జౌళి మంత్రిత్వ శాఖ
దేశంలో పవర్‌లూమ్ రంగం అభివృద్ధి
Posted On:
22 SEP 2020 2:29PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం పవర్‌లూమ్ మరియు అనుబంధ ఉత్పత్తులు, సేవల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను (టెక్స్-ఫండ్) అమలు చేస్తోంది. పవర్‌టెక్స్ ఇండియా పథకంలో ఒక భాగంగా టెక్స్-ఫండ్‌ను 01.04.2017 నుంచి అమలు చేస్తున్నారు. టెక్స్ ఫండ్‌కు కనీస కార్పస్ రూ.35 కోట్లు. ఇందులో భారత ప్రభుత్వం రూ.24.50 కోట్లు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) కనీస రూ.10.50 కోట్లను సమకూర్చుతోంది. సిడ్బి వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ (ఎస్‌వీసీఎల్) 'టెక్స్-ఫండ్'కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. పవర్‌లూమ్ రంగంలోని సూక్ష్మ, చిన్న సంస్థలకు ఈక్విటీ పెట్టుబడులను అందించడం, బ్రాండ్‌లను సృష్టించడం, మేథో సంపత్తిని సృష్టించడం ద్వారా ఆయా పరిశ్రమలో ఆవిష్కరణలను పెంచడానికి మరియు పవర్‌లూమ్ సెక్టార్ మరియు అనుబంధ కార్యకలాపాల అభివృద్ధికి టెక్స్-ఫండ్
వీలు కల్పిస్తుంది. అర్హులైన వారు పవర్‌టెక్స్ ఇండియా పథకం ప్రయోజనాలను పొందటానికి బహుళ సహాయ సేవలను అందించడానికి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1800222017 కూడా ప్రారంభించబడింది. ఇందుకోసం ఐపవర్‌టెక్స్ అనే ఒక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఐపవర్‌టెక్స్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన
లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.
****
(Release ID: 1657800)