రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

మంచి సమారిటన్ రక్షణకు నిబంధనల జారీ

Posted On: 01 OCT 2020 12:10PM by PIB Hyderabad

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబర్ 29 తేదీన సమారిటన్ల రక్షణ కోసం నియమాలను ప్రచురించింది. మంచి సమారిటన్ హక్కుల కోసం నిబంధనలు అందిస్తున్నాయి, ఇందులో వారి హక్కులు ఉన్నాయి. మతం, జాతీయత, కులం, లింగ ప్రాతిపదికన ఎటువంటి వివక్ష లేకుండా గౌరవంగా వ్యవహరించాలి. ఒక మంచి సమారిటన్ తన పేరు, గుర్తింపు, చిరునామా లేదా అలాంటి ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించమని ఏ పోలీసు అధికారి లేదా మరే వ్యక్తి బలవంతం చేయరు. అతని ఇష్ట ప్రకారం వెల్లడించవచ్చు. ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రి హిందీ, ఇంగ్లీష్ మరియు మాతృభాషలో, ప్రవేశద్వారం లేదా ఇతర స్పష్టమైన ప్రదేశంలో మరియు వారి వెబ్‌సైట్‌లో, చట్టం పరిథిలో సమారిటన్ల హక్కులను మరియు దానిపై చేసిన నిబంధనలను పేర్కొంటారు. అంతేకాకుండా, ఒక వ్యక్తి మంచి సమారిటన్ గా వ్యవహరించిన కేసులో సాక్షిగా మారడానికి స్వచ్ఛందంగా అంగీకరించినట్లయితే, అతన్ని ఈ నియమం యొక్క నిబంధనలకు అనుగుణంగా పరిశీలించాలి, దీని కోసం వివరణాత్మక మార్గదర్శకాలు మరియు ప్రక్రియ నిబంధనలలో పొందుపరిచారు .

మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019, కొత్త సెక్షన్ 134 ఎ లో "మంచి సమారిటన్ల రక్షణ" ను చేర్చడం గమనించదగ్గ అంశం. ఇది ఒక మంచి సమారిటన్ మోటారు వాహనం వల్ల  ప్రమాదానికి గురైనవారికి ఏదైనా గాయం లేదా మరణానికి సివిల్ లేదా క్రిమినల్ చర్యలకు ఆయనకు బాధ్యత ఉండదు. 

***



(Release ID: 1660592) Visitor Counter : 170