పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

వందే భార‌త్ మిష‌న్ కింద 11 ల‌క్ష‌ల మందికి పైగా ఇండియాకు తిరిగివ‌చ్చారు.

లైఫ్‌లైన్ ఉడాన్ ను అత్య‌వ‌స‌రాల‌ను, క్ర‌మ‌బ‌ద్దంగా దేశ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్రారంభించారు.

Posted On: 22 SEP 2020 6:19PM by PIB Hyderabad

వందేభార‌త్ మిష‌న్ కింద ప్ర‌త్యేకంగా భార‌తీయ విమాన‌యాన సంస్థ‌లు ప్ర‌యాణికుల‌ను విదేశాల‌నుంచి త‌ర‌లించడం,అలాగే భారతీయ‌, విదేశీ విమాన‌యాన సంస్థ‌లు చార్టర్డు విమానాలు న‌డ‌ప‌డం ఉన్నాయి. విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ అంద‌జేసిన స‌మాచారం ప్ర‌కారం, 31-08-2020 వ‌ర‌కు 11 ల‌క్ష‌ల మందికి పైగా (భూమార్గంలో స‌రిహ‌ద్దులు దాటివ‌చ్చిన వారు కాక‌) వందేభార‌త్ మిష‌న్ కింద ఇండియాకు తిరిగివ‌చ్చారు.  దేశం వారీగా, రాష్ట్రాల వారీగా ఇండియాకు తిరిగివ‌చ్చిన ప్ర‌యాణికుల సంఖ్య‌కు సంబంధించిన వివ‌రాలు  అనుబంధం -ఎ లో ఉన్నాయి.
ఇక్క‌డ క్లిక్ చేయండి.
లైఫ్‌లైన్ ఉడాన్‌:
కేంద్ర పౌర‌విమాన యాన శాఖ లైఫ్‌లైన్ ఉ డాన్ ను 26-03-2020న ప్రారంభించింది. దేశ‌వ్యాప్తంగా అన్నిప్రాంతాలకూ అత్య‌వ‌స‌రాలు, మందుల స‌ర‌ఫ‌రా క్ర‌మ‌బ‌ద్ధంగా జ‌రిగేందుకు వీలుగా  అలాగే పిపిఇలు (వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు), కోవిడ్ టెస్ట్ కిట్ త‌దిత‌రాల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు దీనిని ప్రారంభించారు. ఇందుకోసం మంత్రిత్వ‌శాఖ లైఫ్‌లైన్ ఉడాన్ ఏర్పాటును ఆయా రాష్ట్రాల అవ‌స‌రాలు , రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చేర‌వేయ‌వ‌ల‌సిన స‌ర‌కులు, ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ (హెచ్ఐఎల్ఎల్‌,ఐసిఎంఆర్‌) ఇత‌ర‌మంత్రిత్వ‌శాఖ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా చేపట్టారు. ఇందుకు  ప్ర‌త్యేక విమానాల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక‌లురూపొందించారు.
తొలుత‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ఏజెన్సీలు లైఫ్‌లైన్ ఉడాన్ ర‌వాణా ఖ‌ర్చులు భ‌రించ‌వ‌ల‌సి ఉంటుంది. అయితే కంటింజెన్సీ వ్య‌య ప్ర‌ణాళిక కింద 30 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అద‌న‌పు వ్య‌యం చేసేందుకు లైఫ్‌లైన్ ఉడాన్ కార్య‌క‌లాపాల కోసం పౌర‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ ఆమోదించింది. 18-09-2020 వ‌ర‌కు 18.95 కోట్ల రూపాయ‌ల‌ను పౌర‌విమానాయాన మంత్రిత్వ‌శాఖ ఎయిర్‌లైన్సు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఎజెన్సీల‌కు లైఫ్‌లైన్ ఉడాన్ విమానాల కోసం తిరిగి చెల్లించింది.  రాష్ట్రాల వారీ విమానాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను అనుబంధం బిలో చూడ‌గ‌ల‌రు.
 రిమోట్ లీ పైల‌టెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ వ్య‌వ‌స్థ‌:
పౌర‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ 31-08-2020 నాటికి రిమోట్‌లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ వ్య‌వ‌స్థ‌కింద ష‌ర‌తుల‌తో కూడిన మిన‌హాయింపును కంద పేర్కొన్న రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఏజెన్సీల‌కు ఇచ్చింది.
1. మ‌హారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిష‌న్ కంపెంనీ లిమిటెడ్‌
2. క‌మిష‌న‌రేట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్‌, రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం
3.డిపార్ట‌మెంట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్‌, అగ్రిక‌ల్చ‌ర్ ఎడ్యుకేష‌న్‌, రిసెర్చి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం
4. అగ్రిక‌ల్చ‌ర్‌, రైతుల సంక్షేమ విభాగం, హ‌ర్యానా ప్ర‌భుత్వం
5. డైర‌క్ట‌రేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొట‌క్ష‌న్‌, క్వారంటైన్ , స్టోరేజ్ (డిపిపిక్యుఎస్‌), ఫ‌రీదాబాద్‌
6. ప్ర‌భుత్వ ఏవియేష‌న్ శిక్ష‌ణ సంస్థ‌,భువ‌నేశ్వ‌ర్‌
7. తెలంగాణా స్టేట్ ఏవియేష‌న్ అకాడ‌మీ, హైద‌రాబాద్‌
కేంద్ర పౌర విమాన‌యాన శాఖ స‌హాయ‌మంత్రి (ఇంఛార్జి)శ్రీ హ‌ర్దీప్ సింగ్ పూరీ ఒక లిఖిత పూర్వ‌క ప్ర‌శ్న‌కుస‌మాధానంగా ఈరోజు లోక్‌స‌భ‌కు తెలిపారు.

***



(Release ID: 1658022) Visitor Counter : 170