ప్రధాన మంత్రి కార్యాలయం

‘మన్ కీ బాత్’ రెండోవిడత 16వ సంచికలో భాగంగా 27.09.2020న ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 27 SEP 2020 11:50AM by PIB Hyderabad

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచమంతా అనేక మార్పులకు లోనవుతోంది. ఈరోజుల్లో రెండు గజాల దూరం తప్పనిసరి అయింది.  అయితే ఈ కాలమే కుటుంబ సభ్యులందరిని ఒకటిగా కలిపే, దగ్గరకు చేర్చే పని కూడా  చేసింది.  కానీ ఇంత  ఎక్కువ కాలం   ఎలా కలిసి ఉండడం, సమయం ఎలా వెచ్చించాలి? ప్రతి నిమిషం సంతోషంగా ఎలా ఉండాలి ? ఐతే, చాలా కుటుంబాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దానికి   కారణం  ఏమిటంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు కొన్ని కుటుంబాల్లో లోపించడమే.  మన సంస్కృతీ సాంప్రదాయాలలో గొప్ప విషయం ఏముంది?  ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు పెద్దవారు కథలు చెప్పేవారు.  ఇంట్లో కొత్త ప్రేరణ, కొత్త ఆశలు నింపేవారు. మనకు తప్పకుండ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మన పూర్వీకులు ఏర్పాటు  చేసిన పద్ధతులు నేడు కూడా ఎంత గొప్పగా ఉన్నాయనే విషయం మనకు అవగాహన అయి ఉంటుంది.  ఇలాంటిదే ఒక విధానం కథలు చెప్పడం. మిత్రులారా! కథల చరిత్ర మానవ నాగరికత అంత పురాతనమైంది.

 జీవం ఉన్నచోట కథ తప్పకుండా ఉంటుంది.         

  కథలు ప్రజల సృజనాత్మక, సంవేదనశీలతను ప్రకటిస్తాయి.  కథ శక్తిని తెలుసుకోవాలంటే  తల్లి తన చిన్న పిల్లవాడి ని నిద్ర పుచ్చడానికో  లేదా అన్నం  తినిపించడానికో చెప్పే కథ చూడండి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. దేశాటనయే   నా జీవితంగా గడిపాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు, కొత్త కుటుంబాలు.  కానీ నేను కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు   పిల్లలతో  తప్పకుండ మాట్లాడేవాడిని. అపుడపుడు పిల్లలతో అనేవాడిని..  పిల్లలూ... నాకు  ఏదైనా కథ చెప్పండి అని. నేను ఆశర్యపోయేవాడిని.  పిల్లలు నాతో అనేవారు మేం జోకులు చెప్తాం. మీరు కూడా జోకులే చెప్పండి అని. , అంకుల్.. మీరు మాకు జోకులు చెప్పండి అనేవారు.  అంటే వారికి కథలతో అసలు పరిచయమే లేదు. చాలావరకు వారి జీవితం జోకులతో గడిచిపోయింది.    

మిత్రులారా! భారతదేశంలో  కథలది, కథల వృత్తాంతాలది  ఒక పెద్ద  పరంపర.  హితోపదేశం,  పంచతంత్రల పరంపర ఉన్న దేశం మనదైనందుకు మనకు గర్వంగా ఉండాలి. ఇక్కడి కథల్లో పశు పక్షుల,  దేవకన్యల కాల్పనిక ప్రపంచం ఉంది. వివేకం,  బుద్ధిమంతుల మాటలు అలవోకగా అర్థం అయ్యేందుకు వీలుగా ఈ కథలున్నాయి.  మన దగ్గర కథల పరంపర ఉంది. ధార్మిక కథలు చెప్పే ప్రాచీన పద్ధతి ఉంది.

ఇందులో కథా కాలక్షేపం కూడా ఉంది. మన దగ్గర వివిధ రకాల కథలు ప్రచారం లో ఉన్నాయి.  తమిళనాడు,  కేరళ రాష్ట్రాలలో కథలు చెప్పే చాలా విశేషమైన పద్ధతి ఉంది. దీన్ని 'విల్లు పాటు ' అని అంటారు.  ఇందులో కథ,  సంగీతం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.  భారత దేశములో తోలు బొమ్మలాట కూడా ఉంది.   రోజులలో Science,   science fiction లతో   కలగలిపిన కథలు,  కథా కథన పద్ధతి ఆకర్షణీయంగా ఉంటాయి.  నేను చూశాను.. చాలా మంది ప్రజలు వృతాంతముల కథను ముందుకు తీసుకురావడానికి ప్రశంసనీయ ప్రయత్నం చేస్తున్నారు. నాకు  gaathastory.in లాంటి website గురించి తెలిసింది. దీన్ని   అమర్ వ్యాస్  మిగతావారితో కలిసి నిర్వహిస్తున్నారు. అమర్ వ్యాస్ IIM, అహ్మదాబాద్  నుండి MBA పట్టభద్రులైన తరువాత విదేశాలకు వెళ్లారు. తిరిగి వచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటున్నారు. సమయం కల్పించుకుని కథలతో విధమైన అద్భుతమైన పనులు చేస్తున్నారు. అక్కడక్కడా ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గ్రామీణ భారత కథలను కూడా చాలా  బాగా ప్రచారం చేస్తున్నారు. వైశాలి వ్యవహరి దేశ్ పాండే లాంటి చాలా మంది దీన్ని మరాఠీ భాషలో కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారు.  

చెన్నైకి చెందిన శ్రీ విద్యా  వీర్ రాఘవన్ కూడా మన సంస్కృతితో కూడుకొన్న  కథలను ప్రచారము, ప్రసారము చేయుటలో నిమగ్నమయ్యారు. అక్కడే కథాలయం,  The Indian story telling network అనే పేర్లతో రెండు  websiteలు  కూడా రంగంలో గొప్ప పని చేస్తున్నాయి. గీత రామానుజంగారు Kathalaya.orgనందు కథలను ఉంచారు. అందులో sThe Indian story telling network ద్వారా పట్టణాలలో Story tellers   network తయారు చేయబడుచున్నది. బెంగుళూరులో శ్రీధర్ అనే ఆయన బాపూగారి కథలతో  ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా చాలా మంది ఈ రంగంలో కృషి చేస్తున్నారు. మీరు తప్పకుండా వారి గూర్చి  social media ద్వారా తెలియచేయండి. .

