సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
స్వదేశీని ప్రోత్సహించేందుకు ఎస్.పి.జి కాంప్లెక్స్‌లో ఖాదీ ఔట్‌లెట్ ప్రారంభం
Posted On:
26 SEP 2020 4:29PM by PIB Hyderabad
ఖాదీ , గ్రామీణ పరిశ్రమల కమిషన్(కెవిఐసి) స్వదేశీని ప్రోత్సహించేందుకు మరో చర్య తీసుకుంది. ఈ సారి తన కార్యకలాపాలను ఎస్.పి.జికి విస్తరించింది. కెవిఐసి ఈరోజు, ఢిల్లీలోని ద్వారకలో ఎస్‌పిజి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రాంగణంలో కొత్త ఖాదీ ఇండియా ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. ఈ ఔట్‌లెట్ ఈ ప్రాంతంలోని రెండు నివాస సముదాయాలలోగల ఎస్‌పిజికి చెందిన సుమారు 4000మంది ఎస్‌పిజి ఆఫీసర్లు, సిబ్బంది అవసరాలకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధానమంత్రికి భద్రత కల్పించే సంస్థ ఎస్.పి.జి. ఖాదీ అమ్మకాల ఔట్‌లెట్‌ను కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్‌కుమార్ సక్సేనా, ఎస్‌పిజి డైరక్టర్ శ్రీ అరుణ్ సిన్హా సంయుక్తంగా ప్రారంభించారు.
ఎస్‌పిజి సిబ్బంది, వారి కుటుంబానికి స్వచ్ఛమైన , చేతితోతయారైన స్వదేశీ ఉత్పత్తులను అందజేయాలన్న సంకల్పంతో
ఈ అమ్మకాల ఔట్‌లెట్‌ను ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు కెవిఐసి ప్రకటన తెలిపింది. ఈ కుటుంబాల వారు ఖాదీ ఉత్పత్తులను కొనేలా మరింత ప్రోత్సహించేందుకు కెవిఐసి తన ఔట్‌లెట్‌లోని అన్ని ఉత్పత్తులపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ద్వారకలోని ఎస్‌పిజి కాంప్లెక్స్ 125 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. ఇందులో సుమారు 15,000 మంది నివాసం ఉంటున్నారు.దీనికి పక్కనే మరో 26 ఎకరాల స్థలంలోని నివాస సముదాయంలో ఎస్.పి.జి సిబ్బందికి చెందిన 800 కుటుంబాలు ఉంటున్నాయి. అందువల్ల ఖాదీ ఔట్‌లెట్ ఉన్న షాపింగ్ కాంప్లెక్సుకు చెప్పుకోదగిన స్థాయిలో కొనుగోలుదారులు వస్తారు. కెవిఐసికి ఎస్.పి.జి ఈ ఔట్‌లెట్‌ను నామమాత్రంగా నెలకు రూపాయి అద్దెకు ఇచ్చింది.
ఈ ఔట్‌లెట్ ద్వారా కెవిఐసి అత్యంత నాణ్యమైన చేతితొతయారైన , సహజసిద్ధ ఉత్పత్తులను ఎస్‌పిజి కుటుంబాలకు అందుబాటులోకి తెస్తుందని కెవిఐసి ఛైర్మన్ తెలిపారు.“ ఎస్.పి.జి ప్రధానమంత్రి భద్రతను చూస్తుంది. ప్రధాన మంత్రే ఖాదీకి పెద్ద బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ ఖాదీ అమ్మకాల ఔట్‌లెట్ తో కెవిఐసి ఎస్‌పిజి అధికారులు, సిబ్బంది కుటుంబాలకు అత్యుత్తమ నాణ్యతగల ఉత్పత్తులను అందించి వారి అవసరాలు తీర్చే బాధ్యతను చేపట్టాలనుకుంటున్నది” అని సక్సేనా అన్నారు. ఖాదీ అమ్మకాల ఔట్‌లెట్ ప్రారంభం ఖాదీహస్త కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేయడం ద్వారా మనం ప్రజలకోసం సుస్థిర జీవనోపాధిని కల్పించగలం.
ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్‌కు పిలుపునివ్వడం, ఓకల్ ఫర్ లోకల్ నినాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెవిఐసి తెలిపింది.గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా , పార్లమెంటరీ దళాలు తమ క్యాంటీన్ ల ద్వారా కేవలం స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలని ఆదేశించారు. ఇటీవల కెవిఐసి స్వచ్ఛమైన కచ్చి ఘని ఆవనూనెను పార్లమెంటరీ దళాలకు సరఫరాచేస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ సరకుల సరఫరాకు ఐటిబిపితో ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. కెవిఐసి ఈ ఔట్‌లెట్ ద్వారా ఖాదీ వస్త్రాలు, గ్రామీణ పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు విక్రయిస్తుంది
***
(Release ID: 1659395)
Visitor Counter : 139