సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ద్వారా పిఎం కేర్స్‌ఫండ్‌కు రూ 2.11 కోట్లు విరాళంగా ఇచ్చిన భార‌త్ వికాస్ ప‌రిష‌త్‌

Posted On: 28 SEP 2020 5:50PM by PIB Hyderabad

ఈశాన్య‌రాష్ట్రాల అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర‌) , ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం, సిబ్బంది  వ్య‌వ‌హారాలు ,ప్ర‌జా ఫిర్యాదులు, పెన్ష‌న్లు, అణుఇంధ‌నం,అంత‌రిక్ష శాఖ‌ల స‌హాయ‌మంత్రి  డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ద్వారా భార‌త్ వికాస్ ప‌రిష‌త్ (బివిపి) లాభాపేక్ష‌ర‌హిత సామాజిక సంస్థ రూ.2.11 కోట్ల రూపాయ‌ల‌ను పి.ఎం.కేర్స్ ఫండ్‌కు అంద‌జేసింది.
బివిపి అందించిన విరాళానికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ  డాక్ట‌ర్ జితేంద్ర‌,ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీపై  ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం, విశ్వాసం, విశ్వ‌స‌నీయ‌త ఉన్నాయ‌ని అందువ‌ల్లే ఎప్పుడు ,ఏ ప‌నికోసం పిలుపునిచ్చినా  వెంట‌నే అది ఒక మ‌హా  ఉద్య‌మంగా మారిపోతుంద‌ని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి స్వ‌చ్ఛ‌భార‌త్‌కు , టాయిలెట్ల నిర్మాణానికి లేదా గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకోవ‌ల‌సిందిగా లేదా స‌త్వ‌ర‌ లాక్‌డౌన్‌,కోవిడ్ కు సంబంధించి న మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చిన‌పుడు మనం దీనిని గ‌మ‌నించాం.



పిఎం కేర్స్ ఫండ్ పేరుతో ప్ర‌త్యేకంగా ఒక ఫండ్‌ను ఏర్పాటు
ప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక‌త‌,ముందుచూపు ప్రేర‌ణ‌తో ప్ర‌త్యేకంగా పిఎం కేర్స్ ఫండ్ ఏర్పాటైంద‌ని డాక్ట‌ర్‌జితేంద్ర సింగ్ ప్ర‌శంసించారు.స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఈ ఫండ్‌కు స్పంద‌న పెద్ద ఎత్తున వ‌చ్చింద‌ని, దాత‌లు,పెద్ద పెద్ద వ్యాపార సంస్థ‌లు ముందుకువ‌చ్చి  త‌మ విరాళాలు అంద‌జేశాయ‌ని, మరోవైపు చిన్న పిల్ల‌లు కూడా త‌మ పాకెట్ మ‌నీ నుంచి దాచుకున్న మొత్తాన్ని విరాళంగా ఇచ్చార‌ని చెప్పారు.
 సామాజిక సంస్థ‌గా భార‌త్ వికాస్ ప‌రిష‌త్ గ‌త ఆరు ద‌శాబ్దాలుగా చిత్త‌శుద్ధ‌ఙ‌తో సేవ‌లు అందిస్తున్న‌ట్టు చెప్పారు. ఎప్పుడు సంక్షోభం ఏర్ప‌డినా, వ‌ర‌ద‌లు లేదా క‌ర‌వు, లేదా యుద్ధం వంటి స‌మ‌యంలో  లేదా ప్ర‌కృతి విప‌త్తు వంటి స‌మ‌యంలో  భార‌త్ వికాస్ ప‌రిష‌త్ స‌మాజానికి సేవ చేసేందుకు ముందుంటూ వస్తోంద‌ని ఆయ‌న అన్నారు.


కోవిడ్ మ‌హ‌మ్మార స‌మ‌యంలో భార‌త్ వికాస్ ప‌రిష‌త్ దేశ‌వ్యాప్తంగా ఉచిత రేష‌న్,శానిటైజ‌ర్‌లు,మాస్కులు,మందులు అవ‌స‌ర‌మైన వారికి పంపిణీచేసే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టడం ప‌ట్ల డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ఆ సంస్థను అభినందించారు. భారత్ వికాస్‌ప‌రిష‌త్ పిఎం కేర్స్ నిధికి అందించిన విరాళం కూడా సంక్లిష్ట స‌మ‌యంలో మ‌ద్ద‌తు, స‌హాయం త‌ప్ప‌కుండా అవ‌స‌ర‌మైన వ‌ర్గాల‌కు సాయ‌ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.
భార‌త్ వికాస్ ప‌రిష‌త్ ప్ర‌తినిధివ‌ర్గంలో  ఆ సంస్థ జాతీయ అధ్య‌క్షుడు గ‌జేంద‌ర్ సింగ్ సంధు, జాతీయ ఉపాధ్య‌క్షుడు మ‌హేష్‌బాబు గుప్త‌,ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి (ఆర్గ‌నైజింగ్‌) సురేష్‌జైన్‌,నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శ్యామ్ శర్మ‌,జాతీయ‌కోశాధికారిసంప‌త్ ఖుర్దియా,జాతీయ కోఆర్డినేట‌ర్ అజ‌య్ ద‌త్త ఇత‌రులు ఉన్నారు.

***

 



(Release ID: 1659963) Visitor Counter : 161