నేడు మనతో బెంగళూరు Story telling society కి సంబంధించిన Aparna Athreya,  ఇతర సభ్యులు ఉన్నారు. రండి. వారితో మాట్లాడుదాం. వారి అనుభవాలు తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి .  హలో

 Aparna :  నమస్కారం పూజ్య ప్రధాన మంత్రిగారూ..  

ప్రధాన మంత్రి:  నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు అపర్ణ గారూ

 Aparna:    చాలా  బాగున్నాను సార్  అన్నిటి కన్నా ముందు నేను Bengaluru story telling societyతరపున ధన్యవాదములు తెలపాలనుకుంటున్నాను.  మీరు మా లాంటి కళాకారులను స్టేజి పైకి పిలిచి, మాట్లాడుతున్నారు.  

ప్రధాన మంత్రి:  ఈరోజు మీ టీం మొత్తం మీతో కూర్చున్నారు

 Aparna:    అవును సర్ .  

ప్రధాన మంత్రి:   అయితే మీ టీం సభ్యులను పరిచయం చేస్తే బావుంటుంది. 'మన్   కి బాత్ 'శ్రోతలకు వారి పరిచయం జరగాలి.   వారికీ తెలియాలి మీరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారో.

 Aparna:    సార్.. నా పేరు అపర్ణ ఆత్రేయ. నేను ఇద్దరు పిల్లల తల్లిని. ఓక భారతీయ వాయుసేన ఆఫీసర్ భార్యను.   ఒక Passionate story teller ని  సార్.    story telling ను 15 సంవత్సరాలకు పూర్వం  ప్రారంభించాను. అప్పుడు  నేను Software industry లో పనిచేస్తున్నారు. అపుడు నేను CSR Projects లో   Voluntary గ పని చేసేందుకు వెళ్ళాను.  అపుడు వేల   మంది పిల్లలకు కథల మాధ్యమం ద్వారా శిక్షణ ఇచ్చే అవకాశం లభించించి. నేను చెప్తున్న   కథ మా నాయనమ్మ దగ్గర విన్నాను. కానీ కథ చెప్పేటప్పుడు పిల్లలలో చూసిన  ఆనందాన్ని నేను మీకెలా చెప్పాలి.  ఎంతటి చిరునవ్వు ఉందో, ఎంత ఆనందం ఉందో..  అపుడే నేను నిర్ణయించుకొన్నాను.  Story telling నా జీవిత లక్ష్యం అని.

ప్రధాన మంత్రి:    మీ టీంలోఇంకా ఎవరున్నారు అక్కడ

 Aparna:   నాతో పాటు శైలజా  సంపత్ ఉన్నారు

శైలజ:   నమస్కారం సార్

ప్రధాన మంత్రి:    నమస్తే జీ..  

శైలజ:  నేను శైలజ సంపత్ ను  మాట్లాడుతున్నాను. నేను మొదట   ఉపాధ్యాయురాలిగా  పని చేశాను.   తరువాత నా పిల్లలు పెద్దవారయ్యాక నేను theatre లో పని ఆరంభించాను. చివరగా కథలను వినిపించడంలో చాల సంతృప్తి కలిగింది.  

ప్రధాన మంత్రి:    ధన్యవాదాలు  

శైలజ:     నాతో పాటు సౌమ్య ఉన్నారు సార్.

సౌమ్య:   నమస్కారం సర్

ప్రధాన మంత్రి :   నమస్తే జి

సౌమ్య : నా పేరు సౌమ్య శ్రీనివాసన్. నేను ఒక psychologist ని.  నేను పని చేసేప్పుడు పిల్లలు, పెద్దలతో కథల ద్వారా ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాను.   తరువాత చర్చిస్తాను కూడా. నా లక్ష్యం Healing and transformative story telling sir.   

 Aparna:   నమస్తే సార్  

ప్రధాన మంత్రి:   నమస్తే జి

 Aparna:   నా పేరు అపర్ణ జయశంకర్. ఇది నా అదృష్టం సార్.  నేను మా  నాయనమ్మ, తాతగారితో కలిసి దేశములోని వేర్వేరు ప్రాంతాలలో పెరిగాయను సార్. అందువల్ల రామాయణం,  పురాణాలు ,  గీత..   కథలు నాకు వారసత్వం గా  ప్రతి రోజు రాత్రి లభించేవి. Bengaluru story telling society లాంటి సంస్థ ఉంది. అయితే నాకు Story teller కావాలని ఉంది. నాతో పాటు నా సహోద్యోగి లావణ్య ప్రసాద్ ఉన్నారు.

ప్రధాన మంత్రి:    లావణ్య జీ..  నమస్తే

లావణ్య:   నమస్తే సార్.  నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. స్టోరీ టెల్లర్ ని కూడా సార్. నేను మా తాతగారి దగ్గర కథలు వింటూ పెరిగాను. సీనియర్ సిటిజన్స్ తో కలిసి పని చేశాను.  రూట్స్ అనే నా  ప్రత్యేక ప్రాజెక్టులో నేను వారి జీవిత కథలను వారి కుటుంబాల కోసం డాక్యుమెంట్ చేసేదానిని.

ప్రధాన మంత్రి:    లావణ్య గారు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.  మీరు అన్నట్టే నేను కూడా ఒకసారిమన్ కి బాత్ లో అందరితో చెప్పాను.  మీరు కుటుంబములో మీ నాయనమ్మ, తాతయ్యలు,  అమ్మమ్మ, తాతయ్యలు ఉంటే   గనక వారితో వారి చిన్ననాటి కథలు అడగండి వాటిని టేపులో   రికార్డు చేసుకోండి. చాలా  పనికి వస్తాయని నేను అన్నాను. నాకు బాగా అనిపించింది. మీ పరిచేయంలో  మీ  Communiation skills చాలా  తక్కువ మాటల్లో చాలా  చక్కగా మీ మీ పరిచయాలు చేశారు.  అందుకొరకు కూడా నేను మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను.

