సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎస్సీ, ఓబీసీ వర్గాల స్వయం సహాయ సంఘాలు, వ్యక్తిగత లబ్ధిదారుల కోసం వడ్డీ రాయితీపై సాంఘిక న్యాయం-సాధికారత శాఖ కొత్త ఆర్థిక నమూనా అమలు
Posted On:
20 SEP 2020 4:25PM by PIB Hyderabad
కేంద్ర సాంఘిక న్యాయం-సాధికారత మంత్రిత్వశాఖ వడ్డీ రాయితీపై కొత్త ఆర్థిక నమూనాను అమలు చేయనుంది. ప్రత్యేకించి ఎస్సీలు, ఓబీసీ స్వయం సహాయ సంఘాలు, వ్యక్తిగత లబ్ధిదారుల కోసం దీన్ని ప్రవేశపెట్టనుంది. ఎస్సీ లబ్ధిదారుల కోసం షెడ్యూల్డు కులాల జాతీయ ఆర్థిక సహాయ-అభివృద్ధి కార్పొరేషన్ (NSCFDC), ఓబీసీ స్వయం సహాయ సంఘాలు, వ్యక్తిగత లబ్ధిదారుల కోసం వెనుకబడిన తరగతుల జాతీయ ఆర్థిక సహాయ-అభివృద్ధి కార్పొరేషన్ (NBCFDC) ఈ పథకాన్ని అమలు చేస్తాయి.
జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) లేదా జాతీయ పట్టణ జీవనోపాది కార్యక్రమం (ఎన్‌యూఎల్‌ఎం) లేదా నాబార్డ్/వ్యక్తిగత లబ్ధిదారులుగా నమోదై, ప్రభుత్వరంగ-ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అదేతరహా ఆర్థిక సహాయ సంస్థలు లేదా రుణవితరణ సంస్థల ద్వారా రుణాలు తీసుకున్న అర్హతగల స్వయం సహాయ సంఘాలు, వ్యక్తులకు ప్రత్యక్ష స్వల్ప వడ్డీ లబ్ధి కల్పించడమే ఈ కొత్త నమూనా లక్ష్యం. అంతేకాకుండా సమాజంలోని అణగారిన వర్గాలకు సహాయం దిశగా మంత్రిత్వశాఖ ఇప్పటికే కింద పేర్కొన్న రెండు పథకాలను అమలు చేస్తోంది.
- “ఓబీసీ, ఈబీసీల కోసం విదేశీ చదువుకు డాక్టర్ అంబేడ్కర్ విద్యా రుణం”: ఈ పథకం కింద దేశంలోని ఇతర వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థుల విదేశీ చదువుల కోసం రూ.20 లక్షలదాకా రుణంమీద వడ్డీలో రాయితీని నోడల్ బ్యాంకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు అన్ని వనరులనుంచీ వార్షికాదాయం రూ.8 లక్షలదాకా ఉన్నట్లయితే ఈ పథకం కింద రుణానికి అర్హులు.
- వెనుకబడిన తరగతుల పేదకుటుంబాల వార్షికాదాయం అన్ని వనరులనుంచీ రూ.3.00 లక్షలకన్నా తక్కువగా ఉండి, ప్రధానంగా స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆదాయార్జనను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీల (ఎస్సీఏ) ద్వారా గరిష్ఠంగా రూ.15 లక్షలదాకా వడ్డీ రాయితీ రుణం లభిస్తుంది.
ఈ మేరకు కేంద్ర సాంఘిక న్యాయం-సాధికారతశాఖ మంత్రి శ్రీ కృష్ణపాల్ గుర్జర్ ఇవాళ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.
***
(Release ID: 1657045)