రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

రసాయన రంగానికి భారీ అభివృద్ధి సామర్థ్యముంది: శ్రీ గౌడ

Posted On: 29 SEP 2020 5:40PM by PIB Hyderabad

స్వదేశీ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిన తరుణంలో, భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి తరుణమని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ చెప్పారు.

    కేంద్ర రసాయనాలు&పెట్రో కెమికల్స్‌ విభాగం, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన "ప్రత్యేక రసాయనాలు‌" వెబినార్‌లో శ్రీ గౌడ మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి 17-19 తేదీల్లో నిర్వహించనున్న "ఇండియా కెమ్‌ 2021" కార్యక్రమాన్ని మంత్రి అధికారికంగా ప్రారంభించారు.

    అభివృద్ధికి అస్కారమున్న రంగాల్లో "ప్రత్యేక రసాయనాలు‌" రంగం ఒకటని శ్రీ సదానంద గౌడ వివరించారు. యూరప్‌, ఉత్తర అమెరికా నుంచి ఆసియా వరకు; రసాయనాల రంగంలో, ముఖ్యంగా ప్రత్యేకమైన రసాయనాల విషయంలో గత 20 ఏళ్లలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. 2025 నాటికి ప్రముఖ పాత్రను పోషించగల సత్తా భారతీయ రసాయనాలు‌, పెట్రో కెమికల్స్‌ రంగానికి ఉందన్నారు. జీడీపీలో ప్రస్తుతం ఆ రంగానికి ఉన్న 160 బిలియన్‌ డాలర్ల వాటా, 2025 నాటికి 300 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని చెప్పారు.

    ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల ద్వారా తయారీదారులకు వెన్నుదన్నుగా నిలవడానికి, కొత్తగా రాబోయే మూడు భారీ ఔషధ పార్కుల్లో ఔషధ ఉత్పత్తి విలువ గొలుసును ఏర్పాటు చేయడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారత్‌ దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రి వెబినార్‌లో వివరించారు.

***



(Release ID: 1660188) Visitor Counter : 133