రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అభ్యాస్ విమాన ప‌రీక్ష విజ‌య‌వంతం

Posted On: 22 SEP 2020 5:38PM by PIB Hyderabad

ఒడిశాలోని బాలసోర్ మధ్యంతర పరీక్షా శ్రేణి క్షేత్రం నుంచి 'రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ' (డీఆర్‌డీఓ) అభ్యాస్ విమాన ప‌రీక్ష- 'హై-స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్‌'ను (హీట్‌) ఈ రోజు  విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది. హీట్ ట్రయల్స్ సమయంలో రెండు ప్రదర్శన వాహనాలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి. ఈ వాహనాన్ని వివిధ క్షిపణి వ్యవస్థల మూల్యాంకనం లక్ష్యంగా ఉపయోగించవచ్చు. అభ్యాస్‌ను డీఆర్‌డీఓకు చెందిన‌
'ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్' (ఏడీఈ) రూపొందించి అభివృద్ధి చేసింది. ట్విన్ అండర్స్‌లంగ్ బూస్టర్ ఉపయోగించి ఎయిర్ వెహికల్ లాంచ్ చేశారు. ఇది ఒక చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. మార్గదర్శకత్వం మరియు నియంత్రణ కోసం 'ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ (ఎఫ్‌సీసీ‌) తో పాటు నావిగేషన్ కోసం ఎంఎస్ఎంఈ ఆధారిత జడత్వ నావిగేషన్ సిస్టమ్ (ఐఎన్ఎస్‌) ను కలిగి ఉంది. ఈ వాహనం పూర్తిగా స్వయంప్రతిపత్త విమాన ప్రయాణానికి త‌గ్గ‌ట్టుగా ప్రోగ్రామ్ చేయబడింది. ల్యాప్‌టాప్ ఆధారిత గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ (జీసీఎస్) ఉపయోగించి ఎయిర్ వెహికల్ చెక్ అవుట్ జరుగుతుంది. పరీక్ష సందర్భంగా టెస్ట్ వెహిక‌ల్ 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగ‌ర‌డం, వాహ‌న వేగం 0.5 మాక్, 30 నిమిషాల ఎండ్యురెన్స్ (ఓర్పు) మరియు 2 జి టర్న్ సామర్ధ్యం.. విజయవంతంగా సాధించబడ్డాయి.

***



(Release ID: 1657901) Visitor Counter : 275