పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఉడాన్ 4.0 తొలి ద‌శ కింద 78 కొత్త మార్గాల గుర్తింపు, ఆమోదం.

ఆర్‌సిఎస్ ఉడాన్ కింద 2024 నాటికి 100 విమానాశ్ర‌యాలు, హెలిపోర్టులు, వాట‌ర్ ఎయిరోడ్రోమ్‌లు అభివృద్ది

Posted On: 21 SEP 2020 4:24PM by PIB Hyderabad

ప్రాంతీయ అనుసంధాన‌త ప‌థ‌కం (ఆర్‌సిఎస్‌)- ఉదే దీక్షా ఆమ్ నాగ‌రిక్ (యుడాన్‌)కు సంబంధించి మూడు రౌండ్ల బిడ్డింగ్ అనంత‌రం కోవిడ్‌కు ముందు ,688 అనుమ‌తిగ‌ల మార్గాల‌ను కేటాయించారు. ఇందులో 281 మార్గాలు ఉప‌యోగంలోకి వ‌చ్చాయి. 2020 మార్చి 25 వ తేదీ నుంచి 2020 మే 24 వ తేదీ వ‌ర‌కు దేశీయ విమాన‌యాన స‌ర్వీసులు ర‌ద్దు అయ్యాయి. ఆర్‌సెస్ కార్య‌క‌లాపాల‌తో స‌హా దేశీయ‌ విమాన స‌ర్వీసులు  25-05-2020 నుంచి తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. విమాన‌యాన స‌ర్వీసులు ఆర్‌సిఎస్ రూట్ల‌లో కార్య‌క‌లాపాల‌ను ప‌రిస్థ‌తుల‌ను జాగ్ర‌త్త‌గా మ‌దింపు చేసిన అనంత‌రం ద‌శ‌ల‌వారీగా ప్రారంభిస్తున్నాయి. దీనికితోడు 78 కొత్త మార్గాల‌ను గుర్తించి యుడాన్ 4.0 తొలిద‌శ కింద ఆమోదించారు. దీని అమ‌లు ప్ర‌క్రియ‌ను చేప‌ట్టే సంస్థ‌ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా . ఈ క్ర‌మంలో ఈ సంస్థ ఈ రూట్ల‌ను ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆప‌రేటర్ల‌కు (ఎస్ఎఒల‌కు) కేటాయిస్తోంది.

ఆర్‌సిఎస్ -ఉడాన్  కింద కేటాయించిన మార్గాలు, ప్రారంభ‌మైన మార్గాల గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.(అనుబంధం ఎ, బి)

కొన్ని ఉడాన్ మార్గాలు కార్యాచ‌ర‌ణ‌లోకి రాక‌పోవ‌డానికి కొన్ని కార‌ణాలు :

1) సివిల్ విమానాశ్ర‌యాల‌లో భూమి అందుబాటులో లేక మౌలిక‌స‌దుపాయాలు లేక‌పోవ‌డం, ఎయిర్‌పోర్టు ఆప‌రేటర్లు ప్ర‌భుత్వ  నిబంధ‌న‌ల‌కు  సంబంధించిన విధివిధానాల‌ను పూర్తి చేయ‌క‌పోవ‌డం, విమానాశ్ర‌యానికి త‌గిన రోడ్డు అనుసంధాన‌త లేక‌పోవ‌డం.

2) షెడ్యూల్డు క‌మ్యూట‌ర్ ఆప‌రేట‌ర్ ప‌ర్మిట్ తెచ్చుకునే ప్ర‌క్రియ‌ను విమాన‌యాన సంస్త‌లు పూర్తి చేయ‌క‌పోవ‌డం.

కోవిడ్ -19 కార‌ణంగా విమానాశ్ర‌యాల‌లో సివిల్ నిర్మాణాల ప‌నులు పూర్తికావ‌డంలో జాప్యం జ‌ర‌గ‌డం.అలాగే దేశీయ కార్య‌క‌లాపాలు నిలిపివేయ‌డంతో, అది మొత్తంగా కొత్త రూట్ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్నిచూపింది.

 నాలుగ‌వ రౌండ్ బిడ్డింగ్ 2019 డిసెంబ‌ర్ 3న ప్రారంభ‌మైంది. 100 విమానాశ్ర‌యాలు, హెలిపోర్టులు, వాట‌ర్ ఎయిరోడ్రోమ్‌లను 2024 నాటికి అభివృద్ధి చేయ‌వ‌ల‌సి ఉంది. వీటిని ఆర్‌సిఎస్‌-ఉడాన్ కింద వివిధ రౌండ్ల బిడ్డింగ్ అనంత‌రం కేటాయించారు.

 

ఈ స‌మాచారాన్ని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ స‌హాయ మంత్రి (ఇంఛార్జి) శ్రీ హ‌ర్‌దీప్‌సింగ్ పూరి ఈరోజు రాజ్య‌స‌భ‌లో ఒక లిఖిత పూర్వ‌క ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తెలిపారు.

***

 



(Release ID: 1657899) Visitor Counter : 214