రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల రంగంలో వ్యాపారం సులభతరం చేయడానికి పరిశ్రమల సంస్థ సీఈఏఐ నుండి సూచనలు స్వీకరిస్తున్న ఎన్‌హెచ్ఏఐ
Posted On:
29 SEP 2020 6:35PM by PIB Hyderabad
వ్యాపారం చేయడాన్ని మరింత సౌలభ్య పరిచి మెరుగుపరచడానికి, పరిశ్రమ సంస్థ కన్సెల్టింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఈఏఐ) చేసిన చాలా సూచనలకు ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించింది. ఓమ్నిబస్ బ్యాంక్ గ్యారెంటీ, కన్సెల్టెంట్ల పనితీరు పారామితులు, డీపీఆర్ ఆమోదం, విలువ ఇంజినీరింగ్, సాంకేతిక సామర్థ్య కేటాయింపులు, బిడ్ల మూల్యాంకనం వంటి ఆయా విభాగాలకు సంబంధించి సూచనల్ని సీఈఏఐ సమర్పించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ నివేదించింది.
పరిశ్రమ సంస్థతో వివరణాత్మక చర్చలు జరిపిన తరువాత, వారు చేసిన చాలా సూచనలకు ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించింది. ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ పరిధి వెలుపల ఉన్న సూచనలను సంబంధిత ప్రాధికారిక విభాగాల పరిశీలనకు పంపబడ్డాయి.
అంతేకాకుండా, కన్సెల్టెంట్ తో సజావుగా పనిచేయడానికి అన్ని మంచి సూచనలు భవిష్యత్తులో కూడా సానుకూలంగా పరిగణించబడతాయని ఎన్‌హెచ్ఏఐ పరిశ్రమ వర్గాల వారికి హామీ ఇచ్చింది.
ఎన్‌హెచ్ఏఐ అంగీకరించిన కొన్ని ముఖ్య సూచనలు ఈ కిందన ప్రముఖంగా పేర్కొనబడ్డాయి:
- ఓమ్నిబస్ బ్యాంక్ గ్యారెంటీ వ్యవస్థకు సంబంధించి సూచనలను ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించింది మరియు ఈ విషయంపై మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
- వినూత్న సాంకేతిక పరిజ్ఞానం / సామగ్రిని ఉపయోగించడం గురించి సూచనలు అంగీకరించబడ్డాయి. డీపీఆర్‌లను తయారుచేసేటప్పుడు కొత్త టెక్నాలజీలను ప్రతిపాదించాలని ఎన్‌హెచ్‌ఏఐ కన్సల్టెంట్ను కోరింది మరియు వ్యర్థ వ్యయ వస్తువులను నివారించాలని కోరింది.
- డీపీఆర్ యొక్క వివిధ దశల ఆమోదం ప్రక్రియ వేగవంతం చేయనున్నట్టుగా ఎన్‌హెచ్ఏఐ హామీ ఇచ్చింది.
- కన్సెల్టెంట్ సకాలంలో చెల్లింపులను నిర్ధారించడానికి ఎన్‌హెచ్ఏఐ తన వంతు నిబద్ధతను పునరుద్ఘాటించింది.
-సాంకేతిక సామర్థ్య నిబంధనల కింద కన్సెల్టెంట్‌కు ఇవ్వబడిన ప్రాజెక్టుల సంఖ్యపై క్యాప్‌ను కన్సెల్టెంట్ పనితీరుతో అనుసంధానించబడుతుంది. దీనిని వెండార్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ సిస్టమ్ రేటింగ్‌కు అనుసంధానించనున్నారు. వ్యాపారం యొక్క సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి దాని వాటాదారులందరితో మెరుగైన పని సంబంధాన్ని సులభతరం చేయడానికి కట్టుబడి ఉన్నట్టుగా ఎన్‌హెచ్ఏఐ నివేదించింది.
***
(Release ID: 1660181)
Visitor Counter : 128