోనాలి ఘోషల్
Posted On:
01 OCT 2020 5:22PM by PIB Hyderabad
మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా మేజర్ జనరల్ సోనాలి ఘోషల్ అక్టోబరు 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. మేజర్ జనరల్ జాయిస్ గ్లాడిస్ రోచ్ 30 సెప్టెంబర్, 2020న తన పదవీ విరమణ పొందారు. గ్లాడిస్ రోచ్ స్థానంలో సోనాలి ఘోషల్ బాధ్యతలు స్వీకరించారు. ఘోషల్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత సైన్యంలో పని చేసిన తరువాత ఈ పదవి చేపట్టారు. మేజర్ జనరల్ సోనాలి ఘోషల్ 1981లో నియమితులయ్యారు. స్కూల్ ఆఫ్ నర్సింగ్, ముంబయి ఇండియన్ నావల్ హాస్పిటల్ షిప్ అశ్విని పూర్వ విద్యార్థి. ప్రస్తుత పదవి బాధ్యతలు స్వీకరించడానికి ముందు మేజర్ జనరల్ ఢిల్లీ కాంట్లోని ఆర్మీ హాస్పిటల్, రీసెర్చ్ మరియు రెఫరల్‌కు ప్రిన్సిపాల్ మాట్రాన్‌గా వ్యవహరించారు. మిలిటరీ నర్సింగ్ సేవల రంగంలో దాదాపు 38 సంవత్సరాల సేవతో పాటుగా ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు ఆపరేషన్ సద్భావన సమయంలో గాయపడిన సైనికులకు సేవ చేసిన ఘనత ఆమె సొంతం. ఆమె చేసిన గొప్ప మరియు విశిష్ట సేవకు గుర్తింపుగా 2014 సంవత్సరంలో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ కంమాడేషన్ కార్డు అవార్డు ఆమెకు లభించింది. తాజాగా బాధ్యతల స్వీకరణ తరువాత మేజర్ జనరల్ సోనాలి ఘోషల్ మాట్లాడుతూ “నర్సింగ్‌లో తొలినాళ్ల నుండే నర్సింగ్ ఎక్సలెన్స్ అన్వేషణే నా ప్రధాన విలువ. నర్సింగ్ వృత్తి దాని స్వచ్ఛమైన సేవ, మానవజాతి పట్ల నిబద్ధత మరియు అంకితభావం ద్వారా సమర్థించబడుతుందని నేను నమ్ముతున్నాను ” అని అన్నారు.
***
(Release ID: 1660857)
Visitor Counter : 137