ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సండే సంవాద్-2 సందర్బంగా సోషల్ మీడియా ఉపయోగించేవారితో సమావేశమైన డాక్టర్ హర్ష్‌వర్ధన్
“ భవిష్యత్ మహమ్మారులను ఇండియా ఎదుర్కొనే విధంగా సిద్ధం చేయడానికి ప్రజారోగ్యం , ఇతర ఆరోగ్య సంస్కరణల్లో పెట్టుబడుల పెంపునకు ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెబుతున్న ఆత్మ నిర్భర్ భారత్ ”
“సార్స్ సిఒవి-2కి సంబంధించి ఇండియాలో చెప్పుకోదగిన ఉత్పరివర్తనం లేదు”
“ కోవిడ్ -19కు లాలాజల ఆధారిత పరీక్ష నిర్వహణను చురుకుగా పరిశీలిస్తున్న ఐసిఎంఆర్ ”
క్లినికల్ ట్రయల్స్‌లో ఒక టీకా వైఫల్యంపై వ్యక్తమైన సందేహాలను తొలగిస్తూ మంత్రి, నిపుణుల కమిఈ పునఃపరిశీలన తర్వాత మాత్రమే ట్రయల్స్ కొనసాగుతున్నాయని చెప్పారు.
Posted On:
20 SEP 2020 3:58PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఈరోజు రెండోసారి సండే సంవాద్ ప్లాట్‌ఫారంపై సామాజిక మాధ్యమాలకు సంబంధించిన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇందులో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులకు సంబంధించిన అంశాలే కాకుండా ప్రభుత్వ విధానం,సైన్సు రంగంలో ఇండియా అభివృద్ధి తదితర అంశాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్, స్వచ్ఛందంగా భారత్ బయోటెక్ వాక్సిన్‌కు ఒక వ్యక్తి, ఆయన కుమార్తె ముందుకు వచ్చిన విషయం తెలిసి వారిని అభినందించారు.
భవిష్యత్తులొ ఇలాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు తీసుకోనున్న పటిష్ట చర్యల గురించి ప్రస్తావిస్తూ మంత్రి , ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ దేశాన్ని పటిష్టం చేస్తుందని దీనితో, మనం ఎలాంటి విపత్తు,మహమ్మారినైనా ఎదుర్కొనగలమన్నారు. 2020 మే 12న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 20 ట్రిలియన్ రూపాయల ప్యాకేజిని ప్రకటించి ఇండియాను ఆత్మనిర్భర్ చేశారన్నారు.ఆత్మనిర్భర్ భారత్ , ప్రజారోగ్యానికి ప్రభుత్వ పెట్టుబడి, ఇతర ఆరోగ్య రంగ సంస్కరణలకు , భవిష్యత్ మహమ్మారులకు ఇండియాను సిద్ధం చేయడానికి ప్రభుత్వానికి గల చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.
వ్యయ ఫైనాన్స్ కమిటీ స్థాయిలో ఒక ప్రధాన ప్రతిపాదన పరిశీలనలో ఉందని, అందులో కింది అంశాలున్నాయని అయన అన్నారు.
-అంటు వ్యాధులకు సంబంధించి నిఘా, వాటిని గుర్తించిన వెంటనే ప్రాథమిక దశలోనే తగిన స్పందన
-అంటువ్యాధుల నియంత్రణకు జిల్లాఆస్పత్రులలో ప్రత్యేక హస్పిటల్ బ్లాకుల ఏర్పాటు
-సమీకృత ప్రజారోగ్య లేబరెటరీలర ఏర్పాటు
దేశంలో పోలియో నిర్మూలనను సాధించడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ , కోవిడ్ కరోనావైరస్ కొత్త పాథోజెన్ అని పోలియోకి ఉన్నట్టుగా దీనికి సంబంధించిన సమాచారం ఏదీ అందుబాటులో లేదని అన్నారు. సార్స్, ఎబోలా, ప్లేగ్ వంటి వాటిని గతంలో ఇండియా ఎదుర్కొన్న అనుభవం కోవిడ్ నియంత్రణలో కీలక పాత్ర వహించనున్నాయని అన్నారు. మరొకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి, ఇండియాలో సార్స్ సిఒవి-2 వైరస్ ఉత్పరివర్తనంలో పెద్ద మార్పేమీ ఇప్పటివరకూ కనిపించలేదని చెప్పారు. ఐసిఎంఆర్ పెద్ద సంఖ్యలో సార్స్ సిఒవి-2 వైరస్‌కుసంబంధించి గత కొద్దినెలలుగా వివిధ సందర్భాలలో సేకరించిన దేశవ్యాప్తంగా ప్రాతినిద్యం వహించే నమూనా స్ట్రెయిన్స్‌పై పరిశోధన చేస్తున్నదన్నారు. ఉత్పరివర్తనాలు, వైరస్
పుట్టుకు సంబంధించి అక్టోబర్‌నాటికి ఫలితాలు తెలియవచ్చన్నారు.