లావణ్య:   ధన్యవాదములు సర్, ధన్యవాదములు

ఇపుడు మన శ్రోతలు ‘మన్ కి బాత్' ద్వారా వారి మనసులో కూడా కథలు వినాలని తహతహలాడుచున్నారేమో.నాది ఒక చిన్న అభ్యర్థన, ఏమిటంటే  ఒకటి రెండు కథలు వినిపించండి మీరు.

సమూహ స్వరం:    అలాగే సర్, ఇది మాకు దక్కిన అదృష్టం.  

పదండి పదండి ఒక రాజుగారి కథ విందాం. రాజు గారి పేరు కృష్ణ దేవరాయలు. రాజ్యముపేరు విజయ నగరం.  మన రాజు  చాలా  గుణవంతుడు. అతని బలహీనత చెప్పాలంటే అది కేవలం అధిక ప్రేమ కలిగి ఉండడం..  తెనాలి రామకృష్ణునితో  రెండవది భోజనంపై .  రాజుగారు ప్రతి రోజు మధ్యాహ్న భోజనం కొరకు ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. ఈరోజు ఏదైనా మంచి వంటకం చేసి ఉంటారు.  ప్రతి రోజు ఆయన వంటవాడు ఆయనకు రుచీ పచీ లేని కూరగాయలు తినిపించేవాడు. బీరకాయ, సొరకాయ. ఇలాగే  ఒక రోజు  రాజుగారు తింటూ తింటూ కోపముతో పళ్లెం విసిరివేసాడు.  తన వంటవాడితో రేపు మంచి  రుచికరమైన కూరగాయ చేయండి.  లేదంటే నేను రేపు నిన్ను ఉరి పై వేలాడదీస్తాను అన్నాడు. వంటవాడు పాపం భయపడిపోయాడు. ఇపుడు కొత్త కూరగాయల కొరకు తాను ఎక్కడికి వెళ్ళాలి. వంటవాడు పరిగెత్తుకొంటూ తెనాలి రామ లింగడి వద్దకు వెళ్ళాడు.  జరుగిందంతా చెప్పాడు. తెనాలి రామలింగడు వంటవాడికి ఒక ఉపాయం చెప్పాడు. మరుసటి రోజు రాజుగారు భోజనానికి వచ్చారు.  వంటవాడిని పిలిచాడు. ఈరోజు ఏదైనా రుచికరమైనది వండావా, లేదంటే నేను ఉరి తయారు చేయాలా అన్నాడు. భయపడిన వంటవాడు పళ్లెం పెట్టాడు.  వేడి వేడి వంటకాలు వడ్డించాడు. పళ్లెంలో కొత్త కూరగాయ ఉంది. రాజుగారు సంతోషించారు.  కొద్దిగా కూరగాయ రుచి చూసారు .ఆహ ఎంత బావుంది. ఏమి కూర. బీరకాయ లాగా చేదుగా లేదు,  సొరకాయలా తీయగా లేదు. వంటవాడు మసాలా వేశాడో, అంతా కూడా మంచిగా కలిసినది. అందుకొరకు రుచి చూడగానే రాజుగారు అడిగారు.   ఇది ఏమి కూర? దీని పేరు ఏమిటి? ఎలాగైతే నేర్చుకున్నాడో అలాగే వంటవాడు  సమాధానమిచ్చాడు. మహా రాజా ఇది కిరీటమున్న  వంకాయ కూర. ప్రభు అచ్చు మీ వలెనె ఇది కూడా కూరగాయలకు రాజు. అందుచేత మిగిలిన కూరగాయల్ని వంకాయకు కిరీటం తొడిగారు అని చెప్పాడు. రాజుగారు సంతోషించారు.  తాను నాటి నుండి కిరీటమున్న  వంకాయని తింటానని ప్రకటించారు. నేనే కాదు , మన రాజ్యములో కూడా, వంకాయ మాత్రమే వండుతారు.   వేరే కూరగాయలు వండరు అన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు.  ప్రారంభములో అందరు ఆనందంగా ఉన్నారు...  ఎందుకంటే వారికీ కొత్త కూరగాయ లభించినది.  కానీ రోజులు గడుస్తూన్న కొద్దీ రుచి కాస్త తగ్గినది. ఒకరింట్లో వంకాయ బిరియాని   వండితే, వంకాయ కూర. ఒకరి దగ్గర వంకాయ సాంబారు ఉంటె ఇంకొకరి వద్ద వంకాయ బాత్. ఒకటే వంకాయ..  పాపం ఎన్ని రూపాలు ధరించాలి . మెల్లి మెల్లిగా రాజుగారు కూడా విసిగిపోయారు. ప్రతి రోజు అదే వంకాయ. రాజుగారు వంటవాడిని పిలిచారు.  బాగా చీవాట్లు పెట్టారు. . నీతో ఎవరు చెప్పారు వంకాయ తల పైన కిరీటం ఉందని అన్నారు. ఈ రాజ్యములో ఇప్పటినుండి  ఎవరు వంకాయ తినరు.. రేపటి నుండి వేరే ఏవైనా కూరగాయలు వండు. వంకాయ మాత్రం  వద్దు అన్నారు. . మీ ఆజ్ఞ ప్రభు అని వంటవాడు నేరుగా తెనాలి రామలింగడి వద్దకు వెళ్ళాడు. తెనాలి రామ లింగడి కళ్ళు మొక్కుతూ అన్నాడు ‘మంత్రి గారు ధన్యవాదాలు .. . మీరు నా ప్రాణం కాపాడారు. మీ ఉపాయం కారణంగా ఇపుడు కూరనైనా రాజుగారికి తినిపించగలం’ అని . తెనాలి రామ లింగడు నవ్వుతూ  అన్నాడు-   ఎవరైనా రాజుగారిని ఎందుకు  సంతోషపెట్టలేదో. ఇదే  విధముగా రాజా  కృష్ణదేవరాయలు మంత్రి తెనాలి రామ లింగడి కథలు తయారవుతూ వచ్చాయి.  ప్రజలు వింటూ వెళ్లారు.

