ఆర్థిక మంత్రిత్వ శాఖ

'వొడాఫోన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ బీవీ'లో మధ్యవర్తిత్వ కేసు తీర్పును అధ్యయనం చేయనున్న కేంద్ర ప్రభుత్వం

Posted On: 25 SEP 2020 6:21PM by PIB Hyderabad

'వొడాఫోన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ బీవీ' మధ్యవర్తిత్వ కేసులో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్న సమాచారం తెలిసిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయవాదులతో సంప్రదించి, ఆ తీర్పులోని అన్ని అంశాలను ప్రభుత్వం క్షుణ్నంగా అధ్యయనం చేస్తుందని తెలిపింది. ఆ సంప్రదింపుల తర్వాత ప్రభుత్వం అన్ని అవకాశాలను పరిశీలించి, తగిన వేదిక వద్ద చట్టపరమైన ప్రత్యామ్నాయలతో తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
 

***(Release ID: 1659242) Visitor Counter : 88


Read this release in: English , Urdu , Hindi , Punjabi