హోం మంత్రిత్వ శాఖ
వ్యవసాయ సంస్కరణలపై రెండు కీలకమైన బిల్లులను పార్లమెంటు ఆమోదించడం, భారత వ్యవసాయ రంగంలో అపూర్వమైన అభివృద్ధి యుగానికి ఆరంభంగా అభివర్ణించిన - కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా
"ఈ బిల్లుల ఆమోదం మన రైతుల సమగ్ర అభివృద్ధి మరియు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం పట్ల ప్రధానమంత్రి మోదీ గారి అచంచలమైన పరిష్కారాన్ని ప్రతిబింబిస్తుంది"
"ఓటు బ్యాంకు రాజకీయాలలో నిమగ్నమై, దశాబ్దాలుగా రైతులను అంధకారంలో మరియు పేదరికంలో ఉంచిన వ్యక్తులు, ఈ రోజు, రైతుల ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా వారిని తిరిగి రెచ్చగొట్టడానికి మరియు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు."
"నా రైతు సోదరులకు మంచి చేయాలని ఎవరైనా ఆలోచిస్తున్నారంటే, అది ప్రధానమంత్రి మోదీ జీ అని నేను భరోసా ఇవ్వాలనుకుంటున్నాను"
"మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యవసాయ సంస్కరణలు, మన రైతు సోదరులను మధ్యవర్తుల బారి నుండి విముక్తి చేస్తాయి"
"ఈ వ్యవసాయ సంస్కరణల ద్వారా, రైతులు తమ ఉత్పత్తులను వారు కోరుకున్న చోట విక్రయించుకోవడం ద్వారా సరైన ధరను పొందగలుగుతారు, ఇది వారి ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తుంది"
"ఎమ్.ఎస్.పి. వ్యవస్థ యధావిధిగా కొనసాగదాంతో పాటు, ప్రభుత్వ సేకరణ కూడా కొనసాగుతుంది"
నాడు పోస్టు చేయడమైనది:
20 SEP 2020 8:23PM by PIB Hyderabad
పార్లమెంటు ఈ రోజు వ్యవసాయ సంస్కరణలపై రెండు కీలకమైన బిల్లులను ఆమోదించడాన్ని, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసించారు. ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా వరుసగా ట్వీట్లు చేస్తూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కి కృతజ్ఞతలు తెలియజేశారు. "ఈ బిల్లుల ఆమోదం మన రైతుల సమగ్ర అభివృద్ధి మరియు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం పట్ల ప్రధానమంత్రి మోదీ గారి అచంచలమైన పరిష్కారాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశ వ్యవసాయ రంగంలో అపూర్వమైన అభివృద్ధికి ఇది నాంది." అని ఆయన పేర్కొన్నారు.
"ఓటు బ్యాంకు రాజకీయాలలో నిమగ్నమై, దశాబ్దాలుగా రైతులను అంధకారంలో మరియు పేదరికంలో ఉంచిన వ్యక్తులు, ఈ రోజు, రైతుల ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా వారిని తిరిగి రెచ్చగొట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు." అని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. "నా రైతు సోదరులకు మంచి చేయాలని ఎవరైనా ఆలోచిస్తున్నారంటే, అది ప్రధానమంత్రి మోదీ జీ అని నేను భరోసా ఇవ్వాలనుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
"మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యవసాయ సంస్కరణలు, మన రైతు సోదరులను మధ్యవర్తుల బారి నుండి విముక్తి చేస్తాయి" అని కేంద్ర హోంమంత్రి అన్నారు.
"ఈ వ్యవసాయ సంస్కరణల ద్వారా, రైతులు తమ ఉత్పత్తులను వారు కోరుకున్న చోట విక్రయించుకోవడం ద్వారా సరైన ధరను పొందగలుగుతారు, ఇది వారి ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తుంది" అని శ్రీ అమిత్ షా వివరించారు.
"ఈ నిర్ణయం తరువాత కూడా, ఎమ్.ఎస్.పి. వ్యవస్థ కొనసాగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సేకరణ కూడా కొనసాగుతుంది," అని ఆయన తెలియజేశారు.
రాజ్య సభ, ఈరోజు, రైతుల ఉత్పత్తి వ్యాపారం మరియు వాణిజ్యం (అభివృద్ధి మరియు సదుపాయాలు) బిల్లు, 2020 మరియు రైతుల (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా ఒప్పందం మరియు వ్యవసాయ సేవల బిల్లు, 2020 లను ఆమోదించింది. ఈ రెండు బిల్లులను లోక్ సభ ఇప్పటికే ఆమోదించింది.
రైతుల ఉత్పత్తి వ్యాపారం మరియు వాణిజ్యం (అభివృద్ధి మరియు సదుపాయాలు) బిల్లు, 2020, రైతులు మరియు వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మరియు కొనుగోలుకు సంబంధించిన ఎంపిక స్వేచ్ఛను పొందడానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. ఇది సమర్థవంతమైన, పారదర్శక మరియు ఎటువంటి అడ్డంకులు లేని రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి పోటీ, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల ద్వారా గిట్టుబాటు ధరలను సులభతరం చేస్తుంది.
వ్యవసాయ ఒప్పందాలపై జాతీయ విధానాన్ని అందించడానికి, రైతుల (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా ఒప్పందం మరియు వ్యవసాయ సేవల బిల్లు, 2020 ప్రయత్నిస్తుంది. వ్యవసాయ-వ్యాపార సంస్థలు, ప్రాసెసర్లు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు లేదా వ్యవసాయ సేవలకు పెద్ద చిల్లర వ్యాపారులు మరియు భవిష్యత్ వ్యవసాయ ఉత్పత్తులను పరస్పరం అంగీకరించిన గిట్టుబాటు ధరల విధానంలో సరసమైన, పారదర్శక పద్ధతిలో మరియు దానికి సంబంధించిన విషయాల కోసం విక్రయించే సందర్భంలో ఈ బిల్లు రైతులను రక్షిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది.
*****
(రిలీజ్ ఐడి: 1657158)
సందర్శకుల సూచీ సంఖ్య : : 164