రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

లేజర్ గైడెడ్ ఎటిజిఎం విజయవంతంగా పరీక్ష

Posted On: 23 SEP 2020 2:32PM by PIB Hyderabad

లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి (ఎటిజిఎం) ను 2020 సెప్టెంబర్ 22 న అహ్మద్ నగర్ లోని  ఆర్మర్డ్ కార్ప్స్ సెంటర్ మరియు స్కూల్ (ఎసిసి & ఎస్) కెకె రేంజి వద్ద నుండి ఎంబిటి అర్జున్ ట్యాంక్ ద్వారా విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షలలో, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఎటిజిఎం విజయవంతంగా చేధించింది. లేజర్ గైడెడ్ ఎటిజిఎం లు లేజర్ సూచించిన దిశగా ఖచ్చితమైన గురిని నిర్ధారించుకుని లక్ష్యాలను లాక్ చేసి ట్రాక్ చేస్తాయి. ఎక్సప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ (ERA) రక్షిత సాయుధ వాహనాలను ధ్వంసం చేయడానికి క్షిపణి ఒక హీట్ వార్‌హెడ్‌ను ఉపయోగిస్తుంది. ఇది బహుళ-ప్లాట్‌ఫాం ప్రయోగ సామర్ధ్యంతో అభివృద్ధి చేయబడింది, అలాగే ప్రస్తుతం ఎంబిటి అర్జున్ యొక్క తుపాకితో అనుసంధానమై సాంకేతిక పరీక్షల్లో ఉంది.

పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (హెచ్‌ఇఎంఆర్‌ఎల్), ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఐఆర్‌డిఇ) డెహ్రాడూన్ ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి.

కెకె రేంజ్‌లలో ఎంబిటి అర్జున్ నుంచి లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ డిఆర్‌డిఓను అభినందించారు. కార్యదర్శి డిడిఆర్ & డి, ఛైర్మన్ డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షా కాల్పులు జరిపినందుకు డిఆర్డిఓ సిబ్బందిని, పరిశ్రమను అభినందించారు.

 

 

***

 (Release ID: 1658201) Visitor Counter : 25