ప్రధాన మంత్రి:  మీ మాటలలో ఇంత ఖచ్చితత్వం ఉంది. ఇంత చిన్న చిన్న విషయాలు మీరు పట్టుకుంటారు.  నేననుకంటాను పిల్లలు,  పెద్దలు మీ మాటలు  వింటే చాలా  విషయాలు గుర్తుంచుకొంటారు.   దేశంలో పోషణ మాసము నడుస్తోంది.  మీ కథ భోజనంతో కూడి ఉంది.

ప్రధాన మంత్రి :    Story tellers గా మీలాగే  ఇంకా చాలా మంది ప్రజలు ఉన్నారు. మన దేశ మహాపురుషుల , మహా మాతృ దేవతలు, సోదరీమణుల కథలు,  కథల ద్వారా వారితో ఎలా మమేకమయ్యారు.. మనం కథాశాస్త్రాన్ని ఇంకా గొప్పగా ఎలా ప్రచారం చేయాలి. ప్రజలలోకి ఎలా పంపించాలి ఆలోచించాలి.   ప్రతి  ఇంటిలో మంచికథలు  చెప్పాలి, మంచి కథలు వినిపించాలి.  ఇవి జన జీవనానికి చాల పెద్ద పేరు తేవాలి. ఈ వాతావరణము ఎలా తయారు చేయాలి. ఈ దిశలో మనమందరం  కలిసి పని చేయాలి. మీతో సంభాషణ నాకు చాలా సంతోషంగా ఉంది..  నేను  మీ అందరికి చాలా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.. . .       

 

సమూహ స్వరం:    ధన్యవాదాలు సార్ ..

కథ ల ద్వారా  ఎక్కువగా సంస్కారాన్ని కలిగించే   కథలను మనం విన్నాం. నేను ఇప్పుడు వారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చాలా పెద్ద సంభాషణ అయింది. నాకు అనిపించింది..  'మన్ కి బాత్' లో వారితో జరిపిన ఈ సంభాషణ ను  నా NarendraModi.App ద్వారా అప్లోడ్ చేయాలని. పూర్తి కథలు వినిపించాలని.  తప్పకుండా యాప్  లో పూర్తి కథలు వినండి. ఇపుడు 'మన్ కి బాత్' లో అందులోని చాలా చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాను. నేను మిమ్మల్ని తప్పకుండా కోరతాను.  కుటుంబంలో ప్రతి వారం మీరు కథల కోసం కొంత కాలం తీసిపెట్టండి. కుటుంబములోని ప్రతి సభ్యుడికి  ప్రతి వారం ఒక కొత్త విషయం ఇవ్వండి.  ఉదాహరణకు కరుణ,  స్పందన,   పరాక్రమం, త్యాగం, శౌర్యం..  .. ఇలా ఏదో ఒక అంశం. కుటుంబం లోని సభ్యులందరూ    వారం  ఒకే విషయంపై కుటుంబమంతా కథలు వెతుకుతారు.  కుటుంబం  లోని సభ్యులందరూ  ఒక్కొక్క కథ చెబుతారు.

మీరు చూడండి, కుటుంబంలో ఎంత పెద్ద కథల సంపద ఏర్పడుతుందో..  పరిశోధనకు ఎంత పెద్ద పని ఉంటుందో!  ప్రతి ఒక్కరికి ఎంత ఆనందమౌతుంది! కుటుంబానికి  ఒక కొత్త చైతన్యం వస్తుంది.  కొత్త ఆశలు చిగురిస్తాయి.   విధంగానే మనం మరో పని కూడా చేయవచ్చు. నేను కథలు వినిపించే అందరిని కోరుతు న్నాను. మనం స్వాతంత్యం వచ్చిన 75  వ సంవత్సరం జరుపుకోబోతున్నాం. మన కథల్లో  ఎన్ని ప్రేరణ  కలిగించే  సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిని కథల ద్వారా ప్రచారమా చేయలేమా?  1857 నుండి 1947 వరకు ప్రతి చిన్న చిన్న   సంఘటన ను ఇపుడు మన కొత్త తరాలకు కథల ద్వారా  పరిచయం చేయించవచ్చు. నాకు నమ్మకముంది. మీరు పనిని తప్పకుండా చేస్తారు. కథలు చెప్పే కళ  దేశంలో ఇంకా బలోపేతం కావాలి. ఎక్కువ  ప్రచారం కావాలి. రండి, మనమంతా దీనికోసం  ప్రయత్నం   చేద్దాం.

 

నా ప్రియమైన దేశవాసులారా! రండి, ఇప్పుడు మనం కథల ప్రపంచం నుండి సప్త సముద్రాలు దాటి వెళ్దాం. ఈ గొంతు వినండి!

నమస్తే, సోదర సోదరీమణులారా!  నా పేరు సేదు  దెంబేలే.    మాది పశ్చిమ ఆఫ్రికాలోని మాలి అనే దేశం. భారతదేశంలో అతిపెద్ద ధార్మిక ఉత్సవమైన కుంభమేళాకు ఫిబ్రవరిలో హాజరయ్యే అవకాశం నాకు లభించింది. ఇది నాకు చాలా గర్వకారణం. కుంభమేళా నాకు చాలా నచ్చింది.  భారతదేశ సంస్కృతిని చూడటం ద్వారా చాలా నేర్చుకున్నాను. మాకు మరోసారి భారతదేశాన్ని సందర్శించే అవకాశం కల్పించాలని నేను కోరుతున్నాను. అ అవకాశం వస్తే భారతదేశం గురించి మరింత తెలుసుకోవచ్చు. నమస్తే.. "

