రక్షణ మంత్రిత్వ శాఖ
రూ.2,290 కోట్ల విలువైన ఆయుధాలు, పరికరాల సముపార్జనకు అనుమతి మంజూరు చేసిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ
Posted On:
28 SEP 2020 4:25PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం ఈ రోజు జరిగింది. ఇందులో భారత సాయుధ దళాలకు అవసరమైన వివిధ ఆయుధాలు మరియు పరికరాలకు సంబంధించి రూ.2,290 కోట్ల మేర విలువైన మూలధనం కొనుగోలు ప్రతిపాదనల్ని డీఏసీ ఆమోదించింది. దేశీయ పరిశ్రమతో పాటు విదేశీ అమ్మకందారుల నుంచి సేకరణలూ ఇందులో ఉన్నాయి. బయ్ ఇండియన్(ఐడీడీఎం) కేటగిరీ కింద, స్టాటిక్ హెచ్‌ఎఫ్ టాన్స్-రిసీవర్ సెట్లతో పాటు స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్(ఎస్ఏఏడబ్ల్యూ) వంటి వాటి కొనుగోళ్లకు డీఏసీ ఆమోదం తెలిపింది. హెచ్ఎఫ్ రేడియో సెట్లు ఆర్మీ మరియు వైమానిక దళం యొక్క ఫీల్డ్ యూనిట్లకు మధ్య నిరంతరాయపు తగిన కమ్యూనికేషన్‌ను అనుమతిస్తుంది. దాదాపు రూ.540 కోట్ల నిధులతో ఈ రేడియో సెట్లను సమీకరించనున్నారు. స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ (ఎస్ఏఏడబ్ల్యూ)
వ్యవస్థ నెవీ, ఎయిర్‌ఫోర్స్ దళాల ఫైరింగ్ శక్తిని మరింత పెంచనుంది. సుమారు
రూ.970 కోట్ల వ్యయంతో వీటిని సమీకరించనున్నారు. దీనికి తోడు ఆర్మీ యొక్క ఫ్రంట్‌లైన్ దళాల్ని మరింతగా సన్నద్ధం చేయడానికి ఎస్ఐజీ ఎస్ఏయుఈఆర్
అస్సాల్ట్ రైఫిల్స్‌ను దాదాపుగా రూ.780 కోట్లతో కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది.
***
(Release ID: 1659924)
Visitor Counter : 223