వ్యవసాయ మంత్రిత్వ శాఖ

కనీస మద్దతు ధర విధానం

Posted On: 21 SEP 2020 2:16PM by PIB Hyderabad

రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్‌మెంట్‌ల‌ అభిప్రాయాలను మరియు ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకొని 'వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్' (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా మొత్తం 22 తప్పనిసరి వ్యవసాయ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను(ఎంఎస్‌పీ) నిర్ణయిస్తుంది. పంట‌ల‌కు ఎంఎస్‌పీని సిఫారసు చేస్తున్నప్పుడు సీఏసీపీ వివిధ అంశాలను పరిగణ‌లోకి తీసుకుంటుంది. ఉత్పత్తి వ్యయ‌ము, దేశీయ మరియు ప్రపంచ మార్కెట్లలోని వివిధ పంటల డిమాండ్-సరఫరా పరిస్థితులు, దేశీయ మరియు అంతర్జాతీయంగా ఆయా పంట‌ల‌ ధరలు, పంటల ధరల‌ సమానత్వం, వ్యవసాయం మరియు వ్యవసాయేతర రంగాల మధ్య వాణిజ్య నిబంధనలు, మిగిలిన ఆర్థిక వ్యవస్థపై ధరల విధానం యొక్క ప్రభావం మరియు ఉత్పత్తి వ్యయంపై మార్జిన్‌గా కనీసం 50 శాతంను లెక్కించి  ఎంఎస్‌పీని సిఫార‌సు చేయ‌డం జ‌రుగుతుంది. 2018-19 కేంద్ర బడ్జెట్ ఎంఎస్‌పీ నిర్ణ‌యానికి గాను ముందుగా నిర్ణయించిన సూత్రం మేర‌కు.. ఎంఎస్‌పీ ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండాలని ప్ర‌క‌టించింది. దీని ప్రకారం, ప్రభుత్వం అన్ని ఖరీఫ్, రబీ మరియు ఇతర వాణిజ్య పంటల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ను పెంచింది. 2018-19 మరియు 2019-20 వ్య‌వ‌సాయ సంవ‌త్స‌రాల‌లో మొత్తం భారత దేశపు వెయిటెడ్ ఆవ‌రేజ్ కాస్ట్ ఆప్ ప్రొడ‌క్ష‌న్‌లో క‌నీసం 50 శాతం మేర తిరిగి వ‌చ్చేలా ఈ చ‌ర్య‌ను చేపట్టారు. ఇదే సూత్రానికి అనుగుణంగా 2020-21 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని ఖరీఫ్ పంటలకు తప్పనిసరి ఎంఎస్‌పీ పెంపును ప్రభుత్వం ఇటీవల (జూన్ 1, 2020) ప్రకటించింది. ఎంఎస్‌పీ అనేది ఒక్క ప్రాంతం లేదా రాష్ట్ర-నిర్దిష్ట కాదు.. మొత్తం దేశం కోసం నిర్ణయించబడుతుంది. గత మూడు సంవత్సరాలుగా ఎంఎస్‌పీని ప్రభుత్వం ప్రకటించిన వాటిలో.. 22 తప్పనిసరి పంటలు 14 ఖరీఫ్ పంటలు ఉన్నాయి. అవి ఏమిటంటే వరి (కామన్ మరియు గ్రేడ్-ఏ‌), జొన్న‌లు (హైబ్రిడ్ మరియు మాల్దండి రకాలు), స‌జ్జ‌లు, మొక్క జొన్న, రాగి, పెస‌ర్లు, మినుములు, ఉర‌ద్‌, వేరుశనగ, సోయాబీన్, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఒడిస‌లు విత్త‌నాలు, పత్తి (మధ్యస్థ ప్రధాన, పొడవైన ప్రధానమైనవి) మొద‌లైన‌వి ఉన్నాయి. ఇవి కాకుండా ఆరు రబీ పంటలు అవేమిటంటే.. గోధుమ, బార్లీ, శ‌న‌గ‌లు, ప‌ప్పుధాన్యాలు (కాయధాన్యాలు), రాప్సీడ్ మ‌రియు ఆవాలు, కుసుమ త‌దిత‌రాలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు వాణిజ్య పంటలు అవేమిటం‌టే జనపనార మరియు కొప్రా (మిల్లింగ్ మరియు బాల్ కొప్రా) ఉన్నాయి. వీటికి అదనంగా, టోరియా మరియు డి-హస్క్డ్ కొబ్బరి కోసం ఎంఎస్‌పీ కూడా వరుసగా రాప్సీడ్ & ఆవాలు మరియు కొప్రా యొక్క ఎంఎస్‌పీ నిర్ణయించబడినాయి. లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ నిన్న ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియ‌జేశారు.
                               

****



(Release ID: 1657469) Visitor Counter : 445