ప్రధానమంత్రి: బాగుంది కదా!  సేదు  దెంబేలే మాలి దేశానికి చెందినవారు.  మాలి భారతదేశానికి దూరంగా పశ్చిమ ఆఫ్రికాలో ఒక దేశం. మాలిలోని కిటాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో !  సేదు  దెంబేలే ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.  ఇంగ్లీష్, సంగీతం,  పెయింటింగ్, చిత్రకళ లను  ఆయన పిల్లలకు నేర్పిస్తారు. అతనికి మరొక గుర్తింపు కూడా ఉంది.  ప్రజలు అతన్ని మాలిలో ‘హిందూస్తాన్ కా బాబు’ అని పిలుస్తారు అల పిలిపించుకోవడం అతనికి చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం, ఆయన మాలిలో ఒక గంటపాటు  రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం పేరు ‘ ఇండియన్ ఫ్రెక్వెన్సీపై బాలీవుడ్ పాటలు’.  గత 23 సంవత్సరాలుగా ఆయన దీన్ని నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమాన్ని ఆయన  ఫ్రెంచ్ భాషతో పాటు మాలి భాషలో తన వ్యాఖ్యానంతో నిర్వహిస్తారు.  నాటకీయంగా వ్యాఖ్యానిస్తారు. ఆయనకు భారతదేశంపై గాఢమైన ప్రేమ ఉంది. భారతదేశంతో  ఆయన లోతైన అనుబంధానికి మరొక కారణం ఏమిటంటే ఆయన ఆగస్టు 15 వ తేదీ నాడు జన్మించారు. సేదు గారు ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు రెండు గంటల పాటు నిర్వహించే మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఇందులో  ఒక బాలీవుడ్ చిత్రం కథను ఫ్రెంచ్, బంబారా భాషలలో చెప్తారు. బారా కథను చెబుతుంది. కొన్నిసార్లు ఏదైనా భావోద్వేగ సన్నివేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏడుస్తారు. ఆయనతో పాటు శ్రోతలు కూడా ఏడుస్తారు. సేదు గారి తండ్రి కూడా ఆయనను  భారతీయ సంస్కృతితో గుర్తించారు. ఆయన తండ్రి సినిమా, థియేటర్ రంగాలలో పనిచేశారు. సేదు కు భారతీయ సినిమాలను ఆయన చూపించేవారు.  ఈ ఆగస్టు 15 నాడు ఒక వీడియో ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రజలను హిందీలో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పిల్లలు భారతదేశ జాతీయ గీతాన్ని సులభంగా పాడతారు. మీరు ఈ రెండు వీడియోలను తప్పక చూడాలి. వారికి  భారతదేశంపై ఉన్న  ప్రేమను అనుభూతి చెందాలి. సేదు గారు కుంభ మేళా ను సందర్శించినప్పుడు నేను కలిసిన ప్రతినిధి బృందంలో ఆయన కూడా ఉన్నారు.   భారతదేశం పట్ల ఆయనకున్న అభిరుచి, ఆప్యాయత, ప్రేమ నిజంగా మనందరికీ గర్వకారణం.

నా ప్రియమైన దేశవాసులారా! భూమికి అనుసంధానించబడినవారు అతిపెద్ద తుఫానులలో కూడా దృఢంగా ఉంటారని ఒక లోకోక్తి. మన వ్యవసాయ రంగంలో ఈ కరోనా క్లిష్ట సమయంలో కూడా పనిచేసే  మన రైతు దీనికి సజీవ ఉదాహరణ. సంక్షోభం ఉన్న ఈ కాలంలో కూడా మన దేశ వ్యవసాయ రంగం మళ్లీ తన శక్తిని చూపించింది. మిత్రులారా!  దేశంలోని వ్యవసాయ రంగం, మన రైతులు, మన గ్రామాలు స్వావలంబన భారతదేశానికి ఆధారం. వారు బలంగా ఉంటే స్వయం సమృద్ధిగల భారతదేశం  పునాది బలంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో దేశంలోని అనేక  ప్రాంతాలు అనేక పరిమితుల నుండి స్వీయ విముక్తి పొందాయి.  అనేక అపోహలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాయి. అలాంటి చాలా మంది రైతుల నుండి నాకు లేఖలు వస్తాయి.  నేను రైతు సంఘాలతో కూడా మాట్లాడుతున్నాను.  కొత్త కోణాల్లో వ్యవసాయం ఎలా జరుగుతోందో, వ్యవసాయం ఎలా మారుతుందో వారితో సంభాషణ ద్వారా తెలుస్తుంది. నేను వారి నుండి, ఇతరుల నుండి విన్న విషయాలను  ఈ రోజు మన్ కి బాత్ లో మీతో తప్పకుండా పంచుకోవాలని ఉంది.  ఆ రైతుల గురించి నేను మీకు కొన్ని విషయాలు తప్పక చెప్పాలి. మన రైతు సోదరులలో ఒకరు హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉండే  కన్వర్ చౌహాన్ గారు. ఆయన  తన పండ్లు, కూరగాయలను మార్కెట్ వెలుపల విక్రయించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పారు.  వారు తమ పండ్లు, కూరగాయలను మార్కెట్ వెలుపల విక్రయిస్తుంటే వారి పండ్లు, కూరగాయలు, బండ్లను చాలాసార్లు జప్తు చేసేవారు. కానీ 2014 లో పండ్లు, కూరగాయలను ఎపిఎంసి చట్టం నుండి మినహాయించారు.  ఇది వారితో పాటు  అనేకమంది తోటి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నాలుగేళ్ల క్రితం ఆయన గ్రామంలోని తోటి రైతులతో కలిసి రైతు ఉత్పత్తి బృందాన్ని ఏర్పాటు చేశారు. నేడు, గ్రామ రైతులు స్వీట్ కార్న్ , బేబీ కార్న్ సాగు చేస్తున్నారు. వారి ఉత్పత్తులను నేరుగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్, బిగ్ రిటైల్ చైన్ , ఫైవ్ స్టార్ హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. నేడు గ్రామంలోని రైతులు స్వీట్ కార్న్, బేబీ కార్న్ లను పండించడం ద్వారా ఎకరానికి సంవత్సరానికి రెండున్నర నుండి మూడు లక్షలు సంపాదిస్తున్నారు. ఇది మాత్రమే కాదు- ఈ గ్రామానికి చెందిన 60 మందికి పైగా రైతులు, నెట్ హౌస్ తయారు చేయడం ద్వారా, పాలీ హౌస్ తయారు చేయడం ద్వారా  టమోటా, దోసకాయ, క్యాప్సికమ్, వాటి  విభిన్న రకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతి సంవత్సరం ఎకరానికి 10 నుండి 12 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ రైతుల ప్రత్యేకత ఏమిటో తెలుసా? తమ పండ్లు, కూరగాయలను ఎక్కడైనా, ఎవరికైనా అమ్మే శక్తి వారికి ఉంది.  ఈ శక్తి వారి పురోగతికి ఆధారం. ఇప్పుడు ఈ శక్తి దేశంలోని ఇతర రైతులకు కూడా కలిగింది. పండ్లు, కూరగాయలు మాత్రమే కాదు-  పొలంలో వారు పండించే వరి, గోధుమలు, ఆవాలు, చెరకు, ఇతర పంటలను వారి కోరిక ప్రకారం,  వాటిని ఎక్కువ ధర ఉండే చోట అమ్ముకోవడానికి వారికి స్వేచ్ఛ లభించింది.

