రక్షణ మంత్రిత్వ శాఖ
బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు
Posted On:
21 SEP 2020 4:19PM by PIB Hyderabad
సైనికులకు వారి హోదా, వారు చేపట్టే కార్యకలాపాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు (బిపిజె) ,బాలిస్టిక్ హెల్మట్లను అందించడం జరుగుతుంది. 1,86,138 బిపిజెలు, 1,58, 279 బాలిస్టిక్ హెల్మెట్ల ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి కాంట్రాక్టును 2018 ఏప్రిల్ లో కుదుర్చుకోవడం జరిగింది. అంతర్గత కమ్యూనికేషన్ వ్వవస్థ కలిగిన బాలిస్టిక్ హెల్మెట్‌లు కూడా ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో ఉన్నాయి.
బిపిజెలను జనరల్ స్టాఫ్ గుణాత్మక అవసరాలకు అనుగుణంగా (జిఎస్‌క్యుఆర్) సేకరిస్తారు. దీనిని ఎప్పటికప్పుడు సాయుధ బలగాల అవసరాలను బట్టి సమీక్షిస్తారు.
బిపిజెలకు ఆపాదించగల సైనికుల మరణాల విషయంలో మరణానికి ప్రతిసారీ స్పష్టమైన కారణం తెలుసుకోవడం కష్టం.
ఈ సమాచారాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి , సభ్యుడు శ్రీకె.షణ్ముగం సుందరంకు ఈరోజు లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూఈ విషయం తెలియజేశారు.
***
(Release ID: 1657804)
Visitor Counter : 127