ఆయుష్
ఔషధ మొక్కల పెంపకం ప్రోత్సాహానికి పరిశ్రమల సంస్థలతో ఆయుష్ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం
प्रविष्टि तिथि:
24 SEP 2020 7:03PM by PIB Hyderabad
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన 'నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్' (ఎన్‌ఎమ్‌పీబీ) ఈ రోజు జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో ప్రధాన ఆయుష్ మరియు ఔషధ రంగ పరిశ్రమ సంస్థలతో వర్చువల్ సమావేశం ద్వారా ఒక అవగాహన ఒప్పందంపై (ఎంఓయూపై) సంతకం చేసింది. ఈ ఎంఓయూలో
ఆయుష్ మరియు హెర్బల్ పరిశ్రమ సంస్థలు వివిధ ఔషధ మొక్కల యొక్క పెంపకాన్ని ప్రోత్సహించేలా అనేక చర్యలను కలిగి ఉన్నాయి. ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన పరిశ్రమ సంస్థలలో ముంబయి నగరానికి చెందిన ఏడీఎంఏ (ఆయుర్వేదిక్ ఔషధాల తయారీదారుల అసోసియేషన్); న‌్యూఢిల్లీకి చెందిన ఏఎంఏఎం (ఆయుర్వేద ఔషధాల తయారీదారుల అసోసియేషన్); త‌్రిశూర్‌లోని ఏఎంఎంఓఐ (భారత ఆయుర్వేద ఔషధాల తయారీదారుల సంస్థ);
ముంబయి నగరానికి చెందిన ఏహెచ్ఎన్ఎంఐ.. (అసోసియేషన్ ఫర్ హెర్బల్ అండ్ న్యూట్రాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఇండియా); న్యూఢిల్లీకి చెందిన
ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) మరియు సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ). ఈ కీలక ఒప్పందంపై సంతకం చేసే కార్యక్రమంలో
ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వి.డి.రాజేశ్ కోటేచా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి తమ మంత్రిత్వ శాఖ అవసరమైన సహకారాన్ని అందిస్తుందన్న హామీ ఇచ్చారు.
పరిశ్రమల వారందరూ ఒక బృందంగా ఏర్పాటై వారు ఎదుర్కొంటున్న పరిశ్రమ సంబంధిత సమస్యలకు తగిన పరిష్కార మార్గాలతో ముందుకు వస్తే తగినట్టుగా సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయుష్ వ్యవస్థల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఎన్‌ఎమ్‌పీబీ మద్దతు ఉన్న ఔషధ మొక్కల సాగు, సేకరణ కార్యక్రమాలపై రైతులు/ సేకరించేవారికి తిరిగి కొనుగోలు హామీని అందిస్తామని పరిశ్రమ ఎన్‌ఎమ్‌పీబీకి హామీని ఇచ్చింది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ తరపున ఎన్‌ఎమ్‌పీబీ సీఈఓ డాక్టర్ జేఎల్‌ఎన్ శాస్త్రి ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఏడీఎంఏ తరపున చంద్రకాంత్ భానుశాలి, అమామ్ తరపున మిస్టర్ ప్రదీప్ ముల్తానీ, ఏఎంఎంఓఐ తరపున
డాక్టర్ రామనాథన్, ఏహెచ్ఎన్ఎంఐ తరపున మిస్టర్ సంజయ్ మారివాలా, ఫిక్కీ తరఫున ప్రవీణ్ మిట్టల్, సీఐఐ తరపున మిస్టర్ రాజీవ్ వాసుదేవలు తమతమ సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ప్రత్యేకమైన చర్యతో ఆయూష్, న్యూట్రాస్యూషియల్ మరియు హెర్బల్ పరిశ్రమలకు నాణ్యమైన ముడి పదార్థాల స్థిరమైన సరఫరాను అందించేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ ప్రతినిధులు అంగీకరించారు.
***
(रिलीज़ आईडी: 1658879)
आगंतुक पटल : 191