మిత్రులారా! మూడు, నాలుగు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో పండ్లు , కూరగాయలను ఎపిఎంసి పరిధి నుండి మినహాయించారు. ఈ మార్పు మహారాష్ట్రలో పండ్లు , కూరగాయలు పండించే రైతుల పరిస్థితిని ఎలా మార్చిందో చెప్పేందుకు ఒక ఉదాహరణ శ్రీ స్వామి సమర్థ్ ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్.  ఇది రైతుల సమూహం. పూణే, ముంబైలోని రైతుల ప్రతి వారం మార్కెట్లను స్వయంగా నడుపుతున్నారు. ఈ మార్కెట్లలో సుమారు 70 గ్రామాలకు చెందిన సుమారు నాలుగున్నర వేల మంది రైతులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకుంటారు. మధ్యవర్తులెవరూ లేరు.  గ్రామీణ యువకులు వ్యవసాయం , అమ్మకం ప్రక్రియలో నేరుగా మార్కెట్లో పాలుపంచుకుంటారు. ఇది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.  గ్రామంలోని యువతకు ఉపాధి లభిస్తుంది.

మరొక ఉదాహరణ తమిళనాడులోని తేని జిల్లాకు సంబంధించింది. ఇక్కడ తమిళనాడు అరటి ఉత్పత్తి సంస్థ ఉంది.  దీని పేరులో కంపెనీ అని ఉన్నా నిజానికి ఇది రైతుల సమూహం. చాలా సరళమైన వ్యవస్థ ఇది. అది కూడా ఐదారు ఏళ్ల కిందట  ఏర్పాటైంది.   ఈ రైతు బృందం లాక్డౌన్ సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మెట్రిక్ టన్నుల కూరగాయలు, పండ్లు , అరటిపండ్లను కొనుగోలు చేసింది. చెన్నై నగరానికి కూరగాయల కాంబో కిట్ ఇచ్చింది. మీరు ఆలోచించండి.. వారు ఎంత మంది యువతకు ఉపాధి కల్పించారు!  ఇందులో విశేషం ఏమిటంటే, మధ్యవర్తులు లేనందువల్ల  రైతులు ప్రయోజనం పొందారు. వినియోగదారులు  కూడా ప్రయోజనం పొందారు. అలాంటిదే లక్నోకు చెందిన మరో రైతుల బృందం.  వారు ఆ బృందానికి 'ఇరాదా ఫార్మర్ ప్రొడ్యూసర్' అని పేరు పెట్టారు. వారు లాక్డౌన్ సమయంలో రైతుల పొలాల నుండి నేరుగా పండ్లు, కూరగాయలను తీసుకున్నారు. నేరుగా లక్నో మార్కెట్ లో అమ్మారు. నేరుగా వెళ్ళడం ద్వారా లక్నో మార్కెట్లలో మధ్యవర్తుల నుండి విముక్తి పొందారు. తాము కోరుకున్నధరకు వారు అమ్ముకోగలిగారు.  మిత్రులారా! ఇస్మాయిల్ భాయ్ గుజరాత్ లోని బనాస్కాంఠా  రాంపురా గ్రామంలో రైతు. ఆయన కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇస్మాయిల్ భాయ్ వ్యవసాయం చేయాలనుకున్నారు. ఆయన వ్యవసాయం చేయాలనుకుంటే కుటుంబ సభ్యులు విచిత్రంగా చూసేవారు.  ఇస్మాయిల్ భాయ్ తండ్రి వ్యవసాయం చేసేవాడు.  కాని అతనికి తరచూ నష్టాలు వచ్చేవి. కాబట్టి తండ్రి నిరాకరించారు.  కుటుంబం నిరాకరించినప్పటికీ ఇస్మాయిల్ భాయ్ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం నష్టాలతో కూడినదని  ఇస్మాయిల్ భాయ్ భావించాడు. అయితే ఈ ఆలోచనను, పరిస్థితిని రెండింటినీ మార్చాలనుకున్నారు. వినూత్న మార్గాల్లో వ్యవసాయం ప్రారంభించారు. బంగాళాదుంపలను పండించడం ప్రారంభించారు. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో సేద్యం చేశారు. ఈరోజు ఆయన పండించిన బంగాళాదుంపలు ప్రత్యేక  గుర్తింపు పొందాయి.  ఆయన పండించే బంగాళాదుంపలు ఎక్కువ నాణ్యత కలిగినవి.  ఇస్మాయిల్ భాయ్ ఈ బంగాళాదుంపలను నేరుగా పెద్ద కంపెనీలకు విక్రయిస్తారు.  మధ్యవర్తుల అవసరం లేకుండానే ఈ విక్రయం జరుగుతుంది. ఆయన ఇప్పుడు  మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.  తన తండ్రి అప్పును కూడా ఇస్మాయిల్ భాయ్ తీర్చగలిగారు.  మరో గొప్ప విషయం ఏమిటంటే ఇస్మాయిల్ భాయ్ ప్రస్తుతం తన ప్రాంతంలోని వందలాది రైతులకు కూడా సహాయం చేస్తున్నారు. వారి జీవితాలు కూడా మారుతున్నాయి.

