సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కొవిడ్ సమయంలోనూ సాఫీగా ఆర్టీఐ కార్యకలాపాలు: డా.జితేంద్ర సింగ్
ఈ ఏడాది మార్చి నుంచి ఈనెల 17వ తేదీ వరకు 4491 ఆన్‌లైన్ అభ్యర్థనల పరిష్కారం
प्रविष्टि तिथि:
22 SEP 2020 5:09PM by PIB Hyderabad
కొవిడ్ సమయంలో, రెండో దఫా అభ్యర్థనలు లేదా ఫిర్యాదులను దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా వినేందుకు కేంద్ర సమాచార కమిషన్ చర్యలు తీసుకుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్ రాజ్యసభకు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నుంచి 17.09.2020 వరకు 4491 ఆన్‌లైన్ అభ్యర్థనలు పరిష్కారమయ్యాయని లిఖితపూర్వక సమాధానం రూపంలో తెలిపారు.
ఆర్టీఐ దరఖాస్తులను సమర్పించేందుకు ప్రజలకు సాయం చేయడానికి 2013 ఆగస్టులోనే ఆర్టీఐ ఆన్‌లైన్ పోర్టల్ (https://rtionline.gov.in)ను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ప్రారంభించిందని డా.జితేంద్ర సింగ్ తెలిపారు. మొదటి, రెండో దఫా అభ్యర్థనలను ఈ పోర్టల్ ద్వారా అధికారులతో సమన్వయపరుస్తారని వెల్లడించారు. దృశ్య, శ్రవణ పద్ధతుల్లో అభ్యర్థలను వినే సౌకర్యం కొవిడ్ ముందే కమిషన్ వద్ద ఉందని వివరించారు. దిల్లీ బయటి రెండో అభ్యర్థన లేదా ఫిర్యాదుల కేసుల్లో... వివిధ రాష్ట్రాల్లో ఉన్న వివిధ జిల్లాల ప్రధాన కార్యాలయాల్లోని ఎన్‌ఐసీ స్టూడియోల ద్వారా ఉభయ పక్షాలకు అనుకూల తీర్పులు వచ్చాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1657902)
आगंतुक पटल : 247