కోవిడ్ -19కు ఇటీవలి లాలాజల ఆధారిత పరీక్ష గురించి ప్రస్తావిస్తూ, ఐసిఎంఆర్ కొన్ని పరీక్షలను ధృవీకరించిందని, అయితే ఏదీ నమ్మకమైన పరీక్షా కనిపించలేదని అన్నారు.యుస్.ఎఫ్.డి.ఎ అనుమతించిన పరీక్షలకు సంబంధించిన కంపెనీలు ఇప్పటివరకూ భారత ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ఆయన చెప్పారు. ఐసిఎంఆర్ పరీక్ష పద్ధతిని చురుకుగా పరిశీలిస్తోందని,
నమ్మకమైన ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినపుడు వెంటనే తెలియజేస్తుందని ఆయన అన్నారు.
డాక్టర్ హర్షవర్ధన్ స్వయంగా వైద్యులు కావడంతో, కోవిడ్ క్లినికల్ మేనేజ్‌మెంట్ కు సంబంధించి సవివరంగా వివరించారు. కోవిడ్ పేషెంట్లకు హైడ్రాక్సి క్లోరోక్విన్, ప్లాస్మాథెరపీ చికిత్సల చుట్టూ ఉన్న అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. వయోధికులకు, ఇతర రకాల జబ్బులు ఉన్న వారికి కోవిడ్ ఎలా ప్రాణాంతకంగా ఉంటున్నదో ఆయన వివరించారు. వయోధికులలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉండడంతోపాటు సైటోకైన్ వృద్ధి చెందడాన్ని పరిశోధనలలో గమనించారన్నారు. అయితే అంతమాత్రం చేత యువతకు కోవిడ్ ముప్పులేదని కాదని , అయితే యువతలో ప్రాణాంతకమయ్యే రిస్కు తక్కువ అని ఆయన అన్నారు.
దేశంలో మెడికల్ ఆక్సిజన్ అందుఆటు గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ హర్షవర్ధన్, దేశంలో సరిపడినంత ఆక్సిజన్ సరఫరా ఉన్నదని అన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నదని ఆయన చెప్పారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేకించి రవాణా పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీటిని పంపినట్టు తెలిపారు.
ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రా జెనెకా వాక్సిన్ కాండిడేట్ గురించి వెల్లడైన భయాలను ఆయన కొట్టిపారేశారు.వాక్సిన్ అభివృద్ధి సంక్లిష్టమైన ప్రక్రియ అని, స్వతంత్ర పరిశీలక నిపుణుల కమిటీ ముందుకు వెళ్లాల్సిందిగా అనుమతి ఇచ్చిన తర్వాతే పరీక్షలు తిరిగి మొదలయ్యాయని తెలిపారు. భారతదేశంలో వివిధ క్లినికల్ పరీక్షలలో ఉన్న వాక్సిన్లకు సంబంధించిన తేడాలను ఆయన తెలియజేశారు.వాక్సిన్ ఫార్ములేషన్లు , డోస్‌లు, వాటిని ఉపయొగించే విధానం ఆయా వాక్సిన్లకు వేరని, అవి పనిచేసే తీరుకూడా వేరుగా ఉంటుందని అన్నారు. అయితే అంతిమంగా ప్రతి వాక్సిన్ ఫలితం మాత్రం ఆరోగ్యవంతులైన పౌరులలో నావెల్ కరోనావైరస్ కు వ్యతిరేకంగా రోనిరోధక శక్తిని పెంచడమే నని ఆయన అన్నారు.