మిత్రులారా!  ఈరోజుల్లో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొత్త పద్ధతులు వస్తాయి. కొత్త ఆవిష్కరణలు తోడవుతాయి.  మణిపూర్‌లో నివసించే విజయశాంతి కొత్త ఆవిష్కరణ కారణంగా వార్తల్లో నిలిచారు.  తామర అండాశయం నుండి దారాన్ని తయారు చేయడం ప్రారంభించారు. నేడు ఆ ఆవిష్కరణ కారణంగా తామర సాగుతో వస్త్ర తయారీకి కొత్త మార్గం ఏర్పడింది.

నా ప్రియమైన దేశవాసులారా! నేను మిమ్మల్ని గత కాలానికి  తీసుకెళ్లాలనుకుంటున్నాను. వందేళ్ల కిందటి విషయం. 1919 సంవత్సరం. జలియన్ వాలా బాగ్‌లో బ్రిటిష్ ప్రభుత్వం అమాయక ప్రజలను  ఊచకోత కోసింది. ఈ ఊ చకోత తరువాత  పన్నెండు సంవత్సరాల బాలుడు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అతను సంతోషకరమైన, ఉల్లాసభరితమైన పిల్లవాడు. కానీ  అతను జలియన్ వాలా బాగ్‌లో చూసింది అతని ఆలోచనకు మించినది. ఎవరైనా ఇంత క్రూరంగా, నిర్దయగా  ఎలా ఉండగలరని అతను ఆశ్చర్యపోయాడు. అతను ఆలోచించడం ప్రారంభించాడు ఆంగ్లేయుల దుశ్చర్య ఆగ్రహం కలిగించింది.  అదే జలియన్ వాలా బాగ్‌లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడతామని శపథం చేశాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసా? అవును! నేను అమరవీరుడు భగత్ సింగ్ గురించి మాట్లాడుతున్నాను. రేపు- సెప్టెంబర్ 28 న అమరవీరుడు భగత్ సింగ్ జయంతిని జరుపుకుంటున్నాం. నేను దేశవాసులతో కలిసి ధైర్యశౌర్యాలకు   చిహ్నమైన షహీద్ వీర్ భగత్ సింగ్ కు  నమస్కరిస్తున్నాను. మీరు ఊహించగలరా! ప్రపంచంలోని ఇంత పెద్ద భాగాన్ని పరిపాలించి, సూర్యుడు తన పాలనలో ఎన్నడూ అస్తమించలేదని చెప్పేంత  శక్తివంతమైన ప్రభుత్వం 23 ఏళ్ల వ్యక్తికి భయపడింది. షహీద్ భగత్ సింగ్ శక్తిమంతుడు కావడంతో పాటు పండితుడు, ఆలోచనాపరుడు కూడా. తమ  జీవితాల  గురించి ఆలోచించకుండా  భగత్ సింగ్, ఆయన సహచర  క్రాంతివీరులు ధైర్యసాహసాలను ప్రదర్శించారు.  వారు చేసిన పనులు దేశ స్వాతంత్ర్యానికి ఎంతో దోహదపడ్డాయి. షహీద్ వీర్ భగత్ సింగ్ జీవితంలో మరో గొప్ప అంశం ఏమిటంటే జట్టు పని  ప్రాముఖ్యతను ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. లాలా లాజ్‌పత్ రాయ్ పట్ల ఆయనకున్న అంకితభావం; చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి విప్లవకారులతో ఆయనకున్న అనుబంధం చాలా గొప్పది.  అతను జీవించినంత కాలం ఒక లక్ష్యం కోసం మాత్రమే జీవించాడు.  దాని కోసం అతను ఆత్మ త్యాగం చేశాడు. ఆ లక్ష్యం భారతదేశాన్ని అన్యాయమైన ఆంగ్ల పాలన నుండి విముక్తి చేయడం. నమోఆప్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎస్. అజయ్ గారి వ్యాఖ్య చదివాను. నేటి యువత భగత్ సింగ్ లాగా ఎలా మారగలరని అజయ్ జీ ప్రశ్నించారు. చూడండి! మనం భగత్ సింగ్ అవ్వలేకపోవచ్చు.  కానీ  భగత్ సింగ్ కు ఉన్న దేశ భక్తి, దేశం కోసం ఏదైనా చేయాలనే అభిలాష వాస్తవానికి మన  అందరి హృదయాల్లో ఉన్నాయి. షహీద్ భగత్ సింగ్ కు ఇది మన గొప్ప నివాళి. నాలుగు సంవత్సరాల క్రితం ఈ సమయంలోనే సర్జికల్ స్ట్రైక్ సమయంలో ప్రపంచం మన సైనికుల శౌర్య సాహసాలను, ధైర్యాన్ని చూసింది. మన ధైర్యవంతులైన  సైనికుల లక్ష్యం ఒకటే. ఏది ఏమైనా భరతమాత గౌరవాన్ని కాపాడదామనే ఒకే లక్ష్యం ఉంది. వారు తమ జీవితాలను పెద్దగా పట్టించుకోలేదు. తమ కర్తవ్య  మార్గంలో కొనసాగారు. వారు ఎలా విజయం సాధించారో మనమందరం చూశాం. భారతమాత గౌరవం దీనివల్ల పెరిగింది.

నా ప్రియమైన దేశవాసులారా! రాబోయే రోజుల్లో భారతదేశ నిర్మాణంలో ఎంతో కృషి చేసిన చాలా మంది గొప్ప వ్యక్తులను మనం గుర్తు తెచ్చుకుంటాం.  అక్టోబర్ 2 మనందరికీ పవిత్రమైన, ఉత్తేజకరమైన రోజు. ఆ రోజు భారతమాత ఇద్దరు కుమారులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలను జ్ఞాపకం చేసుకునే రోజు.

పూజ్య బాపూజీ ఆలోచనలు, ఆదర్శాలు గతంలో కంటే ఈ రోజుల్లో చాలా సందర్భోచితమైనవి.  మహాత్మా గాంధీ  ఆర్ధిక ఆలోచనను అర్థం చేసుకుని, ఆ మార్గంలో వెళ్ళి ఉంటే ఈ రోజు స్వావలంబన భారత ప్రచారం అవసరం ఉండేది కాదు.  గాంధీ  ఆర్ధిక ఆలోచనలో భారతదేశ  నాడిపై, భారతదేశ గొప్పదనంపై  అవగాహన ఉంది. పేదవారిలోకెల్లా పేదవారిపై ప్రతిపనిలోనూ దృష్టి పెట్టాలని  పూజ్య బాపుజీ  జీవితం మనకు సందేశం ఇస్తుంది.

