ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో ఎయిమ్స్ 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్
కోవిడ్-19పై దేశం చేస్తున్న పోరాటంలో ఎయిమ్స్, న్యూఢిల్లీ సేవలకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు
“చరిత్రలో కనివిని ఎరుగని ఈ సంక్లిష్ట సమయంలో టెలీ మెడిసిన్, టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు నిరంతరాయంగా అందించడంతో ఎయిమ్స్ కృషి ప్రశంసనీయం”
“కోవిడ్ కాలంలో ఎయిమ్స్” పేరు మీద ప్రదర్శన ప్రారంభం
Posted On:
25 SEP 2020 3:52PM by PIB Hyderabad
అంతర్జాతీయ వైద్య శాస్ర్తాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్) 65వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే సమక్షంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అధ్యక్షత వహించారు. ఇది ఎయిమ్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ బోధన ప్రారంభమైన రోజు1956లో ఇదే రోజున ఇక్కడ ఎంబిబిఎస్ మొదటి క్లాస్ జరిగింది.
జాతీయ మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించే జాతీయ సంస్థల ర్యాంకింగ్ విధానంలో (ఎన్ఐఆర్ఎఫ్) తొలి స్థానంలో నిలిచినందేరే ఎయిమ్స్ సిబ్బందిని మంత్రి అభినందించారు. 1956లో పార్లమెంటు నిర్దేశకత్వం కింద ఏర్పాటైన ఈ జాతీయ స్థాయి సంస్థ ప్రారంభం నుంచి ఆరోగ్య సర్వీసులు, విద్య, పరిశోధన రంగాల్లో నిర్దేశించిన అత్యున్నత ప్రమాణాలను క్రమం తప్పకుండా అందుకుంటూనే ఉన్నదని డాక్టర్ హర్షవర్థన్ సంతృప్తి ప్రకటించారు.
కోవిడ్ మహమ్మారి కష్టకాలంలో అ సంస్థ అవిశ్రాంతంగా నిర్వహించిన సేవల పట్ల కృతజ్ఞత తెలిపారు. “కరోనా వైరస్ 50 లక్షల మందికి సోకింది. కాని దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన డయాగ్నస్టిక్, నిర్వహణ సదుపాయాల మద్దతుతో మరణాల శాతం అతి తక్కువగాను, రికవరీ అత్యంత గరిష్ఠంగాను ఉండేందుకు దోహదపడింది” అని డాక్టర్ హర్షవర్థన్ అన్నారు. “గత ఆరు నెలల కాలంలో ఎయిమ్స్ పెద్ద బాధ్యతను మీద వేసుకున్నందుకు నేను ప్రశంసిస్తున్నాను. రోగులకు సేవ చేయడమే కాదు, పరిశోధనలో కొత్త మార్గాలు అనుసరించడం, దేశంలోని వైద్య సిబ్బంది అందరికీ మంచి మార్గదర్శకత్వం వహించడం, బోధన, కమ్యూనికేషన్లలో కొత్త విధానాలు అనుసరించడం వంటి ఎన్నో చొరవలు చేపట్టింది” అన్నారు.
కోవిడ్-19పై భారతదేశం పోరాటాన్ని గురించి వివరిస్తూ “మన దేశంలో రికవరీ రేటు నిరంతరం పెరుగుతూ, మరణాల రేటు ప్రగతిశీలంగా తగ్గుతూ వచ్చింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చురుకైన మార్గదర్శకత్వంలో రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన కట్టడి వ్యూహం విజయానికి ఇదే నిదర్శనం. మనం విజయవంతంగా కోవిడ్ పరీక్షల సామర్థ్యాలను పెంచుకుంటూ ఈ రోజున దేశవ్యాప్తంగా 1800 టెస్టింగ్ ల్యాబ్ లతో రోజుకి 15 లక్షల పరీక్షల నిర్వహణ మైలురాయిని చేరగలిగాం. కోవిడ్-19కి చికిత్స, వ్యాక్సిన్ అభివృద్ధి విభాగాల్లో చోటు చేసుకుంటున్న శాస్ర్తీయ పరిణామాల బలంతో కోవిడ్-19పై పోరాటంలో భారతదేశం త్వరలోనే మరింత విజయం నమోదు చేసుకోగలుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను” అని డాక్టర్ హర్షవర్థన్ అన్నారు.
కోవిడ్ సమయంలో వైద్యసిబ్బంది నిరంతరాయంగా, అవిశ్రాంతంగా, నిస్వార్థంగా అందిస్తున్న సేవలను శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రశంసించారు. “ఎయిమ్స్ పలుకుబడి నిరంతరాయంగా విస్తరిస్తూనే ఉంది. రోగుల సంరక్షణ, పరిశోధన, విద్యా విభాగాల్లో ఎనలేని సేవలందించింది. అమెరికా, బ్రిటన్, ఆస్ర్టేలియా, జర్మనీ వంటి దేశాల విద్యార్థులను కూడా ఆకర్షించింది. అది అతి పెద్ద విజయం అన్నారు. అత్యాధునిక సౌకర్యాలు గల సంస్థల ఎయిమ్స్ కు విశిష్ట స్థానం ఉంది. దేశంలోని అన్ని మూలలకు, అన్ని ప్రాంతాలకు ఎయిమ్స్ సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అని చెప్పారు.
ఫ్యాకల్టీ సభ్యులు, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షవర్థన్, శ్రీ చౌబే అవార్డులు, పతకాలు అందించారు. “ఎయిమ్స్ విద్యార్థి కావాలన్నది ప్రతీ ఒక్క వైద్య విద్యార్థి కల. దేశంలో వైద్య సేవలను పటిష్ఠం చేసేందుకు, శాస్ర్తీయ దృక్పథం గల దేశాల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు అవసరమైన ఆలోచనలు తీవ్రస్థాయిలో ఉదృతంగా చేయాలని ఈ 65వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను” అని డాక్టర్ హర్షవర్థన్ అన్నారు.
ఈ సందర్భంగా పరిశోధన విభాగం మాన్యువల్ ను కేంద్ర ఆరోగ్య మంత్రి విడుదల చేశారు. ప్రజారోగ్య ఎమర్జెన్సీని సమర్థవంతంగా ఎదుర్కొనడంలో న్యూఢిల్లీ ఎయిమ్స్ సేవలను వివరించే “కోవిడ్ కాలంలో ఎయిమ్స్” ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కోవిడ్ పరీక్షలు, మదింపు, శాంపిల్స్ సేకరణ, లేబరేటరీల పనితీరు, కోవిడ్ టాస్క్ ఫోర్స్, సిబ్బందికి విస్తృత శిక్షణ, కోవిడ్ సమయంలో సిబ్బంది ప్రవర్తన సహా వివిధ అంశాలపై వివిధ శాఖలు ఇందులో తమ అంశాలను ప్రదర్శనకు పెట్టాయి.
పిజిఐఎంఇఆర్, చండీగఢ్ కు చెందిన ప్రొఫెసర్ దిగంబర్ బెహరా, ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రణ్ దీప్ గులేరియా, న్యూఢిల్లీ ఎయిమ్స్ డీన్ (అకాడమిక్స్) డాక్టర్ అనితా సక్సేనా, సైంటిఫిక్ ఎగ్జిబిషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ పీయూష్ సహాని, ఇతర సీనియర్ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1659240)
Visitor Counter : 225