డాక్టర్ హర్షవర్ధన్ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ వైద్యం పాత్ర గురించి కూడా మాట్లాడారు. ఆయుష్ మంత్రిత్వశాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చి (సిఎస్ఐఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసిఎంఆర్)తో కలసి ఆయుష్ ప్రాక్టీషనర్లు కోవిడ్ 19 సమస్యకు కనిపెట్టిన పరిష్కారాలను పరిశీలించేందుకు పరిశోధన ప్రొటోకాల్స్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఇప్పటివరకు ఏ ప్రత్యేక సంప్రదాయ మందును కోవిడ్ 19 చికిత్సకు ప్రత్యేకంగా ఆమోదముద్రవేయలేదు.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆయుష్ ప్రాక్టీషనర్లు కోవిడ్ -19పై పరిశోధనలు చేయడానికి , ఇందుకు సంబంధించి ఆయుర్వేద మందుల తయారీకి ఆధారాలు రూపొందించేందుకు అనుమతిచ్చినట్టు ఆయన చెప్పారు. ఆయుర్వేదంతో సహా ఇండియా లోని అత్యుత్తమ విధానాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు డబ్ల్యు.హెచ్.ఒ ఎక్సిక్యుటివ్ బోర్డు ఛఛైర్మన్‌హోదాలో తన వంతు కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ధారవిలో కోవిడ్ -19ను నియంత్రించడానికి సంబంధించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో ప్రపంచం చూసేందుకు పొందుపరిచినట్టు మంత్రి తెలిపారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కోవిడ్ వారియర్లకు చెందిన 155 కుటుంబాలు సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. మరణించినఈ కోవిడ్ వారియర్లలో 64 మంది డాక్టర్లు, 32 మంది ఆక్సిలరీ నర్సులు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, 14 మంది ఆశా వర్కర్లు, 45 మంది ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉన్నరని తెలిపారు.
ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి ప్రతిఒక్కరి మానసిక ఆరోగ్యంపై చెప్పుకోదగిన ప్రభావం చూపిందని, ప్రత్యేకించి ఎక్కువ రిస్కులో ఉన్నామని తెలిసిన వయోధికులలో ఇది ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. వయోధికులు తమ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డాక్టర్ హర్షవర్ధన్ సండే సంవాద్‌లో పలు చిట్కాలు తెలిపారు.
సామూహిక రోగనిరోధక శక్తి జనాభాలో 70 శాతం మందిలో ఏర్పడడానికి కొంత సమయం పడుతుందని మంత్రి అన్నారు. అందువల్ల ప్రభుత్వం ప్రస్తుతం వైరస్ నియంత్రణ, ఆస్పత్రి స్థాయిలోచికిత్సలను మిళితం చేస్తూ తగిన వ్యూహంపై దృష్టిపెట్టినట్టు చెప్పారు.
కోవిడ్ కాక ఇతర ప్రశ్నలకు డాక్టర్ హర్షవర్ధన్ సమాధానమిచ్చారు. మానవ వనరులను సైన్సువైపు మళ్లించే ప్రణాళికల గురించి,
లాక్‌డౌన్ సమయంలో చూసిన పరిశుభ్రమైన వాతావరణాన్నిసాధించడంలో ప్రభుత్వం పాత్ర గురించి వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రతి ఏటా ఇంజనీర్లు, సైన్సు గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్న ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం ఇండియా అని ఆయన గుర్తు చేశారు. తాజా అంచనాల ప్రకరాం, ఇండియాలో 3.42 లక్షల పూర్తికాలపు పరిశోధకులు ఉన్నారని, వీరిలో 50 శాతం మంది 45 సంవత్సరాలలోపు యువకులని చెప్పారు. 16శాతం మహిళలు (సుమారు 56,000 మంది). అలాగే పరిశోధకుల సంఖ్య గత ఆరు సంవత్సరాలలో 40 శాతం పెరిగిందన్నారు. గత 6 సంవత్సరాలలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. ఇండియా అద్భుతమైన జాతీయ సైన్స్, టెక్నాలజీ ఆవిష్కరణల విధానాన్ని రూపొందిస్తున్నదని, కేవలం సైన్స్ టెక్నాలజీని ప్రోత్సహించడమే కాక, సైన్సును కీలకమైనదిగా చేసి దేశ ఆర్థిక సామాజిక సత్వర ప్రగతికి దోహదపడేట్టుచేయనున్నట్టు తెలిపారు.
.లాక్‌డౌన్ సమయంలొ చూసినట్టు స్వచ్ఛమైన వాతావరణాన్ని సాధించే చర్యలలో ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఈ దిశగా పలు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ప్రధాన ణగరాలలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గత రెండు మూడు సంవత్సరాలలో గాలి నాణ్యత మెరుగుపడినట్టు డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.
***
(Release ID: 1657796)
Visitor Counter : 237