అదే సమయంలో శాస్త్రీజీ జీవితం మనకు వినయం, సింప్లిసిటీ లను   సందేశంగా  ఇస్తుంది. అక్టోబర్ 11 రోజు కూడా మనకు  చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు భారత రత్న లోక్ నాయక్  జయ ప్రకాశ్  గారిని ఆయన జన్మదినం సందర్భంగా గుర్తు చేసుకుంటాం. మన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో జెపి ప్రముఖ పాత్ర పోషించారు. భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ కూడా మనం స్మరించుకుంటాం. ఆయన జయంతి కూడా 11 వ తేదీనే ఉంది.  నానాజీ దేశ్ ముఖ్ గారు   - జయ ప్రకాశ్  నారాయణ్ గారి కి చాలా సన్నిహితుడు. జెపి అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నప్పుడు  పాట్నాలో అతనిపై దాడి చేశారు. అప్పుడు  నానాజీ దేశ్ ముఖ్ జేపీ ని కాపాడే బాధ్యత తీసుకున్నాడు.  ఆ దాడిలో నానాజీ తీవ్రంగా గాయపడ్డాడు.  కానీ జెపి ప్రాణాలను రక్షించడంలో విజయం పొందాడు. ఈ అక్టోబర్ 12 రాజ మాత విజయరాజే సింధియా జన్మదినం. ఆమె తన జీవితమంతా ప్రజల సేవ కోసం అంకితం చేసింది. ఆమె ఒక రాజ కుటుంబానికి చెందినవారు.  ఆస్తి, అధికారం, ఇతర వనరులకు కొరత లేదు. కానీ ఆమె మాతృత్వ భావనతో, ఒక తల్లిలాగా ఎంతో వాత్సల్యం ప్రదర్శిస్తూ  ప్రజా ప్రయోజనాల కోసం తన జీవితం గడిపారు.  ఆమె హృదయం చాలా ఉదారమైంది. ఈ అక్టోబర్ 12న ఆమె శత జయంతి ఉత్సవాల ముగింపు రోజు. ఈ రోజు నేను రాజ్‌మాత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు  నాకు కూడా చాలా భావోద్వేగ సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది.

చాలా సంవత్సరాలు రాజమాతతో కలిసి పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది. చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ రోజు నేను ఒక సంఘటనను తప్పక ప్రస్తావించాలని ఉంది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏక్తా యాత్రకు బయలుదేరాం. డాక్టర్ మురళి మనోహర్ జోషి గారి నాయకత్వంలో ఆ ప్రయాణం జరుగుతోంది. డిసెంబర్, జనవరి నెలల్లో వణికించే చల్లని రోజులు. రాత్రి పన్నెండు- ఒంటి గంటలకు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపంలో ఉన్న శివపురికి చేరుకున్నాం. నివాసానికి వెళ్ళాం. రోజంతా అలసిపోయాం. స్నానం చేసి,  నిద్రపోవాలనుకున్నాం. ఉదయం కోసం సిద్ధమవుతున్నాం. సుమారు 2 గంటలైంది. నేను స్నానం చేసి, నిద్రపోవడానికి సిద్ధమవుతున్నాను. అప్పుడు ఎవరో తలుపు తట్టారు. నేను తలుపు తెరిచినప్పుడు  రాజమాతా సాహెబ్ ముందు నిలబడి ఉన్నారు. చలికాలపు రాత్రి. ఆ సమయంలో రాజ్‌మాతా సాహెబ్‌ను చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ తల్లికి నమస్కరించాను. “ఇంత రాత్రివేళలో  వచ్చారా  అమ్మా?” అన్నాను. “బిడ్డా! ఈ పాలు తాగండి.  మోడీ జీ!  వేడి పాలు తాగిన తరువాత నిద్రించండి” అన్నారు. పసుపు వేసిన పాలు స్వయంగా  తెచ్చారు.  అవును.  కానీ తర్వాతి రోజు నేను గమనించాను. కేవలం నాకొక్కడికే కాదు.. యాత్రలో ఉన్న అందరూ ఉన్న చోటికి వెళ్ళి స్వయంగా పాలు అందజేశారని తెలిసింది.   మా యాత్రలో 30-40 మంది ఉన్నారు. వారిలో డ్రైవర్లు ఉన్నారు. ఎక్కువ మంది కార్య కర్తలు ఉన్నారు. తల్లి ప్రేమను, వాత్సల్యాన్ని  నేను ఆ సంఘటనలో చవిచూశాను.  ఆ సంఘటనను నేను ఎప్పటికీ మరచిపోలేను. అలాంటి మహనీయులు తమ త్యాగం, తపస్సుతో మన దేశసేవ చేయడం మన అదృష్టం. రండి..  మనమందరం కలిసి ఈ గొప్ప వ్యక్తులు గర్వంగా భావించే భారతదేశాన్ని నిర్మిద్దాం.  వారి కలలను వాస్తవరూపంలోకి తెచ్చేందుకు సంకల్పం చేసుకుందాం.  

నా ప్రియమైన దేశవాసులారా! ఈ కరోనా కాలంలో నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. మాస్క్ ధరించండి. ముఖానికి ముసుగు లేకుండా బయటకు వెళ్లవద్దు. రెండు గజాల నియమం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. ఇవి కొన్ని నియమాలు.. ఈ కరోనాకు వ్యతిరేకంగా యుద్ధ ఆయుధాలు.  ప్రతి పౌరుడి ప్రాణాలను రక్షించే బలమైన మార్గాలు. మర్చిపోవద్దు. మందు వచ్చేవరకు తొందరవద్దు. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచండి.  శుభాకాంక్షలతో చాలా చాలా ధన్యవాదాలు.

నమస్కారం

*****  

 


(Release ID: 1659530) Visitor Counter : 458